Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వకీల్ సాబ్ టికెట్ల కోసం టార్చర్.. నా రెమ్యునరేషన్ మొత్తం ఖర్చు చేసినా కష్టమే.. అనన్య నాగళ్ల
హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా రూపొందిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో ముగ్గురు బాధిత మహిళల్లో ఒకరిగా మల్లేశం ఫేమ్ అనన్య నాగళ్ల నటించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె మాట్లాడుతూ..
హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్
సినిమా హీరోయిన్లతో చిన్న గ్యాప్
తెలుగు అమ్మాయిలను తీసుకోవడానికి నిర్మాతలు సంకోచిస్తారు. ఇండస్ట్రీ వాళ్లకు తెలుగు హీరోయిన్లకు మధ్య చిన్న గ్యాప్ ఉంది. తెలుగు అమ్మాయిలంటే జనరల్‌గా సపోర్ట్ చేయరు. చాలా యాటిట్యూడ్ ఉంటుందనే అభిప్రాయం తప్ప.. మరో రకమైన ఫీలింగ్ లేదు అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు.
అలాంటి కోరికతో ఉన్నా
నాకు ప్రత్యేకంగా అలాంటి.. ఇలాంటి పాత్ర ధరించాలనే కోరిక లేదు. ఏ సినిమాలోనైనా నేను ధరిస్తే ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందనే ఫీలింగ్ ఉంటే చాలు. అలాంటి పాత్రలను పోషించడానికి సిద్దంగా ఉంటాను. అలాగే నేను ఓ సినిమాలో ఉన్నానంటే.. ఆ సినిమాకు వెళ్లవచ్చనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగితే నటిగా అంతకంటే మరో విషయం ఏమీ ఉండదు. నటనపరంగా నాకు పరిమితులు ఏమీలేదు. అని అనన్య చెప్పారు.
జనరేషన్ బట్టి అమ్మాయిల్లో..
అమ్మాయిలకు, అబ్బాయిలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ముందు జనరేషన్ మహిళలు, పురుషులకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పటి జనరేషన్లో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం అమ్మాయిలనే కాదు.. అబ్బాయిలను కూడా పద్దతిలో పెంచాల్సిన బాధ్యత ఉంది అని అనన్య పేర్కొన్నారు.
సెలబ్రేషన్స్‌కు టైమ్ ఎక్కడిది
సినిమా బాగుండి.. నా పాత్ర బాగుంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. ప్రస్తుతం బబ్లీ రోల్స్ చేయాలని ఉంది. శృతి హాసన్‌తో మాకు కాంబినేషన్ సీన్లు లేవు. ఈ సినిమాను చేసిన తర్వాత సెలబ్రేషన్స్‌కు సమయం లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సెలబ్రేషన్స్ చేసుకొంటాను.
టికెట్ల కోసం నా ఫ్రెండ్స్ టార్చర్
వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌కు ముందు ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా టికెట్లు ఇప్పించమని కోరుతున్నారు. వారందరికి టికెట్లు కొనిచ్చే డబ్బు నా వద్ద లేదు. ఈ సినిమాకు తీసుకొన్న రెమ్యునరేషన్ కూడా పెట్టినా వారికి నేను టికెట్లు కొనివ్వలేను అని నవ్వుతూ అనన్య నాగళ్ల చెప్పారు.