twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడు ఆ బాధ లేదు.. ఆ పాత్రలు చేయడానికి ఎన్నడూ భయపడను.. అదితిరావు

    By Rajababu
    |

    Recommended Video

    Heroine Aditi Rao Hydari Exclusive Interview With Filmibeat

    భారతీయ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన యువ తారల్లో అదితిరావు ఒకరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అదితిరావు బాలీవుడ్‌లో తనదైన రీతిలో రాణిస్తున్నారు. వనపర్తి సంస్థానానికి చెందిన రాజకుటుంబంలో జన్మించిన అదితి 2006లో మలయాళ చిత్రం ప్రజాపతితో కెరీర్ ప్రారంభించారు. సుధీర్ మిశ్రా రూపొందించిన యే సాలీ జిందగీ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత రాక్‌స్టార్, ఖూబ్‌సూరత్, వజీర్, పద్మావతి చిత్రంలో నటించారు. ప్రస్తుతం తెలుగు చిత్రం సమ్మోహనంలో హీరో సుధీర్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 12 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమె తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. అదితి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

    సమీరా రాథోడ్‌ పాత్రలో

    సమీరా రాథోడ్‌ పాత్రలో

    సమ్మోహనం చిత్రంలో సమీరా రాథోడ్ అనే హీరోయిన్ పాత్రను పోషిస్తున్నాను. మంచి కెరీర్ కోసం ప్రయత్నించే నటి. అందుకోసం ఆమె చాలా కష్టపడుతుంటారు. ఓ హిందీ నటి తెలుగు చిత్రంలో నటించే పాత్రను పోషించాను. వీటన్నింటికంటే ముఖ్యంగా ఈ చిత్రం ఓ లవ్ స్టోరి. రెండు విభిన్నమైన అభిరుచుల ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ప్రేమకథ.

    నిజజీవితంలోని పాత్రను

    నిజజీవితంలోని పాత్రను

    తొలిసారి నేను నిజజీవితంలోని పాత్రను సమ్మోహనం చిత్రంలో పోషిస్తున్నాను. పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంటుంది. ఇందుకోసం పెద్దగా కష్టపడలేదు. ఇప్పటివరకు ఉన్న అనుభవంతో పాత్రకు అనుగుణంగా ఒదిగిపోయాను. సినిమా అంటే ఇష్టం. నటించడం తప్ప మరో ఆలోచన లేదు. ఓ రాత్రి అంతా నిద్ర లేకున్నా మరుసటి రోజున నేను కెమెరా ముందు యాక్టివ్‌గా ఉంటాను.

    మంచి దర్శకులతో పనిచేయాలని

    మంచి దర్శకులతో పనిచేయాలని

    తెలుగులో నాకు ఇది తొలి అవకాశమైనప్పటికీ.. నేను ఎప్పడు భాషను పరిగణనలోకి తీసుకొను. మంచి దర్శకులతో పనిచేయాలని ఉంటుంది. మంచి కథలను చెప్పే డైరెక్టర్లంటే చాలా ఇష్టం. సమ్మోహనం చిత్రం కోసం నన్ను దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు సంప్రదించింది పది నిమిషాలు కథ చెప్పారు. ఆయన చెప్పిన విధానం నచ్చడంతో సమీరా పాత్ర చేయాలని నిర్ణయించుకొన్నారు.

    దర్శకుడి విజన్‌కు తగినట్టుగా

    దర్శకుడి విజన్‌కు తగినట్టుగా

    సమ్మోహనం చిత్రంలో నేను సమీరా రాథోడ్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తానన్నదనే విషయాన్ని నేను చెప్పలేను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాలి. పాత్ర పరిధి మేరకు నేను వందశాతం పనిచేశాను. పూర్తిగా న్యాయం చేశాను. దర్శకుడి విజన్‌కు తగినట్టుగా నటించాను. హీరోయిన్ అయినప్పటికీ నేను మంచి నటిని. టాలెంట్‌ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తాను. నటినే కాకుండా ఓ ఆడియెన్ కూడా. ప్రేక్షకుల మాదిరిగానే ఆలోచిస్తాను. సినిమా అందరికీ నచ్చుతుంది.

