పాలిటిక్స్ నాకు కొత్తేమీ కాదు.. రాజకీయాలపై అనసూయ షాకింగ్ కామెంట్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన మమ్ముట్టి తర్వాత అంత పేరు తెచ్చుకొన్న పాత్ర యాంకర్ అనసూయదేనని విమర్శకులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. పాలిటిక్స్ నేపథ్యం ఉన్న పాత్రలో నటించిన తర్వాత.. రాజకీయాలపై ఆసక్తి కలిగిందా అనే ప్రశ్న అనసూయను వెంటాడింది. కథనం సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ.. రాజకీయాలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
యాత్ర సినిమా తర్వాత రాజకీయాలపై ఆసక్తి కలుగలేదు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. సమాజానికి ఏదో చేయాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. రాజకీయాల్లో చాలా పరిమితులు ఉంటాయి. నేను రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం సినిమా నుంచి వచ్చాను. ఓల్డ్ సిటీలోని అక్బర్ భాగ్‌లో మా నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. నేనే రాజకీయాల్లో నుంచి ఆయనను క్రమంగా తప్పించాను. ఒకప్పుడు పాతబస్తిలో ఆయన పహిల్వాన్. కుస్తీ పోటీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించారు. మాది మొదటి నుంచి రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే.. పాలిటిక్స్ కొత్త కాదని చెప్పారు.

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా, బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ఈనెల 9న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
నటీనటులు, సాంకేతిక వర్గం
అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రణధీర్, ధన్ రాజ్, పృధ్వి, సమీర్ తదితరులు
ఎడిటర్: ఎస్. బి. ఉద్ధవ్,
మ్యూజిక్: రోషన్ సాలూరి,
ఆర్ట్: కె.వి రమణ,
కో డైరెక్టర్: శ్రీనివాస్‌రావు,
ఫోటోగ్రఫీ: సతీష్ ముత్యాల,
సమర్పకులు: బేబీ గాయత్రి రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్. విజయ చౌదరి,
నిర్మాతలు: బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాజేష్ నాదెండ్ల.


Click it and Unblock the Notifications











