మిడిల్ క్లాస్ వైఫ్‌నే.. పోపుల డబ్బాలే నా బ్యాంక్ .. అనసూయలో మరో కోణం

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ యాంకర్‌గా పాపులరై, నటిగా స్థిరపడ్డారు అనసూయ భరద్వాజ్. బుల్లితెర నుంచి వెండితెర వరకు తన ప్రయాణం, తెలిసి తెలియని వయసులో సుశాంక్‌తో ప్రేమ, పెళ్లి, ఎదుర్కొన్న కష్టాలు ఇలా అనసూయ జీవితంలో తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ. ఆయన హోస్ట్ చేసిన నిఖిల్‌తో నాటకాలు పాడ్‌కాస్ట్‌కు హాజరైన అనసూయ భరద్వాజ్ ఈ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

అనసూయను ఎవరైనా ఫ్లర్ట్ చేశారా?

'ఆడ, మగ అంటేనే సహజంగా ఆకర్షణ ఉంటుంది. మగవాళ్లు ప్రపోజ్ చేయడం ఆడవాళ్లకి ఇష్టముంటే చేయడం, లేదంటే నిరాకరించడం సహజం అయితే సినిమా వాళ్లపై జనం ఎక్కువగా ఫోకస్ చేయడానికి పలు రకాల కారణాలు ఉంటాయి. ఇదొక రంగుల ప్రపంచం, ఇక్కడుంటే గ్లామర్, ఆకర్షణ ప్రజలకు ఏదో జరుగుతుందన్న భావన కల్పిస్తుంది. నాకు 9వ తరగతిలోనే ప్రపోజల్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచే తప్పించుకోవడం అలవాటైంది. ఇండస్ట్రీలో లీడింగ్ లేడీగా ఉండాలంటే చాలా కండీషన్స్ అప్లయ్ చేయాలి.. దానికి నేనెవరిని తప్పుపట్టను. సినిమా అంటే నాకు ఇష్టమైన కళ.. నా టాలెంట్‌, నేను ఎంత వరకు చేయగలనో, నా పరిధి నాకు తెలుసు. దర్శకులు, రచయితలు చెప్పే కథకు నేను సెట్ కానని అనిపిస్తే నాకు నేనుగా తప్పుకున్న సందర్భాలు ఎన్నో' అని అనసూయ వ్యాఖ్యానించారు.

Anasuya Bharadwaj opens about ordinary middle class life in Nikhil Vijayendra Simha Podcast

అర్జున్ రెడ్డి వివాదం అందుకే

'నేను వసుదైవ కుటుంబం అని నమ్మేదానిని. అందరూ బాగుండాలి , అందులో నేనుండాలి అనే సూత్రాన్ని పాటిస్తా. లోక జ్ఞానం అనేది ఈ ప్రపంచంలో మన చుట్టూ జరిగే సంఘటనలు, ఎదురయ్యే వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. నిన్న నీకు రైట్ అనిపించింది.. ఇవాళ రైట్ అనిపించకపోవచ్చు. కుళ్లు జోకుల మీద నవ్వే అనసూయ.. అర్జున్ రెడ్డి సినిమా మీద ఎందుకు మాట్లాడుతున్నావ్ అని కామెంట్స్ వచ్చేవి. అక్కడ నేను యాంకర్‌ని, ఇక్కడ సమాజంలోని ఓ పౌరురాలిని. నేను ఎవరినైనా ఒక్క మాట అంటే నా వల్ల బాధపడ్డవాళ్లకి నన్ను ఏదైనా అనొచ్చు.. వాళ్ల తరపున మిగతా వాళ్లు మాటల దాడి చేయడం కరెక్టేనా' అని అనసూయ ప్రశ్నించారు.

జబర్దస్త్‌ను అందుకే వీడాల్సి వచ్చింది

'జబర్దస్త్‌లో హైపర్‌ ఆదితో కలిసి నేను చేసిన కొన్ని స్కిట్స్ హైలైట్ అయ్యాయి. ఆడ, మగ సంబంధాలు, ఎదురింటి పెళ్లాంపై వేసే సున్నితమైన జోకులు జబర్దస్త్‌లో ఉంటాయి. ఈ షోకు హోస్ట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతా, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం కాదు. తర్వాతి రోజుల్లో తనపై వేసిన పంచ్‌లు, జోకులపై నేనేందుకు స్పందించలేదు అనిపించిన సందర్భాలెన్నో. నేను బయట కనిపించేది వేరు, స్క్రీన్ మీద కనిపించే అనసూయ వేరు. ఆ జోకులకు మేం నవ్వడం లేదు.. అనసూయ అక్కడ నటిస్తోంది. పరిధి దాటిన జోకులపై ఎన్నోసార్లు స్పందించినా ఆ షోకు ఎంత వరకు అది కరెక్ట్ అనేది ఎడిటింగ్ రూమ్ డిసైడ్ చేస్తుంది. రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణించడం సరికాదనే నిర్ణయం తీసుకున్నా' అని అనసూయ స్పష్టం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, ఫోటోషూట్‌లు ఎందుకు

