ఆ సినిమా వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి.. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం
దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు ఏఎం రత్నం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు, తమిళ పరిశ్రమలలో స్టార్ ప్రోడ్యూసర్‌గా నిలిచారు. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాను నిర్మించారు రత్నం. ఈ నెల 12న ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు విశేషాలు, పవన్ కళ్యాణ్‌తో అనుబంధం, తన కెరీర్‌పై యూట్యూబ్ ఛానెల్ ఐ డ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఎం రత్నం ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ వివరాలు మీకోసం.
తెలుగు వారితో గ్యాప్ వచ్చింది
'హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలై ఐదేళ్లు కావొస్తోంది. ఈ గ్యాప్‌లో కొన్ని తమిళ చిత్రాలు చేశాను. అందులో మూడు చిత్రాలు ఒక్క అజిత్ కుమార్‌తోనే చేశాను. విజయ్ సేతుపతితో కరుప్పన్, తెలుగులో నా కుమారుడి దర్శకత్వంలో ఆక్సిజన్ చిత్రాన్ని నిర్మించా. అందుకే తెలుగులో బాగా గ్యాప్ తీసుకున్నట్లు ప్రేక్షకులకు అనిపిస్తోంది. హరిహర వీరమల్లు తర్వాత మూడు కరోనాలు, ఒక ఎలక్షన్ క్రాస్ చేశాం. ఈ సినిమా మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేసేది కాదు. ఎందుకంటే ఇది పీరియాడికల్ చిత్రం.. 17వ శతాబ్ధం నాటి సినిమా కాబట్టి ఎన్నో సెట్స్ ఉంటాయ్, చిన్న షాట్ తీయాలన్నా పొద్దున్నే వెళ్లి షూట్ చేసే సినిమా కాదు. వీరమల్లుకు బ్యాక్‌గ్రౌండ్, సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వాడాం. 17వ శతాబ్ధం నాటికి తీసుకెళ్లడం కోసం గ్రాఫిక్స్ ఉపయోగించాం. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆయనతోనే ట్రావెల్ చేస్తూ సినిమా చేశాం. ఎట్టకేలకు సినిమా పూర్తయి జూన్ 12న హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకొస్తోంది' అని ఏఎం రత్నం తెలిపారు.

ఖుషీని పవన్ హిందీలో డబ్ చేయమన్నారు
'నేనెప్పుడూ డబ్బునే దృష్టిలో పెట్టుకుని సినిమా తీయను. పవన్ కళ్యాణ్‌కు నాకు ఉన్న సాన్నిహిత్యంతో ఏదో ఒక రీమేక్ సినిమా చూస్తే త్వరగా అయిపోతుంది, ఈపాటికి రెండు మూడు సినిమాలు చేయొచ్చు. కానీ మంచి సినిమా చేయాలని, పవన్ కళ్యాణ్‌కు కూడా మంచి పేరు రావాలనే హరిహర వీరమల్లు చేశాం. ఇండస్ట్రీలో ట్రెండ్ కూడా మారుతోంది, పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా చేస్తున్నట్లు మొదట్లోనే అనౌన్స్ చేశాం. ఖుషి సమయంలో హిందీలో డబ్ చేద్దామని, కళ్యాణ్ గారు కూడా ప్రపోజల్ పెట్టారు. అయితే అది లవ్ స్టోరీ కావడంతో దానికి జనం ఆదరణ అంతగా ఉండకపోవచ్చనే ఉద్దేశంతో పవన్‌కి కుదరదని సున్నితంగా చెప్పాను' అని ఏఎం రత్నం చెప్పారు.

