Akhil Akkineni Interview అసలే సిగ్గు ఎక్కువ.. ఆ సీన్‌లో కేవలం అండర్ వేర్‌తో.. అఖిల్ అక్కినేని (ఇంటర్వ్యూ)

అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో పేరుపొందిన సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఏజెంట్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అఖిల్ అక్కినేని తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..

ఏజెంట్ సినిమా జర్నీ ఫస్ట్ లాక్‌డౌన్‌లో ప్రారంభమైంది. బ్యాచ్‌లర్ సినిమా షూట్ కొనసాగుతున్నది. ఆ సినిమా చేసినప్పుడు నాకు లవ్ స్టోరీ జోనర్ నచ్చలేదు. అలా అని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాను తక్కువ చేయడం లేదు. అరవింద్ గారితో పనిచేశాను. ఆ సినిమా మీద నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ నాకు యాక్షన్ ఇష్టమని ఆత్మ విమర్శ చేసుకొని తెలుసుకొన్నాను. దాంతో సురేందర్ రెడ్డిని కలవడం జరిగింది. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ముందుకెళ్లాం. అలా స్పై జోనర్ సినిమా పుట్టింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే టార్గెట్‌తో జర్నీ మొదలైంది అని అఖిల్ చెప్పారు.

Akhil Akkineni Interview

నా ఫ్యామిలీలో అందరూ లవ్ స్టోరీలతో హిట్లు కొట్టారు. కానీ నాకు ఆ జోనర్ అంటే ఇష్టం లేదు. నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలు చేయడం వల్ల అలాంటి ఆలోచన వచ్చిందేమో. నాకు రాజమౌళి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే నాకు యాక్షన్ జోనర్ అంటే ఇష్టం. నా మైండ్ సెట్ ఏమిటంటే... ప్రేక్షకులకు కొత్తరకమైన అనుభూతిని ఇవ్వాలని కోరుకొంటాను. అందుకే ఏజెంట్ సినిమాను వైల్డ్ చేశాను. అయితే నేను చేసిన ఈ సినిమా చాలా రిస్క్‌‌తో కూడుకొన్నది. ఫలితం ఎలాంటిదైనా నేను ఫేస్ చేయడానికి రెడీ అని అఖిల్ అన్నారు.

Akhil Akkineni Interview

ఏజెంట్ సినిమా కోసం నాలుగు నెలల్లో నా బాడీని సిద్దం చేయాలనుకొన్నాను. అప్పుడు నేను నాలుగు నెలలు, ఆరు నెలలు గడిచాయి. కానీ నేను అనుకొన్న బాడీ రెడీ కాలేదు. చివరికి 9 నెలల్లో నా బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అయింది. సురేందర్ రెడ్డి సంతృప్తి చెందాడు. దాంతో మేము షూటింగ్ మొదలుపెట్టాం అని అఖిల్ చెప్పారు.

ఏజెంట్ విషయంలో నా ప్రిఫరెన్స్ స్పై థ్రిల్లర్ జోనర్. ఇక లిమిటేషన్స్ విషయానికి వస్తే.. నేను ఈ పాత్ర చేస్తానా? లేదా అనే అనుమానం నన్ను వెంటాడింది. నేను కామెడీ చేశాను. కానీ కొంత వరకే.. కానీ ఈ సినిమాలో నా పాత్ర కోతి బిహేవియర్ లాంటింది. హై ఎనర్జీతో ఉండే పాత్ర ఛాలెంజింగ్ మారింది. నాకు అసలే సిగ్గు ఎక్కువ. ఓ టార్చర్ సీన్ అండర్ వేర్‌లో ఉన్నాను. ఈ సీన్ చేయడానికి ముందు రోజు నాకు డైలాగ్ షీట్ వచ్చింది. ఈ సీన్ నేను చేయగలుగుతానా? అనే డౌట్ వచ్చింది. కానీ సురేందర్ నన్ను ప్రతీ క్షణం సపోర్ట్ చేసి నాలో భయాలు పోగొట్టాడు అని అఖిల్ చెప్పారు.

Akhil Akkineni Interview

ఏజెంట్ సినిమాలో కొత్త పాటను చేర్చాం. అయితే సినిమాకు చాలా అవసరమైన సందర్భంలోనే మేము ఊర్వశి రటేలాతో పాటను షూట్ చేశాం. ఆ పాట పెడితే.. సినిమా ఇంకా స్టైలిష్‌గా ఉంటుందని యూనిట్ నమ్మింది. అయితే సినిమా ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బడ్జెట్ కూడా పెరగడానికి సినిమాలో స్టార్ యాక్టర్లు ఉన్నారు. ప్రతీ పాత్ర కథను నడించే బలమైన పాత్రలే. ప్రతీ పాత్ర చాలా ఎమోషనల్ నోట్‌తో సాగింది. యాక్టర్‌గా నేను చాలా సంతృప్తితో కూడిన సినిమా ఇది అని అఖిల్ అన్నారు.

Akhil Akkineni Interview

ఇంతకు ముందు వచ్చిన స్పై, రా బ్యాక్ డ్రాప్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. స్పై వరల్డ్‌ను క్రియేట్ చేశాం. కాన్వాస్ బిగ్‌గా ఉంటుంది. మేము ప్రేక్షకులకు కొత్త జానర్ ఇవ్వబోతున్నాం. స్టోరి కొత్తగా ఉంటుంది అని అఖిల్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X