CSI అంటే ఏమిటి? ఆది సాయికుమార్‌తోనే ఎందుకు తీశామంటే? నిర్మాత అజయ్ శ్రీనివాస్ (ఇంటర్వ్యూ)

యువ హీరో ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం CSI సనాతన్. చాగంటి ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం మార్చి 10వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సస్సెన్స్ థ్రిల్లర్ సినిమాపై టీజర్లు, ఇతర అంశాలు మంచి అంచనాలు పెంచాయి. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...

చాగంటి ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించిన తొలి చిత్రమిది. దర్శకుడు శివశంకర్ దేవ్ కథ చెప్పిన తీరు నచ్చడంతో ఈ సినిమాను నిర్మించాలని అనుకొన్నాను. థ్రిల్లర్ సినిమాలంటే రీమేక్ అనుకొంటారు. కానీ ఇది ఒరిజినల్ కథ. CSI అంటే ఏమిటనే సందేహం కలుగు వచ్చు. సీఎస్ఐ అంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఫొరెన్సిక్ పరిశోధన నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది అని అజయ్ శ్రీనివాస్ అన్నారు.

Ajay Srinivas interview about CSI Sanatan and Aadi Saikumar

CSI సనాతన్‌కు పక్కాగా సరిపోయే కథ. ఆయనతోనే సినిమా చేయాలని చాలాకాలం వెయిట్ చేశాం. ఈ పాత్రకు ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ బాగా సూట్ అయ్యాయి. ఆది సాయికుమార్‌కు తన కెరీర్‌లో మంచి విజయం లభిస్తుందనే అభిప్రాయంలో ఉన్నాం. ఆది నాకు అన్న లాంటి వారు అని అజయ్ శ్రీనివాస్ చెప్పారు.

సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో అందరికి తెలుసు. అందుకే అనీష్ సోలోమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకొన్నాం. రీరికార్డింగ్ అద్బుతంగా ఉంది. టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. శేఖర్ సినిమాటోగ్రఫి కొత్తగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిని థ్రిల్‌కు గురి చేస్తుంది అని అజయ్ శ్రీనివాస్ వెల్లడించారు.

మర్డర్ మిస్టరీగా సాగే సినిమాలో కథ, కథనాలు బాగుంటాయి. ఇండియాలో జరిగిన ఓ పెద్ద స్కామ్ కేంద్ర బిందువుగా కథ సాగుతుంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకొంటుందనే నమ్మకంతో ఉన్నాను. మంచి డేట్ చూసుకొని.. ఆలస్యమైనా మార్చి 10న రిలీజ్ చేస్తున్నాం అని అజయ్ శ్రీనివాస్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X