పెళ్లికి ముందు ఆయనతో 8 ఏళ్లు రిలేషన్‌షిప్.. అతడి కులం ఏమిటో నాకు తెలియదు.. అనసూయ
రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షయని, విమానంలో సుమతి పాత్రతో మెప్పించిన యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ తాజాగా పెదకాపు చిత్రంలో మరో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రతో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ మీడియాతో మాట్లాడుతూ..
కులాల గురించి పట్టించుకొను
శ్రీకాంత్ ఇలాంటి యాక్షన్ సినిమా తీస్తారని అనుకోలేదు. శ్రీకాంత్ అడ్డాల అంటే సాఫ్ట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. పెదకాపు కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. పెదకాపు సినిమాలో కులాలు గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ నేను కులాల గురించి పెద్దగా పట్టించుకోను. పెదకాపు అంటే ఊరికి పెద్దగా వ్యవహరించే వారు అని అనసూయ భరద్వాజ్ చెప్పారు.

శ్రీకాంత్ అడ్డాల నటిస్తున్నారని
ఇక పెదకాపు సినిమాలో శ్రీకాంత్ అడ్డాల నటించారనే విషయం నాకు తెలియదు. సినిమా షూట్ చేసేంత వరకు తెలియలేదు. ప్రతీ దర్శకుడిలో యాక్టర్ ఉంటారు. బోయపాటి శ్రీనులో కూడా మంచి యాక్టర్ కనిపిస్తారు. ఆయనను చూసినప్పుడు బోయపాటి కూడా యాక్టింగ్ చేస్తారని అనుకొనే దానిని. కానీ శ్రీకాంత్ నాకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన చాలా బాగా నటించాడు అని అనసూయ చెప్పింది.

నా భర్త కులమేమిటో నాకు తెలియదు
నేను నా పెళ్లికి ముందు భర్తతో ఎనిమిదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. బ్రహ్మణుడు నా పెళ్లి పత్రిక రాసే వరకు ఆయన బ్రహ్మణ కులానికి చెందిన వాడని నాకు తెలియదు. మా మధ్య కేవలం ఫుడ్, సినిమాలు, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకొనే వాళ్లం. ఆయన కులం గురించి తెలియదు. పెళ్లి సమయంలో కులం, గోత్రాల గురించి అడిగితే నాకు తెలియదు అని చెప్పారు అని అనసూయ చెప్పారు.
నా పిల్లలు అడిగితే..
సినిమాల్లో నేను చేసే నా క్యారెక్టర్ల గురించి నా పిల్లలు అడుగుతుంటారు. చెప్పాలనుకొంటే నేను చెబుతాను. లేదంటే మా ఆయనను చెప్పమంటాను. నేను కొన్ని విషయాలు దాచుకొకుండా నోటికి వచ్చినట్టు చెప్పేస్తాను. నాకు లౌక్యం తెలియదు. ఇప్పుడిప్పుడే ఏం మాట్లాడాలి. ఎంత మాట్లాడాలి. ఎలా మాట్లాడాలని అని నేర్చుకొంటున్నాను అని అనసూయ చెప్పారు.

నాకు కథ ఏమిటో చెప్పరు
పెదకాపు సినిమాలో నా పాత్ర పేరు, నా పాత్ర గురించి చెప్పను. సినిమాలోనే చూసి ఎంజాయ్ చేశాను. శ్రీకాంత్ అడ్డాలతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టుల్లో పాత్రలు ట్విస్టులు ఇస్తుంటాయి. నాకు కథ కూడా చెప్పలేదు. షూట్‌కు రమ్మంటారు. సీన్ చెబుతారు.. నేను నటిస్తున్నాను అని అనసూయ చెప్పారు.


Click it and Unblock the Notifications











