నన్ను యువరాణిలా చూసుకొన్నారు.. కార్తీకేయతో స్ట్రాంగ్ బాండింగ్: గుణ 369 హీరోయిన్

Recommended Video

Guna 369 Director Clarified On Issue With Hero Karthikeya During Shooting || Filmibeat Telugu

యువ అందాల తార అనఘ ఎల్‌కే మారుథోరా దక్షిణాదిలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మలయాళం, తమిళ చిత్రాల్లో నటించిన అనఘ.. మలయాళంలో రాక్షషాధికారి బైజు ఒప్పు, పరవ, రోసాపూ చిత్రాల్లో, తమిళంలో నాపే తునై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హీరో కార్తీకేయతో కలిసి గుణ 369 చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనఘా తెలుగు ఫిలింబీట్‌తో ముచ్చటించింది.

గుణ 369 మూవీలో ఛాన్స్ అలా

గుణ 369 మూవీలో ఛాన్స్ అలా

డిగ్రీ చదువుకొనే సమయంలోనే నా స్నేహితులు మోడలింగ్, యాక్టింగ్‌లో ఉండటంతో నేను కూడా ఓ రోజు ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆడిషన్స్‌లో నేను చేసిన ఫెర్ఫార్మెన్స్ చూసి ఓ సినిమాలో సెకండ్ లీడ్‌గా తీసుకొన్నారు. ఆ సినిమా బాగా ఆడింది. అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత నేను తెలుగు సినిమాలు చేయాలనుకొంటున్న సమయంలో దర్శకుడు అర్జున్ జంధ్యాల నన్ను సంప్రదించారు. ఆ తర్వాత నన్ను ఆడిషన్స్‌కు పిలిచి ఓకే చేశారు. అలా గుణ 369 సినిమాలో భాగమయ్యాను అని అనఘ చెప్పారు.

గ్రామీణ యువతి గీత పాత్రలో

గ్రామీణ యువతి గీత పాత్రలో

గుణ 369లో గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి గీత పాత్రలో కనిపిస్తాను. సెల్‌ఫోన్ షాపులో పనిచేసే అమ్మాయిగా నటించాను. స్క్రిప్టులో ఎమోషనల్ కంటెంట్ నచ్చి సినిమాలో నటించడానికి అంగీకరించాను. గుణ తొలి భాగంలో రొమాంటిక్, ఫన్, ఇతర అంశాలను సినిమాను డ్రైవ్ చేస్తాయి. సెకండాఫ్‌లో కథ ఎమోషనల్‌గా సాగుతుంది అని అన్నారు.

 నన్ను యువరాణిలా చూసుకొన్నారని..

నన్ను యువరాణిలా చూసుకొన్నారని..

టాలీవుడ్‌‌లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. హీరోయిన్లకు మంచి రెస్పెక్ట్ లభిస్తుంది. చాలా బాగా చూసుకొన్నారు. గుణ 369 ప్రొడక్షన్ టీమ్ నన్ను యువరాణిలా చూసుకొన్నది. ప్రతీ సమయానికి సమకూరేవి. ఏదైనా నాకు కావాల్సి వస్తే ప్రవీణా గారిని అడిగే దానిని. ఆమె నాకు కావాలిసిన అన్నీ ఆమె చూసుకొన్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. తమిళ, మలయాళం కంటే తెలుగులో చాలా కంఫర్ట్ ఉంది. అందుకు నేను ముగ్గురు నిర్మాతలు ప్రవీణ కడియాల, అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అనఘ పేర్కొన్నారు.

కార్తీకేయతో స్ట్రాంగ్ రిలేషన్

కార్తీకేయతో స్ట్రాంగ్ రిలేషన్

గుణ 369లో హీరో కార్తీకేయ అనగానే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను RX 00 సినిమా గురించి విన్నాను. కానీ చూడలేదు. ఆ తర్వాత RX 100 సినిమా చూశాను. గుణ 360లో అతడితో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. చాలా కమిటెడ్, డెడికేటెడ్ యాక్టర్. గుణ తర్వాత మా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది అని అనఘ అన్నారు. నాకు ఫెర్ఫార్మెన్స్‌తోపాటు, గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X