Amitabh Bhachchan: అభిమానులకు బిగ్ బీ బర్త్ డే ట్రీట్ - కల్కిలో అమితాబ్ లుక్ ఎలా ఉందో తెలుసా?
Amitabh Bhachchan: నేడు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 81వ పుట్టిన రోజు. 1969లో భవన్ షోమ్ అనే సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన అమితాబ్ బచ్చన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అద్భుతమైన సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాధించుకున్నాడు. ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ.. అభిమానుల్ని, సినీ ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న బిగ్ బీకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
అమితాబ్ బచ్చన్ పుట్టిన సందర్భాంగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం కల్కి చిత్రబృందం బిగ్ బీకి స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఓ ప్రధాన పాత్రలో కనిపించి అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బిగ్ బీ పుట్టిన రోజును పురస్కరించుకొని కల్కి చిత్ర బృందం.. అమితాబ్ బచ్చన్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ లుక్ ను విడుదల చేసింది.

అయితే వీరు విడుదల చేసిన పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ మొహం పూర్తిగా కనిపించట్లేదు. కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. చేతిలో విల్లు లాంటి ఆయుధం, నుదిటిన బొట్టు చూస్తుంటే బిగ్ బీ సాధువులా కనిపిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఈ పోస్టర్ తో పాటు కల్కి మూవీ టీం.. మీ ప్రయాణంలో మేము కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చింది. అయితే ఈ ఫొటో చూసిన అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. బిగ్ బీ గెటప్ చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ హీరోగా చేస్తున్న ఈ కల్కి సినిమాలో బాలీవుడ్ క్యూట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కమల్ హాసన్, దిశా పటానిలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా "కల్కి 2989 ఏడీ". ఈ సినిమాలు వైజయంత మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.400 కోట్ల బడ్దెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవలే విడుదల అయిన కల్కి సినిమా గ్లింప్స్ కు మంచి స్పందనే వచ్చింది. అందులో ఎప్పుడు అయితే అంధకారమనేది ఈ ప్రపంచాన్ని ఆక్రమిస్తుందో.. అప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది.. అంతం అనేది ఆరంభం అవుతుందని అంటూ చెప్పి సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఈ భూ ప్రపంచాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే కల్కి అవతారంలో ప్రభాస్ కనిపించున్నారు. ఇది ఒక టైం ట్రావెల్ కథ అని గ్లింప్స్ చూస్తే అర్థం అయిపోయింది.


Click it and Unblock the Notifications











