For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందుకే గీతా గోవిందం వదులుకొన్నా.. డిప్రెషన్‌లొకి వెళ్లాను.. అను ఇమ్మాన్యుయేల్

By Rajababu
|

అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారారు. కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్ సరసన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ఆమె నటించిన ఆక్సిజన్, అజ్హాతవాసి, నా పేరు సూర్య లాంటి చిత్రాలు ఘన విజయాలు సాధించకలేకపోయాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో నాగచైతన్య అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అను ఇమ్మాన్యుయేల్ ఫిల్మ్‌బీట్‌తో మాట్లాడింది. అను చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

ఇగో, కోపిష్టి పాత్రలో కనిపిస్తా

ఇగో, కోపిష్టి పాత్రలో కనిపిస్తా

శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నేను తల పొగరు, (ఇగోయిస్టిక్) కోపిష్టి అమ్మాయి పాత్రను పోషించాను. శైలజారెడ్డి పాత్రను పోషించిన రమ్యకృష్ణకు కూతురిగా నటిస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అను. ముందుగా నా పాత్ర పేరు జానకి. ఆ విషయాన్ని దర్శకుడు మారుతికి చెప్పడంతో నా పాత్ర పేరును అనుగా మార్చారు. తొలిసారి నా పేరుతో ఓ పాత్రను చేస్తున్నాను.

ఇగో అందరిలోనూ ఉంటుంది

ఇగో అందరిలోనూ ఉంటుంది

ఇగో అనేది ప్రతీ ఒక్కరిలో ఉండటం సహజం. మొత్తంగా అని చెప్పలేం గానీ వ్యక్తిగతంగా దాదాపుగా నా క్యారెక్టర్‌ కూడా అలానే ఉంటుంది. నాలో ఉండే కొంత ఇగో పార్ట్ పాత్రలో కూడా కనిపించింది. గతంలో నేను పోషించిన పాత్రల కంటే ఇది భిన్నమైంది.

అను పాత్రతో ప్రూవ్ చేసుకొనే..

అను పాత్రతో ప్రూవ్ చేసుకొనే..

నన్ను నేనుగా ప్రూవ్ చేసుకోవడానికి అను పాత్ర ఉపయోగపడింది. మారుతి కథ చెప్పినప్పుడే ఈ పాత్ర ఛాలెంజ్‌తో కూడుకొన్నదని అన్నారు. ఆయన అంచనాలకు తగినట్టే నేను నా పాత్రలో ఒదిగిపొయాను. తెర మీద చూస్తే మీకే తెలుస్తుంది.

రమ్యకృష్ణతో నటించడం గొప్ప అనుభూతి

రమ్యకృష్ణతో నటించడం గొప్ప అనుభూతి

రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటితో నటించడం చాలా గొప్ప అనుభూతి. ఆమె పర్సనాలిటీలో గొప్ప హుందాతనం ఉంటుంది. ఆమెలో గొప్పతనం ఏమిటంటే.. స్క్రిప్టు ముందు రోజు తీసుకెళ్లదు. సెట్లోకి రాగానే డైలాగ్ పేపర్ తీసుకొని రెండు నిమిషాల్లో పేరాల కొద్ది డైలాగ్స్ కంఠస్థం చేస్తుంది. ఆమె సెట్‌లోకి రాగానే ఏదో తెలియని శక్తి వచ్చేస్తుంది.

నా స్వభావానికి దగ్గరగా

నా స్వభావానికి దగ్గరగా

శైలజారెడ్డిలోని పాత్ర నాకు స్వభావానికి దగ్గరగా ఉండే రోల్. నేను కోపిష్టినే కాకపోతే సినిమాలో చూపించినంతగా కాదు. నా కోపాన్ని సరైన వ్యక్తి ముందు చూపిస్తాను. అనవసరంగా కోపం తెలియని వ్యక్తి ముందో.. మీడియా ముందో చూపిస్తే.. ఈ రోజు జర్నలిస్టుల ముందు కూర్చొని మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయినా నాకు ఆఫర్లు వస్తున్నాయి.

మన కంట్రోల్‌లో ఉండదు

మన కంట్రోల్‌లో ఉండదు

రమ్యకృష్ణతో పనిచేయడం, ఆమె ఇచ్చిన సలహాలు నాలో మనోధైర్యాన్ని నింపాయి. నా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనే విషయాన్ని చెప్పినప్పుడు.. మన చేతిలో కొన్ని విషయాలు కంట్రోల్ ఉండవు. మనం చేసే పనిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఏదో రోజు అన్ని కలిసి వస్తాయి అని నాకు చాలా విషయాలు చెప్పారు.

ఆక్సిజన్ లేటు కావడం

ఆక్సిజన్ లేటు కావడం

ఆక్సిజన్ సినిమా లేటుగా విడుదల కావడం నాకు కలిసి వచ్చింది. ఆ సినిమా రిలీజ్‌కు ముందు మజ్ను సినిమా విడుదల కావడం వల్లే పవన్ కల్యాణ్ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లాను.

 అందుకే గీతా గోవిందం వదులుకొన్నా

అందుకే గీతా గోవిందం వదులుకొన్నా

గీతా గోవిందం చిత్రంలో హీరోయిన్‌గా నటించాల్సింది. కానీ ఆ సమయంలో నా పేరు సూర్య ఒప్పుకొన్నాను. అదే సమయంలో శైలజారెడ్డి అల్లుడు ఒప్పుకొన్నాను. గీతా గోవిందం కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అప్పటికి ఇంకా అర్జున్‌రెడ్డి రిలీజ్ కాలేదు. అందుకు నేను బాధపడుతుంటాను. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో చేయలేకపోయాననే బాధ వెంటాడుతున్నది. ఇంకా ఆ సినిమా చూడలేదు అని అను ఇమ్మాన్యుయేల్ వెల్లడించింది.

English summary
Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan & Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu).
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more