For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుపమా పరమేశ్వరన్‌తో అలా జరిగిపోయింది.. ఇండస్ట్రీలో ఆమె నాకు చాలా క్లోజ్!

|

టాలీవుడ్‌లో గత కొద్దికాలంగా మలయాళ గాయకుడు యాజిన్ నిజార్ తన పాటలతో ఇరుగదీస్తున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఆయన పాటకు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఆయన
'సన్నాఫ్ సత్యమూర్తి'లో 'శీతాకాలం సూర్యుడిలా...', 'లోఫర్'లో 'జియా జలే జలే', 'కుమారి 21ఎఫ్'లో 'మేఘాలు లేకున్నా...', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో 'చిరునామా తన చిరునామా', 'వున్నది ఒకటే జిందగీ'లో 'లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో', 'భరత్ అనే నేను'లో 'ఓ వసుమతి ఓ వసుమతి', '118'లో 'చందమామే', 'బాహుబలి'లో 'బలి బలి రా బలి' లాంటి హిట్ పాటలను పాడారు.

మలయాళ, తమిళ సినిమాల్లో పలు పాటలు పాడిన యాజిన్ నిజార్ తాజాగా 'చెలియా ఉంటానే' అని ఓ మ్యూజిక్ సింగిల్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్ యాజిన్ నిజార్‌తో మాట్లాడింది. ఆయన ఏమన్నారంటే...

అనుపమ పరమేశ్వరన్ తొలిసారి

యాజిన్ నిజార్ పాడిన, నటించిన 'చెలియా ఉంటానే' మ్యూజిక్ వీడియోకు నీరో సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ తొలిసారి నటించిన మ్యూజిక్ వీడియో ఇదే. ఆదిత్య మ్యూజిక్ ఒరిజినల్స్ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ పాట విడుదలైంది. తెలుగు వెర్షన్ 'చెలియా ఉంటానే'కి మౌనిక సాహిత్యం అందించగా... తమిళ్ వెర్షన్ 'ఉయిరే ఉన్నోడు'కు నీరో సాహిత్యం అందించారు. ఇంగ్లీష్ లిరిక్స్ రాసినది, పాడినది అలెన్ బాబు డేనియల్ అని తెలిపారు.

ఆల్బమ్ ఐడియా అలా పుట్టింది

ఇంతకు ముందు నేను ఒక మ్యూజిక్ సింగల్ 'నీవే' చేశా. అందులో నేను నటించలేదు. కానీ, పాడింది నేనే. ప్రస్తుతం 'చెలియా ఉంటానే'... రెండు పాటలు తెలుగు, తమిళ భాషల్లో చేశాం. 'చెలియా ఉంటానే'కి వస్తే... ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు వచ్చిన ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ నీరో, నేను ఒక జామ్ సెషన్ లో కలిసినప్పుడు ఈ సాంగ్ ఐడియా స్టార్ట్ అయ్యింది. తర్వాత నీరో ఫ్రెండ్ అలెన్ బాబు డేనియల్ మాతో జాయిన్ అయ్యారు. అప్పుడు మ్యూజిక్ వీడియో చేద్దామనే ఐడియా లేదు.

అనుపమ పరమేశ్వరన్ లేకపోతే సాధ్యమయ్యేది కాదు

వాస్తవానికి.. అనుపమా పరమేశ్వరన్ కూడా చాలా సపోర్ట్ చేసింది. తనకు పాట నచ్చింది. మ్యూజిక్ వీడియోలో నటిస్తానని చెప్పింది. మేమంతా స‌ర్‌ప్రైజ్ అయ్యాం. చాలా సంతోషించాం. అప్పుడు మ్యూజిక్ వీడియో ఎందుకు చేయకూడదని ఒక ఐడియా వచ్చింది. తన బిజీ షెడ్యూల్ లోనూ అనుపమా పరమేశ్వరన్ మాకు డేట్స్ ఇచ్చి షూటింగ్ చేసింది. మా టీమ్ అందరి సపోర్ట్, ఆదిత్య మ్యూజిక్ సపోర్ట్ తో ఇది సాధ్యమైంది.

అనుపమ నాకు చాలా క్లోజ్‌ఫ్రెండ్

నాకు ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఉన్నవాళ్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. తను పాట విని చేస్తానని అనడంతో మేమంతా ఎగ్జాయిట్ అయ్యాం. ఇప్పటివరకూ అనుపమ సినిమాల్లో మాత్రమే నటించింది. మ్యూజిక్ వీడియో చేయదమిదే తొలిసారి. తనకు చాలా చాలా థాంక్స్. రెండు రోజుల్లో ఈ పాట షూటింగ్ పూర్తి చేశాం. చిక్ మంగళూర్, తెలంగాణలో కొన్ని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ఇదొక సింపుల్ లవ్ సాంగ్. ఇద్దరు ఒక ప్రయాణంలో కలుస్తారు.

కెమెరా ముందు టెన్షన్ పడ్డా

నేను కెమెరా ముందుకొచ్చిన తొలి తెలుగు పాట ఇది. తొలిసారి తెలుగులో నటించా. ఇంతకు ముందు మలయాళ సినిమా 'యాంగ్రీ బేబీస్'లో నేను పాడిన పాటలో కనిపించాను. నాలో యాక్టింగ్ టాలెంట్ లేదు. నేను కొంచెం కెమెరా ముందు టెన్షన్ పడ్డాను. ఇదొక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్.

- ఆదిత్య మ్యూజిక్ లాంటి గొప్ప సంస్థ సినిమాలతో పాటు మ్యూజిక్ ఆర్టిస్ట్స్, వీడియోలను సపోర్ట్ చేయడం ఒక పాజిటివ్ సైన్. ఆదిత్య మ్యూజిక్ సపోర్ట్ తో మరింతమంది ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారని ఆశిస్తున్నా. తెలుగులో నేను పాడిన పాటల్లో ఎక్కువ హిట్ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ఈ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది.

మహర్షిలో నువ్వే సమస్తం పాట

తెలుగులో త్వరలో విడుదల కానున్న 'మహర్షి'లో 'నువ్వే సమస్తం' పాట పాడాను. మహేష్ బాబు గారికి నేను పాట పాడటం ఇది మూడోసారి. ఇంతకు ముందు 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాల్లో పాటలు పాడాను. మహేష్ సార్, దేవిశ్రీ ప్రసాద్ సార్ కాంబినేషన్లో మూడోసారి అవకాశం రావడం సంతోషంగా ఉంది. అలాగే, ఇటీవల విడుదలైన 'మజిలీ'లో 'నా గుండెల్లో', '118'లో 'చందమామే', 'అంతరిక్షం'లో 'సమయమే' పాటలు పాడాను. గాయకుడిగా నా ప్రయాణం బావుంది. త్వరలో 'మహర్షి' విడుదలవుతుంది కనుక ఎగ్జయిటెడ్ గా ఉన్నాను.

English summary
The Telugu-Malayalam singer has now come out with a music video titled 'Cheliya Untane', a private song unveiled on Wednesday.The song, rendered by Yazin and also featuring him as the male lead opposite Anupama Parameswaran, has music by Niro. This is Anupama's first music video. Aditya Music originals has today released it in Telugu and Tamil. The Telugu version has lyrics by Mounika. The Tamil version, titled 'Uriye Unnodu' has lyrics by Niro. The English lyrics heard in the song are by Allen Babu Daniel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more