twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలో అదే మెయిన్ పాయింట్.. చిరు ఓకే అంటూ మూడు నెలల్లోనే.... అనిల్ రావిపూడి కామెంట్స్

    |

    మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అభిమానుల్లోనే కాక సగటు సినీ ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తోనే అంచనాలను ఆకాశన్నంటేలా చేసిన సరిలేరు టీమ్.. తాజాగా ట్రైలర్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతోన్న ఈ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

    తక్కువ సమయంలో..

    తక్కువ సమయంలో..

    తాను ఏదైనా సినిమా మొదలు పెట్టాలనుకున్నప్పుడు.. పూర్తి బౌండ్ స్క్రిప్ట్‌తోనే సంసిద్దంగా ఉంటానని తెలిపాడు. ప్లానింగ్ సరిగ్గా వేసుకుంటానని, అలాగే ప్రొడక్షన్ సైడ్, నటీనటుల సహాకారంతోనే ఈ చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తి చేయగలిగానని అన్నాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి ప్రకృతి కూడా సాయం చేసిందని, వర్షాలు పడల్లేదు.. అలా అనుకున్న టైమ్‌కు అన్ని షెడ్యూల్స్ పూర్తి చేశామని అందుకే ఇంత త్వరగా కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చాడు.

    అన్ని రకాల ఎమోషన్స్‌తో..

    అన్ని రకాల ఎమోషన్స్‌తో..

    ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని, దేశభక్తితో పాటే అందర్నీ కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలుంటాయని తెలిపాడు. ఈ కథకు మూలం ఓ సైనికుడేనని చెప్పుకొచ్చాడు. తాను సుప్రీమ్ షూటింగ్ సమయంలో రైళ్లో ప్రయాణిస్తుండగా.. ఆర్మీకి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడని, అతని మాటతీరు, టైమింగ్ అన్నింటిని చూస్తే ఆశ్చర్యమేసింది. సైనికులు కూడా మనలాగే ఉంటారు.. అవసరమైనప్పుడు అక్కడ యుద్దం చేస్తారు.. మామూలు సమయాల్లో ఇలానే ఉంటారని అనుకున్నానని అలా ఈ కథకు అక్కడ బీజం పడిందని తెలిపాడు.

    అదే మెయిన్ పాయింట్..

    అదే మెయిన్ పాయింట్..

    కాశ్మీర్ నుంచి కర్నూల్‌కు కథ ఎందుకు ట్రావెల్ అయింది.. మహేష్ బాబు అక్కడి నుంచి ఇక్కడికి తన అధికారిక పని మీదే వస్తాడని, అయితే అదేంటన్నదే ఈ చిత్రానికి ఆయువు పట్టులాంటిదని అన్నాడు. ఈ చిత్రంలో అదే మెయిన్ పాయింట్ అని కశ్మీర్ ఎపిసోడ్ తరువాత ఓ రగ్డ్ ఏరియాను ఎంచుకోవాలనుకున్నామని అందుకే కర్నూలును సెలెక్ట్ చేసుకున్నానమని తెలిపాడు. కర్నూలు, కొండారెడ్డి బురుజు అంటే ఇప్పటికీ ఒక్కడు సీన్ అందరికీ గుర్తుకు వస్తుంది.. అందుకు అదే సెంటిమెంట్ అనుకుని ఆ సెట్ వేసి షూట్ చేశామని తెలిపాడు.

    విజయశాంతి కోసమే ఆ పాత్ర..

    విజయశాంతి కోసమే ఆ పాత్ర..

    రాజా ది గ్రేట్ షూటింగ్ సమయంలో విజయశాంతిని కలిశానని, ఆమెకు ఇంట్రెస్ట్ ఉందని తనకు అర్థమైందని తెలిపాడు. సరైన కథ చెబితే ఓకే చెప్పే చాన్స్ ఉందని అనుకున్నట్లు తెలిపాడు. ఆ సమయంలోనే ఈ పాత్ర రాశాను.. ‘ఒక్కసారి వినండి.. నచ్చకపోతే వద్దని చెప్పండి' అని అన్నానని తెలిపాడు. ఎందుకుంటే ఒక్కసారి కథ విన్నాక నో అనదని తన నమ్మకమని పేర్కొన్నాడు. ఆ విధంగానే కథ విన్నాక పాత్ర బాగానచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలిపాడు. ఈ పాత్ర కేవలం ఆవిడ కోసమే రాశానని స్పష్టం చేశాడు.

    చిరు ఓకే అంటూ మూడు నెలల్లోనే..

    చిరు ఓకే అంటూ మూడు నెలల్లోనే..

    సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడిని చిరంజీవి పొగిడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన ఒకే చెబితే ఎగిరి గంతులేస్తానని, మూడు నెలల్లోనే కథ సిద్దం చేస్తానని తెలిపాడు. మరి ఆయన కోరిక తీరుతుందేమో చూడాలి.

    English summary
    Anil Ravipudi In Sarileru Neekevvaru Promotions
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X