Bigg Boss Telugu 5 షణ్ముఖ్, సిరి హన్మంతు బండారాన్ని బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో నుంచి అనూహ్య పరిస్థితుల్లో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ తర్వాత తొలిసారి ఇంటిలోని విషయాలను యాంకర్ అరియానా గ్లోరితో పంచుకొన్నారు. ప్రియాంక, మానస్ లవ్ ట్రాక్, షన్ను, సిరి హన్మంతు మధ్య రిలేషన్ గురించి రవి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే కాకుండా ఆర్జే కాజల్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి క్లారిటీ ఇచ్చాడు. యాంకర్ రవి చెప్పిన అభిప్రాయాల ఎలా ఉన్నాయంటే..

గుంట నక్క అంటే నా ఫీలింగ్ ఏమిటంటే?
బిగ్‌బాస్ తెలుగు 5 షో నుంచి ఎలిమినేట్ అవుతానని అసలే ఊహించలేదు. పూర్తిగా అనుకోకుండా షాక్ తగిలినంత పనైంది. నటరాజ్ మాస్టర్ గుంటనక్క అంటే నేను ఫీల్ కాలేదు. ఇంట్లో వాళ్లు నన్ను చాలా ఆటపట్టించినా నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే నటరాజ్ మాస్టర్ మైండ్‌లో ఏదో పెట్టుకొని వచ్చాడు. అందుకే అలా నాపై కామెంట్లు చేస్తూ కనిపించాడు. నేను ఎప్పుడు ఇంటిలో సేఫ్ గేమ్ ఆడలేదు అని యాంకర్ రవి అన్నాడు.

షణ్ముఖ్ ఆడటం లేదు అంటూ రవి అసంతృప్తి
ఇక షణ్ముఖ్ జస్వంత్ ఆట గురించి యాంకర్ రవి అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంట్లో గేమ్ ఆడిన దాఖలాలు లేవు. ఎక్కడ ఆడుతున్నాడో నాకే అయితే తెలియదు. నేను ఇన్‌ఫ్లూయెన్స్ ఎవరినీ చేయలేదు. అలా చేయడానికి నేను మాట్లాడలేదు. ఎవరైనా నా మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారో తెలియదని యాంకర్ రవి తన మీద వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.

పింకిపై మానస్‌కు ఇష్టం లేదు
మానస్, ప్రియాంక లవ్ ట్రాక్ గురించి యాంకర్ రవి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మానస్‌ను గెలుచుకోవడానికి ప్రియాంక వచ్చిందా? లేక బిగ్‌బాస్‌ను గెలువడానికి వచ్చిందా అనే ప్రశ్నకు యాంకర్ రవి సమాధానం ఇస్తూ.. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే సమయం ముగిసిపోయింది. పింకిపై మానస్‌కు ఎలాంటి ఇంట్రస్ట్ లేదు. పింకిలో ఉన్న ఇష్టంలో సగం కూడా లేదు. అయితే మానస్, సన్నీ బాండింగ్‌పై స్పందిస్తూ.. ఫ్రెండ్ అన్నప్పుడు మంచి చేస్తే శభాష్ అనాలి.. తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి అంటూ యాంకర్ రవి తన అభిప్రాయాన్ని చెప్పాడు.

ఆర్జే కాజల్ గేమ్ ఛేంజర్ కాదు..
తన స్నేహితురాలు ఆర్జే కాజల్‌తో ఉన్న రిలేషన్ గురించి యాంకర్ రవి క్లారిటీ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య సిచ్యుయేషన్ బ్యాడ్. ఆమె తన గేమ్ ఆడుతున్నది. నేను నా గేమ్ ఆడుతున్నాను. కానీ ఆర్జే కాజల్ గేమ్ ఛేంజర్ కాదు. షణ్ముఖ్ చెప్పినట్టు ఆమె లేకపోతే గొడవలు తక్కువ అయ్యేవి అన్నారు. ఆ విషయానికి కావాలని స్పైస్ యాడ్ చేశారు అని యాంకర్ రవి తెలిపారు.

షణ్ముఖ్‌తో సిరి హన్మంతు కమిట్ అయి..
షణ్ముఖ్, సిరి హన్మంతు రిలేషన్ గురించి యాంకర్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు. దీప్తి సునైనాను షన్ను ఎంత బాగా లవ్ చేస్తాడో... చోటును సిరి కూడా అంతే లవ్ చేస్తుంది. అయితే వారిద్దరికి తమ రిలేషన్స్ గురించి తెలుసు. కానీ షన్నుతో సిరి హన్మంతు కమిట్ అయింది. షన్ను అంటే సిరి హన్మంతు ఇష్టపడుతున్నది. తనను ఇష్టపడుతున్నట్టు సిరి చెప్పిందని షన్ను అన్నాడు అంటూ యాంకర్ రవి తెలిపారు.


Click it and Unblock the Notifications











