వరుణ్ తేజ్ కంగారుపెట్టాడు.. ఆ స్థాయివారితో పోల్చద్దు.. F2కి సీక్వెల్ తీస్తా

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన F2 మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ చూరగొంటున్నది. ఈ చిత్రానికి అన్ని చోట్ల అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. సంక్రాంతి రేసులో ఈ చిత్రం విన్నర్ అనే టాక్ ఇప్పటికే సంపాదించుకొన్నది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమా విజయపథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే..

 F2 మూవీ స్క్రిప్టు గురించి

F2 మూవీ స్క్రిప్టు గురించి

F2 మూవీ స్క్రిప్టు చాలా క్లిష్టమైనది. పలు రకాల పాత్రలు, క్యారెక్టర్లు కనిపిస్తాయి. వాటి ప్లేస్‌మెంట్‌లో ఎలాంటి తేడా కనిపించినా సినిమాకే ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి రిస్క్ ఏమీ లేకుండా పక్కాగా స్క్రిప్టు చేశాం. దాదాపు నాలుగున్నర నెలలు ఈ సినిమా స్కిప్టుపై వర్క్ చేశాం.

గుండమ్మ కథ స్ఫూర్తి

గుండమ్మ కథ స్ఫూర్తి

నాకు బాగా నచ్చిన సినిమా గుండమ్మ కథ. ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది చేసిన సినిమా F2 మూవీ. గుండమ్మ కథలోని సూర్యకాంతం పాత్రను ప్రగతి చేత చేయించాం. ఇంకా నాపై ఈవీవీ, జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి ప్రముఖ దర్శకుల ప్రభావం ఉంది.ఆ స్థాయిలో సినిమా తీయాలని అనుకొనే వాడిని. వారి స్టయిల్‌ను అనుసరించి ఎఫ్2 సినిమా చేశాను. అందుకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది.

వెంకీ ఆసానం ఎలా పుట్టిందంటే

వెంకీ ఆసానం ఎలా పుట్టిందంటే

భార్యా బాధితుడైన వెంకీకి ఓ ప్రత్యేకమైన మేనరిజం ఉంటే బాగుటుందనుకొన్నాం. యోగాసానం లాంటిదే ఏదో పెట్టాలనుకొన్నాం. ఆ క్రమంలో పుట్టిందే వెంకీ ఆసానం. ఈ వెంకీ ఆసానానికి థియేటర్లలో, సోషల్ మీడియాలో బ్రహ్మండమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. జంధ్యాల, ఈవీవీ లాంటి దర్శకులతో పోల్చుతున్నారు. కానీ ఆ స్థాయి నాకు లేదు.

వెంకటేష్ టైమింగ్ అదిరింది

వెంకటేష్ టైమింగ్ అదిరింది

వెంకీ టైమింగ్ బాగుంటుందని నాకు తెలుసు. వరుణ్ విషయంలోనే కంగారు పడ్డాను. ఇప్పటి వరకు వరుణ్ కామెడీ సినిమా చేయలేదు. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అని అనుకొన్నాను. వెంకీ రేంజ్‌కు తగినట్టు వరుణ్ కామెడీ పండించాడు. తెలంగాణ యాసను బాగా చెప్పారు.

తమన్నా, మెహ్రీన్‌ను గ్లామర్‌గా

తమన్నా, మెహ్రీన్‌ను గ్లామర్‌గా

తమన్నా, మెహ్రీన్‌ను గ్లామర్‌గా చూపించడానికి కారణం రాఘవేంద్రరావు గారే కారణం. ఆ సినిమాల్లో రొమాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మెహ్రీన్ హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ చెప్పిన మేనరిజానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. గన్ మెన్ దగ్గర నుంచి ప్రతీ చిన్న పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

F2 మూవీకి సీక్వెల్ తీస్తా

F2 మూవీకి సీక్వెల్ తీస్తా

F2 మూవీ సక్సెస్‌తో సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఈ సినిమాకు సీక్వెల్‌గా F3 మూవీ ఉంటుంది. హిందీలో గోల్ మాల్ సిరీస్, హౌస్ ఫుల్ సిరీస్ లాంటి చేయాలని ఉంది. ఈ సినిమాపై వచ్చిన స్పందనను భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X