    సుధీర్‌బాబుతో నటించడం

    సుధీర్‌బాబుతో నటించడం

    హీరో సుధీర్‌బాబుతో నటించే అవకాశం రావడం గ్రేట్. అతడి సినిమాలు చూడలేదు గానీ ఆయన గురించి చాలా విన్నాను. అతను హిందీ భాగీ చిత్రంలో నటించారు. ఆయన గురించి నాకు తెలుసు. సెట్లో చాలా కామ్‌గా ఉంటారు. కెమెరా ముందుకు ఓసారి వచ్చాడంటే చాలా లైవ్లీగా ఉంటారు. ఎలాంటి సీన్‌నైనా సులభంగా చేసేస్తారు. అలాంటి వారితో నటించడమంటే నేను చాలా ఇష్టపడుతాను. నేను నేచురల్‌గా నటిస్తాను. సుధీర్ బాబు కూడా అలానే నటిస్తారు. అందుకే సుధీర్ నటన అంటే ఇష్టం.

    మోహన్ సార్ సూచన మేరకు

    మోహన్ సార్ సూచన మేరకు

    సమ్మోహనం చిత్రానికి నేను డబ్బింగ్ చెప్పాను. మోహన్ సార్ సూచన మేరకు నేను డబ్బింగ్‌కు సిద్ధమయ్యాను. హైదరాబాద్‌లో పుట్టాను కానీ ఇక్కడ పెరుగలేదు. అందుకే తెలుగు నేర్చుకోలేదు. మా ఫ్యామిలీ జాతీయ సమైక్యతకు నిదర్శనం. రకరకాల భాషల మాట్లాడే వారు ఉన్నారు. కానీ నేను హిందీ, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకొన్నాను. మా తాత నన్ను తెలుగులో గానీ, తమిళంలో గానీ మాట్లాడమని బలవంతపెట్టేవారు.

    తెలుగు నేర్చుకోకపోవడంపై

    తెలుగు నేర్చుకోకపోవడంపై

    తెలుగు నేర్చుకోలేదనే బాధ నాకు ఇప్పుడు కలుగలేదు. హైదరాబాదీ అయినప్పటికీ భాష రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే నేను తెలుగు కంటే సంస్కృతిని నేర్చుకొన్నాను. అది నా జీవితానికి బాగా ఉపయోగపడింది. కాకపోతే తెలుగుతో నా జీవితం ముడిపడింది.

    భాష పట్టింపు లేదు..

    భాష పట్టింపు లేదు..

    2010లో యాక్టింగ్ కోసం ముంబై వెళ్లాను. బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. మంచి దర్శకులతో పనిచేశాను. భాష ఏదైనా నాకు నటించడం అంటే ఇష్టం. మణిరత్నం సార్ నుంచి పిలుపు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే నాకు ఆయన దర్శకత్వంలో నటించాలన్నది చిన్నతనం నుంచి ఓ కోరిక ఉంది. బొంబాయిలో మనీషా కోయిరాలాను చూసినప్పుడు ఆమెలో నన్ను ఊహించుకొన్నాను. అలాంటి దర్శకుడు అవకాశం ఇస్తే కాదనలేకపోయాను.

    అతిథి పాత్రలపై అధితిరావు

    అతిథి పాత్రలపై అధితిరావు

    పద్మావతి చిత్రంలో నేను ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాను. హీరోయిన్ పాత్రలోనే నటించాలనే ఉద్దేశం నాకు లేదు. మంచి పాత్ర ఉంటే తప్పకుండా నటిస్తాను. హాలీవుడ్‌లో జెన్నిఫర్ లోపేజ్, ఇతర నటీనటులు గెస్ట్ పాత్రల్లో కనిపించడానికి భయపడరు. ఎందుకంటే పాత్రలో ఉండే బలాన్ని చూస్తారు. పాత్ర ఎంపికలో నేను కూడా భయపడను. మంచి పేరు వస్తుందనుకొంటే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తాను.

    ఈ దర్శకులు అంటే ఇష్టం

    ఈ దర్శకులు అంటే ఇష్టం

    కథను గొప్పగా చెప్పే ఏ దర్శకులతోనైనా నటించడానికి సిద్ధం. తమిళంలో మణిరత్నం, కార్తీక్ సుబ్బరాజ్, మిస్కిన్, గౌతమ్ మీనన్ అంటే ఇష్టం. తెలుగులో శేఖర్ కమ్ముల, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి ప్రత్యేకమైన విజన్ ఉండేవారితో నటించడమంటే ఇష్టం. ఇటీవల వెంకీ అట్లూరి తీసిన తొలిప్రేమ చిత్రం బాగా నచ్చింది.

    English summary
    Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th. In this occassion, Actress Aditi Rao Hydari speaks to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X