పవన్ కల్యాణ్‌ మూవీపై నాకు అలాంటి అనుమానాలు.. వకీల్ సాబ్ గురించి అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మల్లేశం మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన టాలెంటెడ్ నటి అనన్య నాగళ్ల. సినిమా ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా తన మార్కును చూపించే యువ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నారు. టాలీవుడ్‌లోకి ప్రవేశించిన కొద్ది సమయంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొన్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 9వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనన్య మీడియాతో ముచ్చటిస్తూ..

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

వకీల్ సాబ్‌లో నా పాత్ర ఎలాంటిదంటే

వకీల్ సాబ్‌లో నా పాత్ర ఎలాంటిదంటే

వకీల్‌ సాబ్ మూవీలో నాది అమాయకమైన యువతి పాత్ర. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూరుకుపోయి కష్టాలు అనుభవించే వర్కింగ్ ఉమెన్ పాత్ర. నా పాత్రపై చాలా సానుభూతి ఉంటుంది. అయ్యో పాపం ఈ అమ్మాయికి ఇలా జరిగిందా అని అనుకొనే పాత్ర. ఈ రోల్ కోసం దర్శకుడు శ్రీరాం వేణు ఫోన్ చేశాడు. మల్లేశం సినిమా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ తర్వాత ఆ సినిమా చూసి ఫోన్ చేశారు. ఆ తర్వాత నాతో రెండు, మూడు ఆడిషన్స్ నిర్వహించారు. ఆ తర్వాత నాకు ఆఫర్ ఇచ్చారు అని అనన్య నాగళ్ల తెలిపారు.

అందంతో ఆకట్టుకొంటున్న సోని చరిష్టా.. ఎద అందాలతో యువ హీరోయిన్ రచ్చ

ఆఫర్ నిజమేనా అనే ప్రశ్నతో

ఆఫర్ నిజమేనా అనే ప్రశ్నతో

పింక్ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఆయన చిత్రంలో నాకు ఆఫర్ వచ్చిందనే విషయం తెలిసిన తర్వాత నాకు ఏం జరుగుతున్నదో అర్ధం కాలేదు. నాకు వచ్చిన ఆఫర్ నిజమేనా అనే ప్రశ్నలు వెంటాడాయి. షూట్‌కు వెళ్లే వరకు ఈ ఆఫర్ నిజమవుతుందా అనే డౌట్‌లో ఉన్నాను. రెండు రోజులు తర్వాత ఈ ఆఫర్ నిజమే అని తెలుసుకొన్న తర్వాత హ్యాపీగా ఫీలయ్యాను అని అనన్య పేర్కొన్నారు.

వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

పవన్ కల్యాణ్ గురించి తెలియదు

పవన్ కల్యాణ్ గురించి తెలియదు

పింక్ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారనే విషయం నాకు ముందుగా తెలియదు. నాలుగైదు ఆడిషన్స్ పూర్తయిన తర్వాత నాకు తెలిసింది. అదే విషయాన్ని దర్శకుడు శ్రీరాం వేణును అడిగితే నీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. శ్రీరాం వేణు కన్ఫర్మ్ చేసిన తర్వాత మరింత సంతోషం పెరిగింది అని అనన్య తెలిపారు.

పవన్ కల్యాణ్‌తో చాలా ఫన్నీగా

పవన్ కల్యాణ్‌తో చాలా ఫన్నీగా

పవన్ కల్యాణ్ సార్‌తో సెట్లో చాలా ఫన్నీ విషయాలు జరిగాయి. ఆయనను సెట్లో చూసి చాలా నేర్చుకొన్నాను. ఆయన నుంచి స్పూర్తి పొందాను. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అనే సాధారణ విషయాలు ఆయన మాట్లాడరు. చాలా ఇంటెన్సివ్ విషయాలపై ఆయన మాట్లాడుతారు అని అనన్య పేర్కొన్నారు.

యాక్టింగ్‌లో చాలా ఇంటెన్సివ్‌ ఉందని

యాక్టింగ్‌లో చాలా ఇంటెన్సివ్‌ ఉందని


వకీల్ సాబ్‌లో నివేదా థామస్, అంజలి, నాకు, పవన్ కల్యాణ్‌కు మధ్య చాలా ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ముందుగా నాతో కొన్ని సీన్లు చిత్రీకరించారు. నాలుగైదు సార్లు ఓ సీన్‌ను క్లోజప్ షాట్ తీశారు. అయితే నాలుగు సార్లు చాలా ఇంటెన్సిటీతో నేను డైలాగ్స్ చెప్పడంపై పవన్ కల్యాణ్ ప్రశంసించారు. మీ యాక్టింగ్‌లో ఇంటెన్సిటివ్ కోషంట్ ఉంది. ఒకే రకమైన ఇంటెన్సిటీతో అలా ఎలా చెప్పగలగుతున్నారు అని పవన్ అడగడంతో చాలా హ్యపీగా ఫీలయ్యాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X