Pushpa 23 నెలల ఆ బాధ అంటూ అల్లు అర్జున్.. హైకోర్టు తీర్పుపై స్టైలిష్ స్టార్ ఏమన్నారంటే?
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి పుష్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, మోషన్ పోస్టర్లు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. పుష్పకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ..
Recommended Video

23 నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు
అల వైకుంఠపురంలో చిత్రం జనవరి 2020లో రిలీజైంది. ఆ సినిమా తర్వాత మళ్లీ నా సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి 23 నెలలు పట్టింది. అయితే లాక్‌డౌన్‌లో కలిసి పనిచేయడానికి వీలు కాకపోవడంతో జూమ్, వాట్సాప్ కాల్స్‌లో నేను, సుకుమార్, యూనిట్‌లోని కొందరు సభ్యులం కలిసి సినిమా స్క్రిప్టు, డైలాగ్స్, చిత్తూరు యాస గురించి ప్రాక్టీస్ చేశాం. ఆ సందర్భంలో భాషలోని వేరియేషన్స్‌ను తెలుసుకొన్నాం. ఇక షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఎలాంటి వసతులు, రోడ్డు మార్గం లేని అడవిలో షూట్ చేయడం చాలా కష్టంగా అనిపించింది అని అల్లు అర్జున్ చెప్పారు.

మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రతో
అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌గా నేను నటించాను. అయితే ఆ పాత్రకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ వర్కంతా సుకుమార్ గారి టీమ్ చేసింది. నా పాత్రలో మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. కూలీగా, ట్రాన్స్‌పోర్టర్‌గా, అలాగే స్మగ్లర్‌గా కనిపిస్తాను. ఇలాంటి వేరియేషన్స్‌కు సంబంధించిన వాటికి కోసం ఫిజికల్‌గా చాలా హోంవర్క్ చేశాం. మేకప్ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా, క్యాస్టూమ్ పరంగా నేను, సుకుమార్ చాలా కష్టపడ్డాం. అలాగే షూటింగ్ జరిగే ప్రాంతంలో పర్యావరణం దెబ్బ తినకుండా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాం. చెత్త కోసం చాలా డస్ట్ బీన్స్ పెట్టాం అని అల్లు అర్జున్ తెలిపారు.

స్మగ్లర్ జీవిత ప్రయాణం కథగా
పుష్ప చిత్రం కథ విషయానికి వస్తే.. పుష్ప రాజ్ అనే వ్యక్తి గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి జీవన ప్రయాణాన్ని తెరకెక్కించాం. అతని జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలు తెర మీద చూపించాం. ఈ సినిమా కథ పూర్తిగా ఫిక్షనల్. ఈ సినిమాలో నటించడం ద్వారా మేకప్ గురించి ఎక్కువగా నేర్చుకొన్నాను. అలాగే భాషను కూడా నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. లాక్‌డౌన్‌లో పుష్ప పాత్ర ప్రిపరేషన్ జరిగింది. ఈ సినిమా కోసం చిత్తూరు యాసను త్వరగా నేర్చుకోవాల్సి వచ్చింది అని అల్లు అర్జున్ అన్నారు.

సుకుమార్ టైటిల్ చెప్పగానే..
దర్శకుడు సుకుమార్ నాకు కథ చెప్పిన తర్వాత టైటిల్ పుష్ప అన్నారు. వెంటనే నాకు చాలా నచ్చింది అని అన్నాను. ఆ టైటిల్ గురించి మరోసారి ఆలోచించలేదు. లుక్, టైటిల్ ఒకేసారి చూపించడంతో నాకు విపరీతంగా నచ్చేసింది. పుష్ప రెండు పార్టులుగా చేయాలన్నది సుకుమార్ చెప్పినప్పుడు చాలా ఉత్సాహం, సర్‌ప్రైజ్ అనిపించింది. అలాగే రెండు పార్టులను ఒకే సంవత్సరంలో విడుదల చేయకూడదని అనుకొన్నాం. అందుకే ఈ ఏడాది ఒకటి.. వచ్చే సంవత్సరం మరోటి రిలీజ్ చేయాలని అనుకొన్నాం అని అల్లు అర్జున్ చెప్పారు.

ఎస్ ఎస్ రాజమౌళి గొప్పతనానికి నిదర్శనం
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకులు రాజమౌళి గారు చెప్పిన విషయాలు ఆయనలోని గొప్ప తనానికి నిదర్శనం. అలాంటి దర్శకుడితో నటించాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. కలిసి సినిమా చేద్దామని నేను కూడా ఆయనను కూడా అడిగాను. అయితే మీలాంటి హీరోలతో కలిసి పనిచేయాలని నాకు ఉంది. తప్పకుండా కలిసి పనిచేద్దామని రాజమౌళి అన్నారు.

హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్
టికెట్ రేట్లను పెంచుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ సహకారం కూడా ఉండాలి. ప్రభుత్వ సహకారం అందిస్తుందని భావిస్తున్నాం. హైకోర్టు నిర్ణయాన్ని సినీ పరిశ్రమ స్వాగతించాల్సిందే అని అల్లు అర్జున్ చెప్పారు.


Click it and Unblock the Notifications











