క్రికెటర్ బూమ్రాతో డేటింగ్... అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ
ప్రేమమ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత అదే సినిమా రీమేక్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాల్లో నటించింది. తాజాగా రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జంటగా నటిస్తున్నది. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనుపమ ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది.

తమిళ వెర్షన్ రాక్షసుడులో
రాక్షసుడు సినిమా రీమేక్ చేస్తున్నామని దర్శకుడు రమేశ్ వర్మ నాతో సంప్రదింపులు జరిపారు. ఆ సమయంలో మా ఫాదర్ తమిళ వెర్షన్ సినిమా చూసి బాగుందని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నేను చూశాను. సినిమా నాకు బాగా నచ్చింది. విలన్, హీరో, హీరోయిన్ క్యారెక్టర్లు బాగా నచ్చాయి. అందుకే ఓ మంచి సినిమాలో నటించాలన్న ఉద్దేశంతో రాక్షసుడు చిత్రంలో నటించాను అని అనుపమ పరమేశ్వర్ అన్నారు.

మంచి స్క్రిప్టుల కొరకే
హలో గురు ప్రేమ కోసమే సినిమా తర్వాత గ్యాప్ కొంత గ్యాప్ వచ్చింది. నాకు సంతృప్తి అనిపించే స్క్రిప్టు, పాత్రలు నాకు రాలేదు. కొన్ని స్క్రిప్టులు విన్న తర్వాత నచ్చలేదు. అది కాకుండా నేను మలయాళ చిత్రంలో కూడా నటిస్తుండటంతో తెలుగులో వెంటనే సినిమా చేయలేకపోయాను. అలాగే తమిళంలో మరో సినిమా కూడా స్టార్ట్ కాబోతున్నది.

అమలాపాల్ నటించిన పాత్రలో
తమిళ వెర్షన్ రాక్షసుడు సినిమాలో అమలా పాల్ నటించారు. నాకు అమలా పాల్ అంటే చాలా ఇష్టం. ఆమె కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆ రోల్ కారణంగానే సినిమాలో ట్విస్టులు, టర్న్‌లు ఉంటాయి. అందుకే ఈ సినిమాలోని పాత్రను చేయాలనుకొన్నాను. అమలాపాల్ మంచి నటి.. నా వంతుగా ది బెస్ట్ ఇచ్చానని అనుకొంటున్నాను అని అనుపమ పేర్కొన్నారు.

నాకు రెండో రీమేక్ మూవీ
నా కెరీర్‌లో ఇది రెండో రీమేక్. మొదట ప్రేమమ్ రీమేక్‌లో నటించాను. ఆ సినిమాలో నా పాత్రను నేనే పోషించాను. రాక్షసుడు సినిమా వరకు వస్తే అమలాపాల్ పాత్రలో నేను కనిపించబోతున్నాను. ఈ సినిమాలో కథను, పాత్రల్లో ఎలాంటి మార్పులేవు. ఒరిజినల్ కంటెంట్‌ను డిస్ట్రబ్ చేయలేదు. ఆ ఫీల్‌ను ఎలా ఉంచాలో అలానే ఉంచాం అని అమలా పాల్ తెలిపారు.

జస్ప్రిత్ బూమ్రాతో అఫైర్ గురించి
జస్ప్రిత్ బూమ్రాతో డేటింగ్, అఫైర్ వార్తలపై అనుపమ పరమేశ్వరన్ స్పందించారు. జస్పీత్ బూమ్రాతో అఫైర్ గురించి ప్రస్తావించగా.. నో కామెంట్ అన్నారు. జస్ప్రిత్ బూమ్రా మీకు ఫ్రెండ్ అవుతారా? అంతకంటే ఎక్కువగానా అనే ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు. అలాగే మీకు పరిచయం ఉందా? అనే విషయంపై నో కామెంట్ అని స్పందించారు.


Click it and Unblock the Notifications











