Anasuya Bharadwaj: అలా వెళ్లకపోవడం వల్లే హీరోయిన్ అవకాశాలు రాలేదట.. ముక్కుసూటిగా చెప్పేసిన అనసూయ!
యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్.. నటిగా దూసుకుపోతోంది. అద్భుతమైన చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రంగమ్మత్త క్యారెక్టర్ లో రామ్ చరణ్ అత్తగా ఇరగదీసిన ఈమె.. ఆ తర్వాత పుప్ష సినిమాలో మంగళం సీను భార్యగా డీగ్లామరస్ పాత్రలో కనిపించింది. అలాగే ఇటీవలే విమానం సినిమాలో వేశ్య క్యారెక్టర్ లో సుమతిగానూ ఆకట్టుకుంది. ఇలా భిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరియర్ గురించి సినిమా అవకాశాల గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.
ముఖ్యంగా అనసూయకు తన కెరియర్ ప్రారంభంలో చాలా అవకాశాలు వచ్చాయని.. కానీ ఆమె వాటిని అందిపుచ్చుకోలేక పోయిందని తెలిపింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని ఓ పాటలో ఛాన్స్ వచ్చినప్పటికీ తాను నో చెప్పిందని వివరించింది. అయితే గుంపులో నటించడం ఇష్టం లేకే తాను ఈ సినిమాను చేసేందుకు ఇష్టపడలేదని వెల్లడించింది. చాలా మంది ద్వారా ఈ పాటలో నటించమని అడిగించినప్పటికీ.. తనకు పెద్దగా లౌక్యం లేకపోయిందని అందులోనూ అదే సమయంలో తాను గర్భవతిని అయ్యానని స్పష్టం చేసింది.

అయితే పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్, ఆయన అభిమానులు నేను నో చెప్పడంతో ఫుల్ హర్ట్ అయ్యారని వివరించింది. దీనిపై ట్విట్టర్ లో పెద్ద చర్చే సాగిందని వెల్లడించింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత తన తప్పు తెలుసుకుని డైరెక్టర్ త్రివిక్రమ్ కు సారీ చెప్పినట్లు అనసూయ పేర్కొంది. అయితే తాను నో చెప్పడం తప్పు కాకపోయినప్పటికీ... చెప్పే విధానం మాత్రం తప్పు అని ఆ తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను చేసిన ట్వీట్స్ లో ఆ గుంపులో చేయడం నాకిష్టం లేదు అని అనడంతో పాటు.. పవన్ కల్యాణ్ తో వస్తున్న ఈ సినిమా కంటే త్రివిక్రమ్ పాత సినిమాలు అతడు, ఖలేజాలంటేనే నాకిష్టం అంటూ చెప్పానని గుర్తు చేసింది.

అయితే అప్పటికీ, ఇప్పటికీ తనలో చాలా మార్పు వచ్చిందని... గతంలో ఎవరితో ఎలా మాట్లాడాలో తనకు సరిగ్గా తెలియకపోయేదనని అనసూయ భరద్వాజ్ వివరించింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందని... చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలోనే పని చేస్తున్నందుకు... ఎవరితో ఎలా మాట్లాడాలో కాస్త తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికైనా తాను ముక్కు సూటిగానే మాట్లాడతానని.. కాస్త ఆలోచించి మాట్లాడుతున్నానని వివరించింది. అలాగే షూటింగ్స్ లో తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతానని స్పష్టం చేసింది.

సినిమా అయిపోయాక జరిగే పార్టీలకు తాను చాలా దూరంగా ఉంటానని అనసూయ భరద్వాజ్ వెల్లడించింది. ఆ కారణఁగానే తాను హీరోయిన్ అయ్యే అనేక అవకాశాలను కోల్పోయినట్లు చెప్పింది. అయితే కేవలం పార్టీలకు వెళ్తేనే సినిమా అవకాశాలు, ముఖ్యంగా హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయంటే మాత్రం తాను అస్సలే వాటిని ప్రోత్సహించనని పేర్కొంది. గతంలో ఏదైనా ఛాన్స్ వస్తే తనకే ప్రాధాన్యం ఉండాలని కోరుకునే దాన్నని కానీ ప్రస్తుతం ఎలాంటి పాత్ర వచ్చిన తన నటనతో తనకు గుర్తింపు వచ్చేలా చేసుకోగలననే నమ్మకం వచ్చిందని తెలిపింది రంగమ్మత్త.


Click it and Unblock the Notifications











