twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వయసు అడ్డుపడటం లేదు.. ఆ పాత్రకైనా రెడీ.. అనసూయ

    |

    క్షణం, రంగస్థలం, యాత్ర సినిమాల తర్వాత అనసూయ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. నటిగా మంచి పేరు తెచ్చుకొంటున్న నేపథ్యంలో సింగిల్ హీరోయిన్‌గా కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథనం చిత్రంలో దర్శకురాలి పాత్రను పోషించారు. మర్డర్ మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. అనసూయ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

    నా పాత్రను బట్టే రియాక్షన్

    నా పాత్రను బట్టే రియాక్షన్

    క్షణం సినిమా నాకు ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాతే నాకు మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. పెద్ద నిర్మాతలు, దర్శకులు రకరకాల సినిమా ఆఫర్లు ఇచ్చారు. కానీ నేను అప్పుడు అంగీకరించలేకపోయాను. క్షణం సినిమాకు ముందు నాపై నాకు నమ్మకం లేదు. యాక్టింగ్‌లో రాణిస్తానా? అనే అనుమానం ఉంది. క్షణం తర్వాత నా మీద నాకు నమ్మకం కలిగింది. టెలివిజన్‌కు, సినిమాకు చాలా తేడా ఉంటుంది. టీవీలో అనసూయ మాదిరిగా ఉంటాను. సినిమా అంటే పాత్రను బట్టి బిహేవ్ చేయాల్సి ఉంటుంది.

    ఆ సినిమాల తర్వాత ఇమేజ్ మారింది

    ఆ సినిమాల తర్వాత ఇమేజ్ మారింది

    క్షణం, రంగస్థలం, యాత్ర తర్వాత నా ఇమేజ్‌ మారిపోయింది. నటిగా చాలా మెచ్యురిటీ వచ్చింది. సోషల్ మీడియాలో నాపై పాజిటివ్ నేచర్ పెరిగింది. దానికి తోడు నాలో సహనం పెరిగింది. కొన్నింటిని పట్టించుకోవడం మానేశాను. నెటిజన్ల బిహేవియర్‌‌పై రియాక్ట్ కావడం లేదు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నాను కాబట్టి ఏదో కామెంట్లు వస్తాయనే విషయాన్ని తెలుసుకొన్నాను. ఇందులో ఎవరి తప్పు లేదని అర్ధమైంది. ఇంట్లో నా గురించి రాసే విషయాలను పెద్దగా పెట్టించుకోరు. నేను అవకాశమిస్తేనే యూట్యూబ్ లాంటి చానెళ్లలో ఏదో ఒకటి రాస్తుంటారు. అది వారి తప్పుకాదని నేను నమ్ముతాను.

     టాలెంట్ తగినట్టుగా కెరీర్ గ్రాఫ్‌పై

    టాలెంట్ తగినట్టుగా కెరీర్ గ్రాఫ్‌పై

    నా ప్రతిభకు తగినట్టుగా నా కెరీర్‌ ఉందా? లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ నాలోని టాలెంట్ తగినట్టుగా నా కెరీర్ గ్రాఫ్ లేదంటే దానిని కాంప్లిమెంట్‌గా తీసుకొంటాను. తెలుగు అమ్మాయిగా నాకు నేను టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇండస్ట్రీలో పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందనే విధంగానే కొందరు వ్యవహరిస్తారు. అయినా నాకు వచ్చే ఆఫర్లను నేను సరైన పంథాలోనే ఎంచుకొంటున్నానని అనుకొంటున్నా.

     నానమ్మ పాత్రకైనా నేను రెడీ

    నానమ్మ పాత్రకైనా నేను రెడీ

    రంగస్థలం, యాత్ర తర్వాత తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే కథనం సినిమా రిజల్ట్ తర్వాతనే నా కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలని అనుకొంటాను. యాత్ర కోసం నేను మూడు రోజులు పనిచేశాను. కానీ ఆ సినిమా వల్ల నాకు చాలా గుర్తింపు వచ్చింది. హీరోయిన్‌గా వయసు అడ్డు పడుతుందనే విషయాన్ని నేను పట్టించుకోను. వయసు కేవలం నంబర్ మాత్రమే. ఇప్పుడు నానమ్మ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉంటాను అని అనసూయ పేర్కొన్నారు.

    English summary
    Actor Anasuya Bharadwaj got good craze and name after Kshanam, Rangasthalam and Yatra. Now she is doing sole herone in Kathanam movie. Kathanam movie is set to released on August 10th. In this occassion, She spoke to Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X