ఆ మూవీ 50వ సినిమా కావడం గర్వంగా ఉంది.. అంజలి (ఇంటర్వ్యూ)
హారర్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన గీతాంజలి మూవీలో హీరోయిన్ అంజలి ఫెర్ఫార్మెన్స్‌తో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శకుడు. కోనా ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి ఈ మూవీని కోనా వెంకట్ నిర్మించారు. అంజలి కెరీర్‌లో 50వ సినిమాగా మారిన ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా అంజలి ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
నాలుగేళ్ల క్రితం గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఐడియాను నాకు కోనా వెంకట్ చెప్పారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, ఇతర కారణాల వల్ల వెంటనే ఈ సినిమా పట్టాలెక్కలేకపోయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తర్వాత ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో మీరు ఊహించిన పాత్రలో నటించాను అని అంజలి చెప్పింది.

నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఆ మూడు చిత్రాలు కూడా ఇంగ్లీష్ అక్షరం G తోనే ప్రారంభం అవుతాయి. అందులో ఒకటి గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ గోదావరి, గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ మూడు సినిమాల్లో నా పాత్రలు వేటికి అవేగా ఉంటాయి అని అన్నారు.
గీతాంజలి సినిమా సీక్వెల్ కాబట్టి.. ఆ సినిమాలోని పాత్రలను మార్చలేదు. కానీ కొన్ని పాత్రలు కొత్తగా ఈ కథలోకి ప్రవేశించాయి. అలీ, సునీల్, సత్య పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే రెండో పార్ట్ స్టార్ట్ అవుతుంది. గీతాంజలి సినిమా చూడని వారికి కూడా ఈ సినిమా సులభంగా అర్ధం అవుతుంది అని ఆమె అన్నారు.

ఉగాది ఫెస్టివల్ రోజున ఈ సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. హారర్, కామెడీ మాత్రమే కాకుండా అనేక భావోద్వేగాలు మిళితం చేసి రూపొందించారు. మర్డర్ మిస్టరీ, హారర్ మూవీని చూసి ఎంజాయ్ చేశాను. ఈ సినిమా నా కెరీర్‌లో 50వ చిత్రం కావడం సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటి సుదీర్ఘమైన కెరీర్ ఉండటం గర్వంగా ఉంది అని అంజలి చెప్పింది.


Click it and Unblock the Notifications











