ఛీ.. నిన్ను అలా వాడుకొన్నామా? పెళ్లైతే అంతేనా? ఆమె కెవ్వుకేక అంటే.. అనసూయ

By Rajababu

టెలివిజన్ న్యూస్ యాంకర్‌గా మీడియాలోకి ప్రవేశించిన అనసూయ.. ఆ తర్వాత అనేక రూపాల్లో కనిపించారు. టెలివిజన్ హోస్ట్‌గా, సినీ పరిశ్రమలో నటిగా వివిధ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. క్షణం, సొగ్గాడే చిన్నినాయన చిత్రాలు ఆమె నటనకు గీటురాయిగా నిలిచాయి. తాజాగా అనసూయ నటించిన రంగస్థలం చిత్రం ప్రేక్షకుల నీరాజనాలు అందుకొంటున్నది. అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ నేపథ్యంలో అనసూయ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. అనసూయ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

Recommended Video

Rangasthalam Beats Khaidi No.150 In Its First Weekend
పల్లెటూరుతో అనుబంధం లేదు

పల్లెటూరుతో అనుబంధం లేదు

రంగస్థలం సినిమాకు ముందు నాకు పల్లెటూరు సినిమాతో పెద్దగా అనుబంధం లేదు. మా నాన్న ఊరు పోచంపల్లి గ్రామం. కానీ ఆ ఊరికి ఒక్కసారి మాత్రమే వెళ్లాను. మాది తాత, అమ్మమ్మ వాళ్లది ఘట్‌కేసర్. మా తాత ఊరికి సర్పంచ్‌గా ఉండేవారు. అప్పట్లో ఆ ఊరికి వెళ్లినపుడు నన్ను దొరసాని అనేవారు. అంతేతప్ప నాకు పెద్దగా పల్లెలతో పెద్దగా పరిచయం లేదు. రంగస్థలం సినిమాతోనే పూర్తిగా పల్లెతో అనుబంధం ఏర్పడింది.

సెట్ చూసి ఆశ్చర్యపోయాను

సెట్ చూసి ఆశ్చర్యపోయాను

రంగస్థలం సినిమా కోసం పాపికొండలు ప్రాంతంలోని కొన్ని ఊర్లలో షూట్ చేశాం. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లో వేసిన సెట్‌లో షూట్ చేశాం. మొదట్లో అది నిజంగా ఊరు అని అనుకొన్నాను. తర్వాత రామకృష్ణ వేసిన సెట్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. గోదావరి జిల్లాలోని ఓ ఊరును ఆంజనేయుడు సంజీవిని పర్వతంగా లేపుకొచ్చినట్టు ఇక్కడ సృష్టించారు.

నచ్చకపోతే అసహ్యించుకొంటారని

నచ్చకపోతే అసహ్యించుకొంటారని

రంగమ్మత్త క్యారెక్టర్ గురించి నాకు చెప్పినపుడు రెండు రకాలుగా ఆలోచించాను. ఒకవేళ నచ్చితే ప్రేక్షకులు విపరీతంగా మెచ్చుకొంటారు. లేకపోతే పక్కన పెడుతారు అని అనుకొన్నాను. లక్కీగా ప్రేక్షకులు ఆ పాత్రను బాగా ఆదరిస్తున్నారు. నాకున్న ఇమేజ్‌కు భిన్నంగా ఉన్న రంగమ్మత్త రోల్ చేశాను. ఆ పాత్ర చేయడానికి ముందు చాలా ఆలోచించాను. ఆ పాత్ర చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేశాను. ఓ తప్పు చేస్తేనే తప్పు అని తెలుసుకొనే అవకాశం ఉంటుంది.

అనసూయ అని మరిచిపోయా

అనసూయ అని మరిచిపోయా

రంగమ్మత్తగా మేకప్, గెటప్ వేసుకొన్న అనసూయ అనే విషయాన్ని మరచిపోయాను. ఆ తర్వాత నా టెలివిజన్ ఇమేజ్‌ను, నా సొంత ఆలోచనలను దూరంగా పెట్టాను. అందుకే ఈ రోజు చాలా మంది నా పాత్రను, నా నటనను ప్రశంసిస్తున్నారు. షూట్‌లో ఉన్నంత సేపు రంగమ్మత్త అని పిలిచేవారు. దాంతో నేను నిజంగానే రంగమ్మత్తగా మారిపోయాను. రంగమ్మత్త పాత్రలో నన్ను చూసి నాకు చాలా మంది డైరెక్టర్లు ఫోన్ చేసి ప్రశంసించారు. నీ టాలెంట్ ఇంత చెండాలంగా వాడుకొన్నామా? అని కొందరు డైరెక్టర్ నాతో అన్నారు. అందుకు సమాధానంగా ఇప్పుడు నాకోసం మంచి పాత్రలు రాసుకోండి అని వారికి చెప్పాను.

పెళ్లి అయితే ఆదరించరు

పెళ్లి అయితే ఆదరించరు

రాంచరణ్‌కు మరదలిగా నటించాల్సిన వయసులో అత్తగా నటించే అవకాశం రావడం మంచే జరిగింది. సొగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నాగార్జునకు మరదలిగా నటించాను. అదే సినిమాలో నా కంటే తక్కువ వయసు ఉన్న లావణ్య త్రిపాఠి పెళ్లైన యువతిగా నటించింది. పెళ్లైన హీరోయిన్లను ప్రేక్షకులు అంతగా ఆదరించరు. కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతున్నది. పెళ్లైన తర్వాత వచ్చిన రంగస్థలం చిత్రంలో సమంత పాత్రకు మంచి పేరు వచ్చింది.

