అఫైర్ ఉందని చెప్పానా? బ్రేకప్ ఎవరితో.. పెళ్లి గురించి అంజలి సెన్సేషనల్ కామెంట్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అందాల తార అంజలి అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకొన్నది. ఆ తర్వాత గీతాంజలి, చిత్రంగద హారర్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పింది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం లీసా అనే చిత్రంలో అంజలి నటిస్తున్నది. ఇది పూర్తిగా 3డీ టెక్నాలజీతో రూపొందుతున్నది. ఈ సినిమా మే 24న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంజలి తెలుగు ఫిల్మీబీట్ తో ముచ్చటించింది. వివరాల్లోకి వెళితే.

నాకు ఎవరితో కాంపిటీషన్ లేదు

నాకు ఎవరితో కాంపిటీషన్ లేదు

సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవరితో కాంపిటీషన్ లేదు. నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. నేనెవరితో పోటీపడను. గొడవ పడను. ఓ హీరోయిన్ బాగా చేస్తే వాళ్ల యాక్టింగ్ ను అప్రిషియేట్ చేస్తాను. నా కెరీర్ ఆరంభంలో సమంత, శృతిహాసన్ తో పనిచేశాను కాబట్టి అలాంటి యాటిట్యుడ్ డెవలప్ కాలేదు. నేను ఎవరినీ పోటీగా భావించను. ఏవరైనా ఈ పాత్ర అంజలి చేస్తే బాగుంటుందని అనుకొంటే దానిని రెస్పెక్ట్ చేస్తాను అని అంజలి అని అన్నారు.

నాకు అందరితో మంచి రిలేషన్స్

నాకు అందరితో మంచి రిలేషన్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కో ఆర్టిస్టులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. నేనవరితో ఫైట్ చేయను. ఒకరిపైన జెలసీగా ఫీలవుతే బాగుండదు. కొంత మంది కొన్ని పాత్రలకు చాలా సూట్ అవుతారు. నా కెరీర్ మేరకు థ్రిల్లర్, హారర్ సినిమాలంటే ఇష్టపడుతాను. కాబట్టి ఇలాంటి సినిమాలకు నన్ను తీసుకొంటారు అని అంజలి పేర్కొన్నారు.

నాకు బ్రేకప్ జరిగిందని చెప్పానా?

నాకు బ్రేకప్ జరిగిందని చెప్పానా?

నాకు బ్రేకప్ జరిగిందని, అఫైర్ ఉందని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఇప్పుడు నాకు అఫైర్ ఉందని ఎప్పుడు చెప్పలేదు. నాకు కొందరితో ఉన్న ఫ్రెండ్ షిప్ మాత్రమే. నాకు ఎవరితో అఫైర్ లేదు. అలాంటప్పుడు నాకు బాధలేదు. సంతోషం లేదు. ఎలాంటి రిలీఫ్ కూడా లేదు అని అంజలి తెలిపారు.

నాకు అఫైర్ ఉంటే చెబుతాను

నాకు అఫైర్ ఉంటే చెబుతాను

నాకు ఎవరితోనైన అఫైర్ ఉంటే నేను చెబుతాను. ఒకవేళ భవిష్యత్లో రిలేషన్ షిప్ ఏర్పడితే మీడియాకు తప్పకుండా చెబుతాను. సోషల్ మీడియాలో నేను చాలా మందితో ఫొటోలు పోస్టు చేస్తుంటాను అయితే నాకు అందరితో రిలేషన్ ఉన్నట్టు కాదు కదా అని అంజలి అన్నారు.

ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్

ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్

ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్ లేవు. ఎందుకంటే నాకు చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రోజు ప్రెస్ మీట్, ఇంటర్వ్యూకు హాజరయ్యాను. రాత్రికి సైలెన్స్ సినిమాలో నటించేందుకు అమెరికా వెళ్లున్నాను. పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదు. సెలెన్స్ మూవీలో నాది మంచి రోల్. అందుకే మల్టీస్టారర్ మూవీ అయినా ఒప్పుకొన్నాను. అనుష్క శెట్టి, మాధవన్, హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఓ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్నది అని అంజలి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X