twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    First Day First Show ఎందుకు దర్శకత్వం వహించలేదంటే.. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ (ఇంటర్వ్యూ)

    |

    ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ First Day First Show. జాతి రత్నాలు చిత్రంతో బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు హీరో, హీరోయిన్లుగా నటించారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నది. నటుడు, నిర్మాత ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో అనుదీప్ మీడియాతో మాట్లాడుతూ..

    జాతిరత్నాలు మాదిరిగానే.. First Day First Show (FDFS) లో కూడా హిలేరియస్ హ్యుమర్ ఉంటుంది. ఈ సినిమాపై అందరి అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుంది. నటీనటులు కొత్తవాళ్లైనా అందరు అద్బుతంగా నటించారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ నటులు ఈ సినిమాకు ప్లస్ అయ్యారు అని జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ అన్నారు.

     Anudeep KV interview: First Day First Show entertains like Jathiratnalu

    First Day First Show పబ్లిక్‌కు తెలిసిన నటీనటులు ఉంటే.. ఒక సమస్య తలెత్తే అవకాశం ఉంది. తెలిసిన నటుడు ఉన్నాడంటే.. సినిమా టికెట్ దొరకదని చూపిస్తే సహజంగా ఉండదు. అదే కొత్త నటుడైతే సమంజసంగా ఆర్గానిక్‌గా ఉంటుంది అని అనుదీప్ తెలిపారు.

    First Day First Show సినిమాకు నేనే దర్శకత్వం వహించాలని అనుకొన్నాను. శివకార్తికేయన్ సినిమాతో బిజీగా ఉండటం వలన ఈ సినిమాకి దర్శకత్వం చేయలేదు. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు ఉంటే బాగుంటుదని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్‌లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, సంగీతం ఇలా చాలా అంశాలలో నా ప్రమేయం ఉంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా భాద్యత ఉంటుంది అని అనుదీప్ తెలిపారు.

    సినిమా టికెట్ గురించి ప్రయత్నించడం చిన్న లైన్. కానీ రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్‌తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. చాలాకాలం పాటు చర్చలు జరిగిన తర్వాత ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటి నుంచో ఉన్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను అని అనుదీప్ చెప్పారు.

    ఖుషీ సినిమా First Day First Show టికెట్లు దొరకలేదు. నారాయణ్ ఖేడ్‌లో మాట్నీ షో చూశా. నేను పుట్టి పెరిగిన ప్రాంతాలు, చూసిన ప్రదేశాలు గురించి సులభంగా రాయగలుగుతానని భావిస్తాను. హైదరాబాద్ లోని మణికంఠ థియేటర్‌లో చిత్రీకరించాం అని అనుదీప్ చెప్పారు.

    English summary
    First Day First Show releasing on September 2nd. Jathiratnalu fame Anudeep KV is given story, Screenplay. Here is the Anudeep views about FDFS
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X