Adivi Shesh Interview నాని, మహేష్‌కు అలాంటి సెన్సిబులిటీస్.. మేజర్, హిట్ సినిమా విషయంలో అంటూ అడివి శేష్

నిర్మాతగా నాని, దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న హిట్ 2 మూవీ డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అడివి శేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ సినిమాకు ముందు నాకు టెన్షన్ ఉంటుంది. ఎక్సైట్‌మెంట్ చాలా తక్కువ. రిలీజ్‌కు ముందే సినిమాను కొంత మందికి చూపించాం. వారు ఫీలైన తీరు.. కొన్ని ట్విస్టులకు వారి రెస్పాన్స్ మాకు సినిమాపై భారీగా నమ్మకం కుదిరింది. అయితే హిట్ ఫ్రాంచైజీలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. విశ్వక్ సేన్ ఆల్రెడి చేశాడు.

అతడి నుంచి ప్రాజెక్టుకు లాగేసుకోవాలని అనుకోలేదు. అయితే నాని, శైలేష్ కొలను నచ్చ జెప్పారు. ఈ సినిమాను ఫ్రాంచైజీగా చేయకుండా.. ఒక యూనివర్స్‌గా మలచాలని అనుకొన్నాం. అన్ని ఫ్రాంచైజీల హీరోలను కలిపి నేషనల్ లెవెల్‌లో ఓ కేసును డీల్ చేసే విధంగా కథ చేయాలని ఉందని చెప్పడంతో కన్విన్స్ అయ్యాను అని అడివి శేష్ చెప్పారు. ఇంకా అడివి శేష్ సినిమా గురించి మాట్లాడుతూ..

ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు అంటూ

ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు అంటూ

హిట్ 2 సినిమా కోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేకపోయింది. మేజర్ సినిమా షూటింగ్ చివర్లో హిట్ 2 సినిమా మొదలైంది. అప్పటికే పోలీస్ ఆఫీసర్‌కు ఉండాల్సిన ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ సరిపోయింది. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది.

ఈ సీరియస్‌గా సాగే సినిమాలో మీనాక్షి చౌదరీతో లవ్ ట్రాక్ ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. కథలో జొప్పించినట్టు ఉండదు. మీనాక్షి చౌదరీ పాత్ర సెంటర్‌గా హిట్2 సాగుతుంది అని అడివి శేష్ అన్నారు.

మేజర్ సినిమా సమయంలో

మేజర్ సినిమా సమయంలో

నాని ప్రొడ్యూసర్‌గా నాకు మంచి సహకారం అందించారు. యాక్టర్‌కు ఉండే సెన్సిబిలిటీస్‌ను ముందే అర్ధం చేసుకొంటారు. మేము ఏదైనా చెప్పాలనుకొంటే.. అది చెప్పే లోపే తాను అర్ధం చేసుకొంటాడు. అంతకు ముందు మేజర్ సినిమా సమయంలో మహేష్ బాబుతో అలాంటి ఈక్వేషన్ ఉండేది. ప్రతీ విషయంపై వెంట వెంటనే సొల్యూషన్ లభించేది అని అడివి శేష్ తెలిపారు.

నాకు నచ్చిన సినిమా ఖైదీ..

నాకు నచ్చిన సినిమా ఖైదీ..

హిట్ 2 సినిమా క్లైమాక్స్‌లో కొత్త అడివి శేష్‌ను చూస్తారు. అలాగే హిట్ 3లో మరో హీరోగా కూడా నేను కనిపిస్తాను. నా కెరీర్‌లో కొత్త రకమైన చిత్రం హిట్ 2. హిట్ 2 విషయానికి వస్తే.. ఖైదీ మాదిరిగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన విక్రమ్ సినిమా మాదిరిగా హిట్ 3 ఉంటుంది. హిట్ 3 చిత్రం విక్రమ్ మాదిరిగా భారీ విజయం సాధించాలని కోరుకొంటున్నాను. నాకు నచ్చిన పది సినిమాల్లో ఖైదీ ఒకటి అని అడివి శేష్ పేర్కొన్నారు.

చెడుపై మంచి విజయం

చెడుపై మంచి విజయం

హిట్ 2 సినిమా కథ విషయానికి వస్తే.. చెడుపై మంచి విజయం. నాకు రక్తపాతం ఉండే సినిమాలు నచ్చవు. ఇప్పటి వరకు కొన్ని హారర్; క్రైమ్ బేస్డ్ హాలీవుడ్ సినిమాలు చూడలేదు. హారర్ సినిమాలు నాకు శరీరంలో ఒకరకమైన మార్పులు వస్తాయి. అందుకే అలాంటి క్రైమ్ చిత్రాలు నేను చూడను అని అడివి శేష్ అన్నారు.

హిందీలో హిట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?

హిందీలో హిట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?

హిట్ 2 సినిమాను హిందీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు రాజమౌళి సూచన మేరకు మేము ప్రాపర్‌గా హిందీలో మంచి రిలీజ్ డేట్ చూసుకొని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హిందీలో కూడా నేను డబ్బింగ్ చెప్పాలని అనుకొంటున్నాను. కన్నడలో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం అని అడివి శేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X