‘Mangalavaaram అజనీష్ మ్యూజిక్‌తో పూనకాలే పునకాలు.. చివరి 45 నిమిషాల్లో ట్విస్టులే ట్విస్టులు’
అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, అజ్మల్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు నటించారు. నవంబర్ 17తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ అజయ్ భూపతి మీడియాతో మాట్లాడుతూ..
మంగళవారం సినిమా డార్క్ మిస్టీరియస్ థ్రిల్లర్. తెలుగు నేటివిటితో ఈ సినిమాను పూర్తిగా అవుట్ డోర్‌లోనే షూట్ చేశాం. సినిమా మొత్తం నైట్ ఎఫెక్ట్‌లో షూట్ చేశాం. మూవీ స్క్రీన్ ప్లే బేస్‌గా సాగుతుంది. కొత్త కొత్త పాయింట్స్‌తో సినిమా ఉంటుంది.ట్విస్టులు రివీల్ చేసే క్రమం ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తుంది.ఇది హారర్ సినిమా కాదు. ఒక అమ్మాయి భావోద్వేగమైన జీవితానికి సంబంధించిన కథ అని అజయ్ భూపతి చెప్పారు.

పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూసి అందరూ షాక్ అవుతారు. భావోద్వేగాల సమ్మేళనంతో ఉండే పాత్రను తన కెరీర్ మళ్లీ చేయలేనంతగా ఫెర్ఫార్మెన్స్ చేసింది. నా మీద ఉన్న నమ్మకంతోనే ఇలాంటి టిపికల్ క్యారెక్టర్‌ను చేసింది. RX100 సినిమా నాతో కలిసి చేసింది. ఆ నమ్మకంతోనే నేను చెప్పిన కథను ఒప్పుకొన్నది. పాయల్ కంటే ముందు చాలా మంది అమ్మాయిలకు చెప్పాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. పాయల్ ధైర్యంగా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది.
తెలుగులో భారీ అంచనాలతో రూపొందిన మంగళవారం సినిమా పాన్ ఇండియా వైడ్‌గా డిసెంబర్ రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను కన్నడలో మంగళవారం టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నాం. కన్నడలో మంగళవార అని పెట్టాలి. కానీ ఆ టైటిల్ వేరే వారి వద్ద ఉంది. ఆ టైటిల్ తీసుకోవాలని ట్రై చేశాం. కానీ వీలుకాలేదు. అందుకే కన్నడలో మంగళవారం టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నాం. తమిళంలో చువ్వై కల్మయై, మలయాళంలో చువ్వై ఛా, హిందీలో మంగళవారం అనే టైటిల్స్‌తో రిలీజ్ చేస్తున్నాం అని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు.

కాంతార సినిమా రిలీజైన వారం రోజుల తర్వాత అజనీష్‌ను కలిశాను. ఆయన ఇచ్చిన సౌండింగ్ బాగా నచ్చాయి. పాటలు బాగా చేశారు. అవన్నీ నచ్చి ఆయనతో ఈ సినిమాకు మ్యూజిక్ చేయించాను. ఈ సినిమాకు అజనీష్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్. థియేటర్‌లో పునకాలే.. పూనకాలు.. సౌండ్ డిజైనర్‌గా రాధాకృష్ణ వ్యవహరించారు. వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా భాగా వచ్చింది అని అజయ్ భూపతి అన్నారు.
మంగళవారం సినిమాకు నేను నిర్మాతగా కూడా వ్యవహరించాను. సినిమాను ప్రొడ్యూస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకొన్నాను. నా బ్రదర్ సురేష్ వర్మకు చెబితే.. మనం కలిసి చేద్దామని అన్నారు. స్వాతిని పరిచయం చేయడంతో ఈ సినిమా కథ నచ్చి నిర్మాతగా మారారు.ఈ కథను నిర్మాత స్వాతి ఒప్పుకోవడం నాకు నైతికంగా మరింత బలాన్ని ఇచ్చింది.
మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత కాంబినేషన్‌లో సీన్లు ఉండవు. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మూవీ చివరి 45 నిమిషాల్లో ట్విస్టులపై, ట్విస్టులు ఉంటాయి.ట్విస్టులు కూడా సాధారణంగా ఉండవు. నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి అని అజయ్ భూపతి చెప్పారు.


Click it and Unblock the Notifications











