Agent మూవీ ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ ఎందుకంటే?.. పోకిరి సినిమా 50 సార్లు చూశా.. అఖిల్ అక్కినేని
అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో పేరుపొందిన సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అఖిల్ అక్కినేని తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..
స్పై థ్రిల్లర్ అనగానే సీరియస్ సబ్జెక్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీల్ రాకుండా సినిమాను ఎంటర్‌టైనింగ్ ఉండేలా స్క్రిప్టు దశ నుంచే మేము జాగ్రత్తలు తీసుకొన్నాం. ఇక స్పై వరల్డ్‌లో షాడోలా ఉండే రా ఏజెంట్. కోతిలా ఎందుకు ఉంటాడు. కర్లీ హెయిర్, హెవీ బాడీతో సిస్టమ్‌కు వ్యతిరేకంగా ఉంటాడు. సీరియస్ సిట్యుయేషన్‌లో హీరో హ్యుమర్ వల్ల చాలా కామెడీ జనరేట్ అయింది. వైల్డ్ కోతిలా ఉండేలా స్క్రిప్టు దశలోనే డిజైన్ చేశాం. హీరో బిహేవియర్‌ను మమ్ముట్టి సానుకూలంగా మార్చుకొంటారు. జాకీ చాన్ తరహాలో కామెంట్ ఉంటుంది అని అఖిల్ చెప్పారు.

సినిమా ఇండస్ట్రీలో ఏప్రిల్ 28 తేదీకి ఒక చరిత్ర ఉంది. ఇదే రోజున ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు, మహేష్ బాబు నటించిన పోకిరి, ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి2 ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. అయితే పోకిరి, బాహుబలి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆల్ టైమ్ ఫేవరేట్. నాకు పెద్దగా సెంటిమెంట్స్ ఉండవు. కానీ ఏప్రిల్ 28 తేదీ అనగానే నేను చాలా థ్రిల్‌గా, హ్యాపీగా ఫీలయ్యాను. పోకిరి సినిమాను 50 సార్లు చూశాను. బాహుబలి సినిమాను చూస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఎపిక్ జోనర్ చేస్తే బాగుంటుందని అనుకొంటే.. బాహుబలిని చూస్తూనే ఉంటాను అని అఖిల్ తెలిపారు.
ఏజెంట్ సినిమాకు మ్యూజిక్ మంచి స్ట్రెంత్. హిప్ హప్ తమీజ్ టీమ్‌లో జీవా, ఆది ఉంటారు. వాళ్లు చాలా ఉత్సాహంతో కూడిన టీమ్. వాళ్లు ఏదో కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటారు. డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ నుంచి ఒక ఫ్రెష్ కంటెంట్‌తో వస్తే.. పూర్తిగా న్యాయం చేస్తారు. డైరెక్టర్ ఎన్నిసార్లు ఛేంజ్ చెప్పినా చాలా ఓపికతో మార్పులు చేస్తారు. మ్యూజిక్ పరంగా వారితో మాకు అమేజింగ్ జర్నీ. రీరికార్డింగ్, సౌండింగ్ చాలా కొత్తగా ఉంటుంది. కొత్త అనుభూతికి గురిచేస్తుంది. తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగినట్టుగా ఉంటుంది అని అఖిల్ చెప్పారు.

బడ్జెట్ ఆలోచించి సినిమా చేయం. కంటెంట్, సినిమా రేంజ్‌ను బట్టి బడ్జెట్ డిసైడ్ అవుతుంది. నా నెక్ట్స్ సినిమాకు ఈ రేంజ్‌లో బడ్జెట్ ఉండకపోవచ్చు. నేను కంటెంట్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. యాక్షన్ డ్రామాలోనే హైలీ ఎమోషన్స్, డ్రామాను చూపించవచ్చు. నేను ఇప్పటి వరకు నేను 5 సినిమాలే చేశాను. ఇక ముందు ఐదు సినిమాలు ఈ జోనర్‌లో చేయాల్సి వస్తే చేస్తాను అని అఖిల్ అక్కినేని తెలిపారు.
మలయాళంలో కాకుండా ఇతర భాషల్లో మమ్ముట్టి చాలా తక్కువగా చేస్తారు. మా సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారంటే.. కంటెంట్ బాగా నచ్చి ఉంటుంది. ఫస్ట్ డే షూటింగ్‌లో ఆయన్ని చూసి ఒకరకమైన ఫీలింగ్ కలిగింది. ఇంత సినిమాల తర్వాత కూడా ఆయన చాలా ఉత్సాహంగా నటించడం చూసి నేను చాలా నేర్చుకొన్నాను. సినిమాకు ఆయన చాలా ప్లస్ పాయింట్ అయ్యారు అని మమ్ముట్టి చెప్పారు.


Click it and Unblock the Notifications











