twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే గుంటూరులో తీశాం.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’పై ఆనంద్ దేవరకొండ కామెంట్స్

    |

    విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే మొదటి సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దొరసాని మంచి ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఆనంద్ దేవరకొండకు మంచి పేరు అయితే వచ్చింది కానీ కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. అయితే ఆనంద్ దేవరకొండ తన రెండో ప్రయత్నంతో కమర్షియల్ హిట్ కొట్టేశాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ అదిరిపోయే హిట్ కొట్టాడు. ఆనంద్ ఈ మూవీకి సంబంధించిన విశేషాలను ఫిల్మీ బీట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

    మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రానికి గుంటూరు నేపథ్యం ఎంచుకోవడానికి గల కారణాన్ని ఆనంద్ వివరించాడు. అసలు ఈ సినిమాకు గుంటూరు నేపథ్యం ఎందుకు తీసుకున్నాడని నేను డైరెక్టర్ వినోద్ అనంతోజును అడిగాను. అయితే అతను చిన్నతనంలో ఇక్కడే పుట్టి పెరగడం, ఇక్కడి పరిస్థితుల, మనుషులు, యాస, భాష, వ్యక్తిత్వం, గుంటూరులో ఉండే సందడి, రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, అక్కడి హడావిడి ఇలా అన్ని ఆయన మెదడులో ఉన్నాయి అందుకే సినిమాకు గుంటూరు నేపథ్యాన్ని తీసుకున్నామని చెప్పుకొచ్చాడు.

     Anand Devarakonda About Middle class Melodies

    మా డైరెక్టర్ బీటెక్ అక్కడే చదివాడు. ఆ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి అలా తిరుగుతూ ఉంటే బొంబాయ్ చట్నీ గురించి విన్నాడట. అలా అక్కడి నుంచే ఆ కాన్సెప్ట్‌ను సినిమాలో పెట్టాడు. ప్రస్తుతం నాకు అది చేయడం వచ్చు. ఎలా తయారు చేయాలి.. దానికి ఏ ఏ పదార్థాలు వాడాలో తెలుసు. నాకు అదొక్కటే పర్ఫెక్ట్‌గా చేయడం వచ్చంటూ ఇలా ఆనంద్ తన సినిమా గురించి ఎన్నో సంగతులను బయట పెట్టాడు.

    English summary
    Anand Devarakonda About Middle class Melodies, Anand Devarakonda About vinod anantoju,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X