Ambajipeta Marriage Band అలా అవమానాలకు గురయ్యా.. ఎన్నో కష్టాలు అనుభవించా.. నితిన్

యువ హీరో, హీరోయిన్లు సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.

దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించిన ఈ చిత్రంలో శరణ్య ప్రదీప్, మలయాళ నటుడు నితిన్ ప్రసన్న కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్ దిశగా వెళ్తున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విలన్ పాత్రలో ఆకట్టుకొంటున్న నితిన్ ప్రసన్న ఫిలింబీట్‌తో మాట్లాడుతూ..

తమిళం, మలయాళంలో మాదిరిగానే మంచి కంటెంట్ సినిమాలు తెలుగులో రావాలని కోరుకొనే ప్రేక్షకుల కోరికను అంబాజీపేట మ్యారేజి బ్యాండు తీర్చింది. థియేటర్స్‌కు వెళ్లి చూస్తున్నప్పుడు ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. సుహాస్ హీరోను కాదు మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. శివాని, శరణ్య క్యారెక్టర్స్ కథలో హై తీసుకొచ్చాయి అని నితిన్ అన్నారు.

 Ambajipeta Marriage Band Actor Nithiin Prasanna shares his struggles and hardles in Film Industry

10 ఏళ్లుగా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా అవమానాలకు గురయ్యాను. చాలా కష్టాలు పడ్డాను. అయితే అంబాజీ పేట సినిమా ఫస్టాఫ్ చూసిన తర్వాత నా ఆనందాన్ని, భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. అప్పటికే ఈ సినిమా హిట్ అని తెలిసిపోయింది. దాంతో వచ్చి హీరో సుహాస్, శరణ్య, శివానీని కౌగిలించుకొన్నాను అని నితిన్ చెప్పారు.

 Ambajipeta Marriage Band Actor Nithiin Prasanna shares his struggles and hardles in Film Industry

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కోసం ఎదురు చూశాను. గతంలో ఫోటో ఆల్బమ్స్ పట్టుకొని వేషాల కోసం తిరిగే వాడిని. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజు మంచి గుర్తింపు పొందే రోజు ఎప్పుడొస్తుందా అనే విషయంతో ఉన్నాను. ఈ సినిమా హిట్ అనిపించగానే చాలా సంతోషానికి గురి అయ్యాను అని నితిన్ ప్రసన్న చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X