రాంగోపాల్ వర్మతో అఫైర్ అంటగట్టారు.. అప్పుడు ప్రెగ్నెంట్‌ని.. నా భర్త ఏమన్నారంటే.. అనసూయ

By Rajababu

Recommended Video

Anasuya as Rangammatta, Exclusive Interview

అనసూయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. హెచ్ఆర్ (హ్యుమన్ రీసోర్స్) ఉద్యోగిగా ఉంటూ మీడియాలోకి ప్రవేశించారు. ఆ తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన రెచ్చిపో సినిమాలో ఓ పాత్రలో మెరిసారు. నితిన్, ఇలియానా నటించిన ఆ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత టెలివిజన్ షోలలో యాంకర్‌గా రాణించారు.

జబర్దస్త్ కామెడీ షోతో ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత పలు చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. ప్రస్తుతం రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. రంగస్థలం చిత్రం దూసుకుపోతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనసూయ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

నాకు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు.

నాకు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు.

రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత చాలా మంది దర్శకులు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు నాపై ఉన్న ఇమేజ్ భిన్నంగా నా గురించి ఆలోచిస్తున్నారు. అయితే మళ్లీ రంగమ్మత్త లాంటి పాత్రలు మళ్లీ చేయను. విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ప్రయత్నిస్తాను.

జబర్దస్త్ షో మారిపోయింది

జబర్దస్త్ షో మారిపోయింది

జబర్ధస్త్ కామెడీ షోపై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందికరంగా షో ఉంటుందనే విమర్శలను దృష్టిలో పెట్టుకొని ద్వందర్థాలు తగ్గించాం. ఇప్పుడు ఫ్యామిలీ అంతా వినోదం పొందే మాదిరిగా జబర్దస్త్‌ను మార్చాం. దానికి కారణం మీడియానే. అందుకు మేము థ్యాంక్స్ చెబుతున్నాను.

 రంగమ్మత్త బాధ్యతను పెంచింది

రంగమ్మత్త బాధ్యతను పెంచింది

రంగమ్మత్త పాత్ర నాపై బాధ్యతను పెంచింది. ఇక ముందు నేను చాలా సెలక్టివ్‌గా పాత్రలను ఎంపిక చేసుకొంటాను. క్షణం చిత్రంలో మాదిరిగా నేను పోలీస్ పాత్రలు గానీ, రొటీన్, రెగ్యులర్ పాత్రలు పోషించను. రంగమ్మత్త సినిమా తర్వాత కొత్తగా ఇంకా ఆఫర్లు రాలేదు. రంగస్థలం సినిమా తర్వాత రెమ్యునరేషన్ పెంచారనే వార్తల్లో వాస్తవం లేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు. ఎక్కువ రోజులు ఇండస్ట్రీ ఉండాలనుకొంటాను.

 హాట్ అత్త అనుకొన్నారు.. కానీ

హాట్ అత్త అనుకొన్నారు.. కానీ

రంగమ్మత్త రోల్‌కు సంబంధించిన లుక్ రిలీజ్ చేసినప్పుడు పల్లెలో హాట్ హాట్ అత్త అని ఊహించుకొన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఒకరకమైన అనుభూతితో బయటకు వచ్చారు. రంగమ్మత్త క్యారెక్టర్‌పై, నాపై గౌరవం పెరిగింది. అలాంటి పాత్రలు మళ్లీ మళ్లీ రావు. అందుకే మళ్లీ రంగమ్మత్త లాంటి పాత్ర చేయను. ఈ పాత్రకు నాకు వచ్చిన ప్రశంస నా భర్త నుంచే.

సుకుమార్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా

సుకుమార్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా

ఆర్య2 చిత్రంలో నాకు ఓ రోల్‌ను దర్శకుడు సుకుమార్ ఆఫర్ చేశాడు. అప్పుడు నేను ఆ పాత్రను తిరస్కరించాను. ఎందుకంటే అప్పుడే నాకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. సినిమా పరిశ్రమ అంటే నాకు కూడా భయం ఉండేది. అందుకే నేను ఆ పాత్రను ఒప్పుకోలేదు. అప్పుడు సుకుమార్ ఆఫర్ ఒప్పుకొంటే ఇప్పుడు రంగమ్మత్త పాత్ర దొరికేది కాదేమో. పెళ్లైపోయిన తర్వాత నా భార్త ఆలోచనావిధానం మారిపోయింది.

వర్మతో అఫైర్.. అండగా నా భర్త

వర్మతో అఫైర్.. అండగా నా భర్త

మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకులు రాంగోపాల్ వర్మతో కలిసి పనిచేశాను. ఆ సమయంలో నాకు వర్మతో అఫైర్ అంటగట్టారు. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. ఆ వార్తలు చూసి చాలా భయపడ్డాను. కానీ నా భర్త అండగా నిలిచారు. ఏ విషయమైనా నేను నమ్మనంత వరకు నీవు భయపడే అవసరం లేదు అని నా భర్త చెప్పారు. ఒకవేళ నమ్మితే నీవు ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇండస్ట్రీలో మంచి, చెడు..

ఇండస్ట్రీలో మంచి, చెడు..

సినిమా పరిశ్రమలో రకరకాల మనుషులు ఉంటారు. మంచి, చెడు రెండు ఉంటాయి. మనం స్వీకరించే, ఎంచుకొనే రూట్ వల్లనే మనకు మంచి జరుగాలా? లేదా చెడు జరిగేది తెలుస్తుంది. సినిమా షూటింగ్‌లకు మా కుటుంబ సభ్యులను తీసుకెళ్లి చూపించాను. దాంతో వారు నాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. దాంతో యాక్టింగ్‌ కెరీర్‌లో కొనసాగుతున్నాను.

స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు

స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు

విన్నర్ తర్వాత నాకు స్పెషల్ సాంగ్ ఆఫర్లు చాలానే వచ్చాయి. విన్నర్‌ ఆఫర్‌‌ను కూడా ఒప్పుకోలేదు. కానీ షూటింగ్ ఒకరోజు ముందు పాటలోని లిరిక్స్‌ను నాకు ఎరగా వేశారు. బర్గర్ బుగ్గలు, యాపిల్ అంటూ ఉన్న పాట నన్ను ఆకట్టుకొన్నది. అందుకే ఎగిరి గంతేసి వెళ్లి ఆ పాటలో నటించాను. నా పేరుతో ఉన్న పాట చరిత్రలో నిలిచిపోతుంది అనే ఫీలింగ్ ఒప్పుకొన్నాను.

ఐటెం అని పిలువద్దు

ఐటెం అని పిలువద్దు

ఐటెమ్ గర్ల్, ఐటెమ్ పాట అంటే మహిళలను కించపరిచినట్టు భావిస్తాను. ప్రాణం లేని వస్తువులను ఐటెం అంటారు. మేము అలాంటి వాటి కాదు. ప్రేక్షకులకు వినోదం అందించే ప్రత్యేకమైన పాటలు అవి. ఐటెం అంటే నేను ఒప్పుకోను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X