ఆ విషయంలో విజయ్ దేవరకొండది వేరే దారి.. నా దారి వేరు.. ఆనంద్ దేవరకొండ (ఇంటర్వ్యూ)
యువ హీరో ఆనంద్ దేవరకొండ, నూతన హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబి. సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి జూలై 14వ తేదీన బేబీ రిలీజవుతున్న నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..
నా కెరీర్‌లో ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయి పాత్రలు పోషించాను. కానీ బేబీ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా నటించాను. రిలీజ్‌కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రివ్యూ షోలు హౌస్‌పుల్స్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో బేబి బెస్ట్ సినిమా అవుతుంది. ఈ చిత్రంలో పాత్ర పోషించడానికి రాజేశ్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పటికి నాకు గుర్తుండి పోతుంది అని ఆనంద్ దేవరకొండ అన్నారు.

సంతోషం, బాధ అనే అంశాల కలయిక ప్రేమ. బేబీ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది. ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్స్ కేవలం 50 శాతం మాత్రమే. థియేటర్‌లో ఈ సినిమాను ఎంజాయ్ చేయడమే కాకుండా భారమైన హృదయంతో బయటకు వస్తారు అని ఆనంద్ దేవరకొండ చెప్పారు.
జీవితంలో తొలి ప్రేమ చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమ అంటే ఏమిటో ఒకే సారి తెలియదు. జీవితంలో దాని విలువ, అనుభూతి గురించి మెల్లమెల్లగా తెలుసుకొంటాం. అదే విషయాన్ని బేబి సినిమాలో చూపించాం. నేను చాలా వరకు అబ్బాయిల బోర్డింగ్ స్కూల్‌లో చదివాను. ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెండేళ్లకు అమ్మాయిలతో మాట్లాడాను. తొలి ప్రేమ అనుభూతి చిరకాలం గుర్తుండిపోతాయి. ఫస్ట్ లవ్ సక్సెసా? లేదా ఫెయిల్యూర్ అనే సంబంధం లేకుండా ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్ కలుగుతుంది అని ఆనంద్ దేవరకొండ చెప్పారు.
ప్రేమదేశం సినిమాకు బేబీ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. బేబీ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. 7/G బృందావన్ కాలనీ సినిమా మాదిరిగా ఉంటుంది. తెలుగులో అర్జున్ రెడ్డి డిఫరెంట్ సినిమాగా మారింది. బేబీ సినిమాలోని డైలాగ్స్ అందరిని ఆకట్టుకొంటాయి. బేబీ టైటిల్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే సీన్ అందర్నీ ఆకట్టుకొంటుంది అని ఆనంద్ దేవరకొండ చెప్పారు.

వైష్ణవి చైతన్య అద్బుతంగా నటించింది. తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొంటుంది. సీన్‌లో నటించడానికి ముందు చాలా రిహార్సల్స్ చేసేవారం. అలాగే చాలా డిస్కస్ చేసి నటించాం. వైష్ణవితో ఎంజాయ్ చేస్తూ నటించాను అని ఆనంద్ దేవరకొండ తెలిపాడు.
నేను నటించే సినిమాల గురించి నా సోదరుడు విజయ్ దేవరకొండకు కొన్ని చెబుతాను. కొన్ని చెప్పను. కొన్నిసార్లు సినాప్సిస్ పంపుతాను. విజయ్ నాకు కొన్ని సలహాలు ఇస్తాడు కానీ.. సినిమా ఎంపిక విషయంలో తుది నిర్ణయం నాదు. మా అన్నయ్య గానీ, నాన్న గానీ ఎలాంటి సలహాలు ఇవ్వరు. ఒత్తిడి చేయరు. సినిమాల విషయంలో విజయ్ దారి వేరు.. కెరీర్ విసయంలో నా దారి వేరు. మా ఇద్దరికి పోలికలు లేవు అని ఆనంద్ దేవరకొండ చెప్పారు.


Click it and Unblock the Notifications











