డెకాయిట్ హీరోయిన్ ఛేంజ్.. శృతి హాసన్ ను తీసేయడానికి కారణమిదే.. అడివి శేషు
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేషు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్నారు. తన దైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేషు సినిమాలకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. ఇక నెక్ట్స్ రాబోయే చిత్రం డెకాయిట్ గురించి అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోవైపు అడివి శేషు సమయం ఉన్నప్పుడల్లా పలు ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో మెరుస్తూ సందడి చేస్తున్నారు. తన చిత్రాలపై ఇంట్రెస్ట్ పెంచుతున్నారు. ఈక్రమంలో డెకాయిట్ నుంచి హీరోయిన్ శృతి హాసన్ ను తొలగించడానికి కారణాన్ని తెలియజేశారు. ఆ వివరాల్లోకి..
టాలీవుడ్ లో సెన్సేషనల్ గా..
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కథలతో సినిమాలను తీసుకొచ్చి ప్రేక్షకులను అలరించారు అడివి శేషు. తొలుత కర్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అమెరికాలో పుట్టి పెరిగిన అడివి శేషు తెలుగు ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకోవడం విశేషం. రైటర్ గా, దర్శకుడిగా, నటుడిగా మల్టీ టాలెంట్ ను చూపించి టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు అడివి శేషు. కిస్, లేడీస్ అండ్ జెంటిమెన్, క్షణం, అమీ తుమీ, గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వంటి చిత్రాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారారు.

డెకాయిట్ నుంచి శృతి హాసన్ ఔట్..
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో అడివి శేషు డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్వయంగా తానే కథ అందిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీలోనూ పార్లర్ గా చిత్రీకరణ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సునీల్ నారంగ్ కో-ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో తొలుత శృతి హాసన్ ను హీరోయిన్ గా ప్రకటిస్తూ అడివి శేషు పోస్టర్లను రిలీజ్ చేశారు. కానీ ఆ కొద్దిరోజులకు మళ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. శృతి హాసన్ ను తప్పించారు.
మృణాల్ ఎంట్రీ ఇలా..
దీనిపై తాజాగా అడివి శేష్ స్పందించారు. శృతి హాసన్ ను మేము డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పించలేదని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కూలి, మరిన్ని ప్రాజెక్ట్స్ తో శృతి హాసన్ బిజీగా ఉండటం కారణంగానే తప్పుకుంది. అది కూడా చాలా ఫ్రెండ్లీగానే సినిమా నుంచి తప్పుకున్నారని చెప్పారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. తనను కూడా సినిమా విషయంలో చాలా టైమ్ తీసుకోవడం ఒకటైతే, శృతి హాసన్ కు మల్టీపుల్ ప్రాజెక్ట్స్ ఉండటం మరో కారణం. ఇక ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ ను సంప్రదించారు. సీతారామంలో ఆమె వర్క్ నాకు బాగా నచ్చింది. దాంతోనే డెకాయిట్ లోకి హీరోయిన్ గా ఎంపిక చేశామని తెలిపారు.
రాబోయే చిత్రాలు..
ఇక శృతి హాసన్ కొద్ది రోజుల్లో రజనీకాంత్ కూలి చిత్రంతో ప్రేక్షకులను అలరించనుంది. అలాగే తమిళంలో ట్రైన్, జన నాయగన్, ప్రభాస్ సలార్ 2లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు అడివి శేషు డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ తో పాటు గూఢాచారి 2 ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీ ఉన్నారు. ఇక మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్ AA22xA6 ప్రాజెక్ట్ లో ఐదు హీరోయిన్లలో ఒక హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