పవన్ రాజకీయాల్లోకి వెళ్లడానికి కారణం నేనే
'హరిహర వీరమల్లు సినిమా సబ్జెక్ట్‌ని చూశాక పూజా కార్యక్రమాల రోజే పాన్ ఇండియా సినిమా అని అనౌన్స్ చేశాను. ఈ సబ్జెక్ట్ సౌత్ కంటే నార్త్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికొచ్చిన తర్వాత బాగా రెస్పాన్స్ రావడంతో పవన్ కళ్యాణ్ మీద, నా మీద రెస్పాన్స్ పెరిగింది. పవన్ కళ్యాణ్ డైరెక్షన్‌లో సత్యాగ్రహి చేయాలనుకున్నాం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో, పీసీ శ్రీరాం కెమెరామెన్‌గా భారీగా అనౌన్స్ చేశాం. కానీ ఈ సినిమా ముందుకు వెళ్లలేదు. దీనికి పవన్ కళ్యాణే డైరెక్టర్, ఆయన కథా చర్చల్లో కూర్చోవాలి. దానికి ముందు జానీ డైరెక్ట్ చేశారు. జానీ రిజల్ట్‌తో పవన్ కళ్యాణ్ .. సత్యాగ్రహి వద్దన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ని కలిసినప్పుడు అప్పట్లో మిమ్మల్ని కలవలేదు, ఒకవేళ మిమ్మల్ని కలిసుంటే ఖచ్చితంగా సినిమా చేసేవాడినని చెప్పా. ఆ మాటలకు పవన్ కళ్యాణ్ నవ్వి.. ఒకవేళ మీరు కలిసి సినిమా చేసి సూపర్‌హిట్ అయ్యుంటే అమీర్‌ఖాన్‌లాగా సినిమాలే చేసుకుంటూ ఉండేవాడిని రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని చెప్పారు' అని ఏఎం రత్నం అభిప్రాయపడ్డారు.
పవన్‌కి ప్రజాసేవ మీదే
'20 ఏళ్లుగా పవన్ కళ్యాణ్‌తో అనుబంధం ఉంది. సినిమా ఆర్టిస్ట్‌గా కంటే ఒక వ్యక్తిగా పవన్ అంటే ఎంతో ఇష్టం. ఆయన ఆశయాలు, భావాలు నాకు బాగా ఇష్టం. ఎప్పుడూ ప్రజాసేవ మీదే పవన్ కళ్యాణ్ దృష్టి ఉండేది. సినిమా బాగా కనెక్ట్ అయితేనే ఆ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. నటన కరెక్ట్ కాదని డైరెక్షన్ వైపు పవన్ వెళ్లి ఉండొచ్చు.. అక్కడ కనుక సక్సెస్ అయ్యుంటే ఆ ప్రొఫెషన్‌లో అలా ఉండిపోయేవారే. ప్రజాసేవను మాత్రం వదలకుండా పట్టుపట్టి అసలు లక్ష్యాన్ని సాధించారు. జనాలు పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరుస్తుంటారు కానీ టైటిల్స్‌లో అలా వేయొద్దని కరాఖండీగా చెప్పేశారు'

వీరమల్లు కోసం పవన్ కష్టపడ్డారు
'కరోనా వచ్చాక టాలీవుడ్‌తో, ఇక్కడి వాళ్లతో పూర్తిగా కనెక్షన్ లేదు. సెకండ్ వేవ్‌లో కళ్యాణ్ గారు కూడా కరోనా బారినపడ్డారు. ఆయన త్వరగా రికవరీ అవ్వాలని మేమంతా కోరుకున్నాం.. ఆయన కోలుకున్న వెంటనే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు ఒకే సమయంలో చేస్తున్నారు. కోవిడ్ పరిస్ధితులు సద్దుమణిగాక ఈ రెండు సినిమాలలో ఒకదానిని ముందు పూర్తి చేద్దామనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ కంప్లీట్ చేశారు. హరిహర వీరమల్లు కూడా చాలా స్పీడ్‌గా చేసుకుంటూ వచ్చాం, ఆయన దూకుడు చూస్తే అప్పుడే ఈ సినిమా అయిపోవాలి. ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ కోసం దాదాపు 60 రోజులు దానిని షూట్ చేస్తే పవన్ కళ్యాణ్ 45 రోజుల వరకు ఉన్నారు. అంత కష్టపడి తీసిన దానిని చూసి జాగ్రత్తగా ఎడిట్ చేయడానికే మూడు నెలలు పట్టింది' అని ఏఎం రత్నం గుర్తుచేసుకున్నారు.
క్రిష్ తప్పుకుంది అందుకే
'ఈ సినిమా నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడం తలరాత ప్రకారమే జరిగింది. కరోనాతో పాటు వేరే ప్రాజెక్ట్స్ కారణంగా ఒత్తిడితోనే క్రిష్ తప్పుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే ప్రాజెక్ట్‌ని కాపాడారు. తొలుత వేదళం మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాం. గమ్యం సినిమా నుంచే క్రిష్‌తో అనుబంధం ఉండేది. ఓక రోజున నాకు ఫోన్ చేసి చిన్న లైన్ ఉందని నన్ను కలిసి ఆ లైన్ చెప్పారు. అది నాకు బాగా నచ్చి అది కళ్యాణ్ గారు చేస్తేనే బాగుంటుందని అనుకున్నా. వేదలంని రీమేక్ చేసుంటే ఈపాటికే అయిపోయేది, కానీ క్రిష్‌ని పిలిపించి పవన్‌కు లైన్ చెప్పడంతో ఆయనకు కూడా నచ్చి వీరమల్లు ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దీంతో తనకు వేరే కమిట్‌మెంట్‌లు ఉన్నాయని చెప్పి తనకు తాను జ్యోతికృష్ణ టేకప్ చేస్తే బాగుంటుందని క్రిష్ చెప్పారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తీయాలనే ఆలోచన జ్యోతిదే, రేపు సినిమా పూర్తయిన తర్వాత క్రిష్ గారికి చూపిస్తాం’ అని ఏఎం రత్నం స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