'గతంలో ప్రతి గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి, ఏదో ఒక షోటో షూట్‌ను అప్‌లోడ్ చేయాలనే ప్రెజర్ ఉండేది. ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇది వేసుకోకూడదనే ఒత్తిడిని ఎదుర్కొన్నా. నన్ను నన్నుగా ఇష్టపడే వారి కోసం షోలు, సినిమాలు, ప్రతి రోజూ నా జీవితంలో చోటు చేసుకునే అంశాలను ఖచ్చితంగా పంచుకుంటా. బిజీలో పడిపోయి ఫోటోలు, పోస్టులు పెట్టడం మరిచిపోతే .. మేడం ఫోటోలు పెట్టడం లేదని కామెంట్స్ పెడతారు. వాళ్ల కోసమైనా ఏదో ఒకటి పెట్టాలని పెడుతుంటా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేసినా ముందు నా కోసం నేను చేసుకుంటా, ఆ తర్వాత ఫాలోవర్స్ కోసం పోస్టులు పెడతా' నని అనసూయ వెల్లడించారు.

Anasuya Bharadwaj opens about ordinary middle class life in Nikhil Vijayendra Simha Podcast

బ్లాక్‌మనీ, ఐటీ దాడుల గురించి

'అనసూయకి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్ .. 2 కోట్లు పెట్టి డిఫెండర్ కారు కొనిందా అని అంటూ ఉంటారు. డిఫెండర్ కారు కొన్నానంటే అందులో నా ఒక్కదాని కష్టమే కాదు, నా భర్త, నా మామగారు, మా అమ్మ వాళ్ల భాగస్వామ్యం ఉంది. నాకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఎప్పుడూ లెక్కపెట్టలేదు. నాకు గుర్తున్నదల్లా హాలీడే ట్రిప్స్, ఎంజాయ్‌మెంట్స్ మాత్రమే. నాది మధ్యతరగతి హౌస్ వైఫ్ మెంటాలిటీ, జీవితం నాకు నేర్పిన గుణపాఠాలను చూసి ఇప్పటికీ పోపుల డబ్బాలో డబ్బులుంటాయి. విపరీతంగా ఆఫర్లు వెల్లువెత్తడంతో బాగా బిజీగా ఉన్నా, తెలుగులో ప్రతి ఛానెల్‌లోనూ హోస్ట్ చేసే ఏకైక యాంకర్‌ని.. 6 షోలు, 5 సినిమాలు చేస్తున్నాను. నాకు జీఎస్టీ అనేది ఒకటుందని తెలియదు, కొన్ని షోలకు ట్యాక్స్ కట్టలేదు, నాకు సీఏ కూడా ఉండేవాడు కాదు. ఇవన్నీ తెలియకపోవడంతో పొరపాటు జరిగింది' అని అనసూయ అంగీకరించారు.

అఫైర్స్ అంటకట్టేస్తున్నారు

'నా ఆడికారును ఎవరో ప్రొడ్యూసర్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని ఏదేదో రూమర్స్ రాశారు. నేను, మా ఆయన ఎంతో కష్టపడి నెలకు లక్షా 16 వేల రూపాయల ఈఎంఐ కడుతూ కోవిడ్‌కు ముందు లోన్ ఫినిష్ చేశాం. లైఫ్ స్టైల్ పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, ఇందుకోసం ఎంతో కష్టపడతాం. నా దగ్గర బ్లాక్‌మనీ లేదు, తాత ముత్తాల ఆస్తులు లేవు, నాది కానిదేది నాకొద్దు.. నాది అన్నది రూపాయి కూడా వదలను. నన్ను ఆంటీ అనేవాళ్లు ఆ దృష్టితో చూస్తున్నారేమో, నేను బికినీ వేసుకున్నానా, బట్టలు విప్పేసి తిరిగానా అనేది నా ఇష్టం. నా డ్రెస్సింగ్ స్టైల్ నీకెలా హాని కలిగిస్తుంది. నువ్వు చేసిన కర్మ ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టదు' అని అనసూయ హెచ్చరించారు.

Take a Poll

పవన్ కళ్యాణ్‌తో వర్క్ గురించి

'పవన్ కళ్యాణ్ గారితో గతంలో ఓ సినిమా మిస్ చేసుకున్నా. హరిహర వీరమల్లులో ఆయనతో కలిసి ఓ పాటలో నటించే అవకాశం వచ్చింది. ఈ పాట షూటింగ్ సమయంలో ఎప్పుడూ బుక్స్ చదువుతూ ఉండేవారు. హీరో అంటే అలా ఉండాలి. ఆయన ఎన్నింటికో నో చెప్పి, ఎన్నింటికో ఎస్ చెప్పబట్టే ఆ స్థాయికి వచ్చుంటారు. మెగా బ్రదర్స్ ముగ్గురూ స్వీట్ హార్ట్స్. మెగా హీరోలలో అందరితో నటించే అదృష్టం నాకు దక్కింది' అని అనసూయ భరద్వాజ్ తెలిపారు.

More from Filmibeat

Read more about: anasuya bharadwaj jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X