twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.. లైఫ్‌లో ఊహించని ఆఫర్లు.. ఆనంద చక్రపాణి ఉద్వేగం

    |

    సినీ పరిశ్రమలో ఒకే ఒక్క ఛాన్స్ జీవితాన్ని మలుపు తిప్పుతుందనే విషయం అందరికీ తెలిసిందే. చాలాకాలంగా కళామతల్లిని నమ్ముకొన్న సీనియర్ నటుడు ఆనంద చక్రపాణిని అదే ఒక్క ఛాన్స్ బిజీగా మార్చింది. మల్లేశం చిత్రంలో తండ్రి పాత్రలో ఆయన నటన సినీ విమర్శకులను, ప్రముఖులను, సాధారణ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసింది. మల్లేశం సినిమా ఆనంద చక్రపాణి నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వరుస విజయాలు ఆయనను పలకరించాయి. భారీ సినీ నిర్మాణ సంస్థల ఆఫర్లతో ఆనంద చక్రపాణి ఇప్పుడు బిజీ ఆర్టిస్టు అయిపోయారు. తాజాగా ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

     మల్లేశంకు ముందు.. తర్వాత

    మల్లేశంకు ముందు.. తర్వాత

    నా జీవితం మల్లేశంకు ముందు.. మలేశంకు తర్వాత అని చెప్పుకోవాలి. మల్లేశం సినిమాకు ముందు ఇండస్ట్రీలో స్థిరపడటానికి చాలా కష్టపడ్డాను. చాలా ఓపిక, సహనంతో నేను అవకాశాల కోసం నిరీక్షించాను. మల్లేశం చిత్రంలో అవకాశం వచ్చినప్పుడే నా కెరీర్‌కు ఢోకా ఉండదని అనుకొన్నాను. మల్లేశం సినిమా రిలీజ్ తర్వాత నా అంచనాలు తప్పు కాలేదు. అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నా సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కిందనే సంతోషం కలిగింది అని ఆనంద చక్రపాణి అన్నారు.

    మరిచిపోలేని ఎన్నో ప్రశంసలు..

    మరిచిపోలేని ఎన్నో ప్రశంసలు..

    మల్లేశం సినిమా తర్వాత దర్శకులు సుకుమార్, నందినీ రెడ్డిలాంటి ప్రముఖుల ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోలేను. అంతేకాకుండా సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు నన్ను ఆశీర్వదించిన తీరుతో నా జన్మధన్యమైంది. అలాగే నాలోని ప్రతిభను గుర్తించి పలు సంస్థలు నాకు మంచి ఆఫర్లు ఇచ్చారు. ఇప్పడు చాలా అవకాశాలు నా తలుపు తడుతున్నాయి అని ఆనంద చక్రపాణి పేర్కొన్నారు.

    అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్

    అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్

    మల్లేశం సినిమా నా లైఫ్‌లో ఊహించని మార్పులు తెచ్చింది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చిందని ఆనంద చక్రపాణి తెలిపారు. సబర్ కా ఫల్ మీటా హోతా హై (నిరీక్షణ ఎప్పటికైనా మిఠాయి లాంటి ఫలితాన్ని అందిస్తుంది అనే సూక్తిని నమ్ముతాను. మల్లేశం దర్శకుడు,నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటాను అని అన్నారు.

    ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు

    ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు

    ప్రస్తుతం దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందించే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాను. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో V చిత్రంలో విలన్ హరీష్ ఉత్తమన్ తండ్రిగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాట పర్వంలో కీలకపాత్రను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి నటించే చిత్రంలో హీరోయిన్‌కు తండ్రిగా, ఇంకా పేరు పెట్టని చిత్రంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రిగా, సతీష్ పరమ్‌వేద దర్శకత్వంలో ఊరికి ఉత్తరాన చిత్రంలో హీరో‌కు ఫాదర్‌గా, ప్లేబ్యాక్ అనే చిత్రంలో హీరోయిన్‌కు తండ్రిగా, గెలుపు చిత్రంలో హీరో ఫాదర్'గా నటిస్తున్నాను. ఇంకా మూడు ప్రముఖ బ్యానర్లతో చర్చలు జరుగుతున్నాయి అని ఆనంద చక్రపాణి తెలిపారు.

    English summary
    Ananda Chakrapani Interview: Mallesham movie changed my life. After Mallesham, I got many offers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X