‘షూటింగ్ అని 2 గంటలు ముందే పిలుస్తారు.. వాళ్ల ప్రవర్తనకు చాలా అప్సెట్ అయ్యాను’
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం పరదా. తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న ఈ బ్యూటీఫుల్ డ్రామాను సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వం వహించారు. ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తోంది. దీంతో బ్యాట్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తన ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ప్రొడక్షన్ కంపెనీలో ఆమెకు కలిగిన అనుభవాన్ని పంచుకుంది. వాళ్లపై ఫైర్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..
పరదా సినిమా వివరాలు..
అనుపమా పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ పరదా. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్పలత, ఖేదర్ శంకర్, ఝాన్సీ, శత్రు, మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర, బాషా, అనశ్వి రెడ్డి, శివ కుమార్, మిర్చి మాధవి, శ్రీ లలిత, కీర్తి నాయుడు, జోష్ రవి, శివన్య మెహ్రా సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. మృధుల్ సుజిత్ సినిమాటోగ్రఫీ అందించగా, ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. గోపీ సుందర్ సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మాత విజయ్ డొంకల నిర్మించడం విశేషం.

అనుపమా వైరల్ కామెంట్స్..
తాజా ఇంటర్వ్యూలో అనుపమా పరమేశ్వరన్ చిత్ర పరిశ్రమలోని కొన్ని అంశాలపై మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో చాలా సందర్భాల్లో ఫీమేల్ యాక్టర్స్ కు ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే అవకాశం ఉండదు. అభిప్రాయాలను వ్యక్తం చేయడం చాలా కష్టం. వాళ్లకి నచ్చినది ఏదైనా చెబితే వెంటనే అటిట్యూట్ అని అంటారు. షార్ట్ ఎందుకు టైమ్ కి పెట్టలేదు అని అడిగితే అమ్మాయికి అటిట్యూట్ బాగా ఉందని అంటారు. 7 గంటలకే రెడీ ఉన్నా కూడా 9:30 వరకు ఫస్ట్ షార్ట్ తీయకపోతే ఎందుకు 2 గంటలు ముందే పిలుస్తారు.
షార్ట్ ఉంటే ముందే పిలవండి. లేకుంటే ఎందుకు పిలవడం. కో యాక్టర్ లేట్ గా వస్తారు. సాధారణంగా ఆయన రోజూ ఆలస్యంగానే వస్తారు. అది క్వశ్చన్ చేస్తే నాకు అటిట్యూట్ ఉందని అంటారు. ఆ రెండు గంటలలో ఎంతో ఫుటేజీ తీసుకోవచ్చు. అదే విషయాన్ని అడిగితే నా డబ్బులు కదా నువ్వెందుకు అడుగుతున్నావ్ అని ప్రశ్నిస్తారు. కానీ నేను అడిగేవన్నీ సినిమా కోసమే కదా. ఇవన్నీ వాళ్లకు అర్థం కాదు. మహిళగా అడిగే చులకన అయిపోతాం. మొహం మీదనే మాటలు అనేస్తారు. ఇక మగవాళ్లు అవే ప్రశ్నలు అడిగితే ఏమనరు. ఇలాంటి వాతావరణం చిత్ర పరిశ్రమలో ఉంది.' అని చెప్పుకొచ్చింది.
ఇక విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనుపమా ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. 'పరదా చిత్రంలో నటించిన పాత్ర చాలా బాగుంది. ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. ఇలాంటి పాత్రలో నటించడం అంత సులువేమీ కాదు. అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.' అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఉన్నట్టుండి సడెన్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుంది. ఇక సినిమా ప్రారంభం నుంచి అనుపమా ఎంతో కష్టపడ్డారని, ప్రమోషన్స్ లోనూ తానే ముందుండి నడిపిస్తున్నారని టీమ్ చెప్పింది. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రామ్ పోతినేని లాంచ్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











