twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క శెట్టి యోగా చిట్కాలు.. కరోనాను ఎదురించడానికి ఇలా చేయండి..

    |

    కరోనావైరస్ పరిస్థితుల కారణంగా థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులు వినోదానికి దూరమయ్యారనే ఫీలింగ్ కలుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని, వైవిధ్యాన్ని పంచడానికి ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి.

    ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న భారీ చిత్రం నిశ్శబ్దం. అనుష్కశెట్టి నటించిన నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు నటించారు. ఈ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి యోగా టీచరైన హీరోయిన్ అనుష్క శెట్టి వెల్లడిస్తూ..

    కరోనా సమయంలో యోగా ప్రాముఖ్యత ఇలా.

    కరోనా సమయంలో యోగా ప్రాముఖ్యత ఇలా.

    కరోనావైరస్‌ను యోగా ద్వారా అడ్డుకోవచ్చని నేను చెబితే అది తప్పు అవుతుంది. కాకపోతే యోగా ప్రాక్టీస్ అనేది కేవలం దేహానికి మాత్రమే కాకుండా మానసిక పుష్టికి పనిచేస్తుంది. అవయవాలు, శరీర అంతర భాగం, నాడీ వ్యవస్థ ఇలా అనేక రకాలుగా శరీరాన్ని పరిపుష్టిగా మారుస్తుంది. కేవలం, శారీరక, మానసికంగానే కాకుండా భావోద్వేగాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అని అనుష్క చెప్పారు.

    శ్వాస సంబంధిత సమస్యలను

    శ్వాస సంబంధిత సమస్యలను

    ఇక కోవిడ్ 19 పరిస్థితుల్లో యోగా సాధన అనేది కీలకంగా మారింది. ఎందుకంటే కోవిడ్ పేషంట్లకు ముఖ్యంగా శ్వాస సంబంధింత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ద్వారా శ్వాస సంబంధమైన ఎక్స్‌ర్‌సైజులు చేస్తే ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ రోజుల్లోనే కాకుండా ప్రతీ రోజు ఒక గంట యోగా చేయాల్సిన అవసరం ఉంది అని అనుష్క శెట్టి పేర్కొన్నారు.

    కోవిడ్ పరిస్థితుల్లోనే కాకుండా నిరంతరం

    కోవిడ్ పరిస్థితుల్లోనే కాకుండా నిరంతరం

    కేవలం కరోనా పరిస్థితుల్లోనే యోగా చేస్తే సరిపోతుందనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ రోజు కోవిడ్ చూశాం. భవిష్యత్‌లో మరో ప్రమాదం ఎదురుకావొచ్చు. కాబట్టి యోగా అనేది ఎప్పుడు చేయాల్సిందే. శారీరకంగా, మానసికంగా ఫర్‌ఫెక్ట్‌గా ఉండి.. ఎలాంటి విపత్తునైనా ఎదురించేందుకు దేహాన్ని సిద్ధంగా చేసుకోవాలి. యోగాతో శ్వాస ప్రక్రియ మెరుగుపెడుతుంది. ఊపిరితిత్తులు బలంగా మారుతాయి అని అనుష్క చెప్పారు.

    యోగాతో శారీరక, మానసిక రుగ్మతలకు చెక్

    యోగాతో శారీరక, మానసిక రుగ్మతలకు చెక్

    ఎలాంటి సందర్భాల్లోనైనా మనిషి భావోద్వేగాలను కంట్రోల్ చేసే శక్తి యోగాకు ఉంది. కాబట్టి యోగాను నిరంతరం సాధన చేయాలి. యోగాతో మానసిక, శారీరక పరిపుష్టి జరుగుతుంది. నేను చాలాసార్లు, చాలా ఇంటర్వ్యూలో యోగా పవర్ ఏంటో చెప్పాను. ఇప్పడున్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు యోగాపై అవగాహన పెంచుకోవడం కనిపించింది. ఇది చక్కటి ఆరోగ్యం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని అన్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Bigg Boss హోస్ట్ గా టాప్ హీరోయిన్.. గ్రాండ్ ఎంట్రీ ఆ రోజే!
    నిశ్శబ్దం పవర్‌ఫుల్‌గా

    నిశ్శబ్దం పవర్‌ఫుల్‌గా

    ఇక నిశ్శబ్దం సినిమా గురించి అనుష్క మాట్లాడుతూ.. సెలైన్స్ అనేది ఓ పవర్‌ఫుల్ ఆయుధం. అదెలా ఉంటుందో తెరమీద మీకు కనిపిస్తుంది. ఇక సక్సెస్ అనేది మనం నిర్ధారించే అంశం కాదు. కథ విన్నప్పుడు నాకు నచ్చింది. ప్రేక్షకుల అందరికి నచ్చేలా యూనిట్, నిర్మాతలు కష్టపడి సినిమాను తీసింది. దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు మంచి చిత్రాన్ని అందిస్తున్నామనే ఫీలింగ్ మా యూనిట్‌లో అందరికి ఉంది అని అనుష్క శెట్టి చెప్పారు.

    English summary
    Anushka Shetty's Nishabdham set to release in Amazon Prime Video on October 2. Amazon prime confirmed that Your silence will protect you. #NishabdhamOnPrime, premieres October 2 in Telugu and Tamil, with dub in Malayalam!. Part of the film promotions, Anushka Shetty speaks to Telugu fimibeat .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X