 ప్రకాశ్ రాజ్ మాదిరిగా

ప్రకాశ్ రాజ్ మాదిరిగా

హీరోయిన్ పాత్రనా లేదా గ్లామర్ పాత్రనా నేను పెట్టించుకోను. ప్రకాశ్ రాజ్ మాదిరిగా విభిన్నమైన పాత్రలు పోషించాలని ఉంది. ఓ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ముసలివాడిగా కనిపిస్తాడు. వెంటనే మరో చిత్రంలో యంగ్ విలన్‌గా కనిపిస్తారు. నటిగా ప్రకాశ్ రాజ్‌ను స్ఫూర్తిగా తీసుకొంటాను. రంగమ్మత్త పాత్ర గురించి పెద్దగా ఆలోచించలేదు. నచ్చితే ప్రశంసిస్తారు. లేకపోతే అసహ్యించుకొంటారు అని మాత్రమే ఆలోచించాను. నా పని నేను చేసుకొంటూ వెళ్లాను. నా కష్టానికి ఫలితం ఇప్పుడు నాకు లభిస్తున్నది.

గ్లామర్ హీరోయిన్ క్రేజ్ ఎలా వచ్చిందో

గ్లామర్ హీరోయిన్ క్రేజ్ ఎలా వచ్చిందో

సినీ పరిశ్రమలో నాకు ఒకరకమైన ఇమేజ్ ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు అలా బ్రాండ్ పడింది. ప్రేక్షకులకే కాదు.. ఆడియెన్స్ కూడా అదే ఇమేజ్‌తో చూస్తున్నారు. రంగమ్మత్త పాత్ర నేను చేయగలనే నమ్మకం నిర్మాత, దర్శకులు పెట్టుకొన్నారు. వారి ఇచ్చిన ధైర్యంతోనే నేను ముందుకెళ్లాను. డబ్బింగ్ చెప్పిన తర్వాత రంగమ్మత్త పాత్ర గొప్పతనాన్ని తెలుసుకొన్నాను. ఆ పాత్రలో అనసూయ ఎక్కడ కనిపించలేదు. నా పాత్రనే కాదు.. రాంచరణ్, ఇతర నటీనటులు కాకుండా వారి పాత్రలే కనిపించాయి. రంగమ్మత్త పాత్ర పోషించిన తర్వాత నాలో పరిపక్వత వచ్చింది. సినిమా గొప్ప అనుభూతిని పంచింది.

రాంచరణ్‌తో నటించడం గొప్ప అనుభూతి

రాంచరణ్‌తో నటించడం గొప్ప అనుభూతి

రాంచరణ్‌తో నటించడం గొప్ప అనుభూతి. ఆయన ఇప్పటికే సూపర్‌స్టార్. మా మధ్య బోట్ సీన్ మొదటిసీన్. రాంచరణ్ చాలా కంఫర్టబుల్ ఉండటంతో నేను బాగా నటించగలిగాను. కథ విన్నప్పుడే నేను ఈ ప్రాజెక్ట్‌లో నటించాలని అనుకొన్నాను. రంగమ్మత్త అంటే ప్రేక్షకులు ఒప్పుకొంటారో లేదో అని భయపడ్డాను. అత్త క్యారెక్టర్ అంటే నా ఇమేజ్‌కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందో అనే టెన్షన్ పడ్డాను. ప్రేక్షకులను కన్విన్స్ చేయాలని నిర్ణయించుకొని ఆ పాత్రను చేశాను.

 భూతద్దంలో పెట్టి చూస్తారు

భూతద్దంలో పెట్టి చూస్తారు

సినీ పరిశ్రమలో హీరోయిన్‌కు పెళ్లి జరిగితే భూతద్దంలో పెట్టిచూస్తారు. సినిమాలకు పనికిరారు అనుకొంటారు. పెళ్లయిన తర్వాత జర్నలిస్టులు వారి వృత్తిని కొనసాగించవచ్చు. వేరే వృత్తులు చేసేవారు పెళ్లైనా వారి వృత్తిని కొనసాగిస్తారు. నా వృత్తి నటన. పెళ్లైతే నేను ఎందుకు నటించకూడదు. మాకే ఎందుకు పరిమితులు అని కోపం వచ్చేది.

 మలైకా ఆరోరా కెవ్వుకేక అంటే..

మలైకా ఆరోరా కెవ్వుకేక అంటే..

బాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి లేదు. మలైకా అరోరాకు 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కానీ గ్లామర్ హీరోయిన్‌గా, గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వుకేక లాంటి స్పెషల్ సాంగ్స్ చేస్తే అభిమానుల ఆదరిస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు చాలా పరిమితులు ఉన్నాయి. మేమంటే చాలా చులకనా? తెలుగువాళ్లు నన్ను వారి సొంత అమ్మాయిలా భావిస్తున్నారు. అందుకే వాళ్లు ఒప్పుకోవడం లేదని అభిప్రాయానికి వచ్చాను. అందుకే వారికి నచ్చే విధంగా పాత్రలు చేస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X