Roja: శ్రీలీలతో బాలకృష్ణ అలా... వయసుకు తగ్గ పనులు చేయాలంటూ రోజా ఫైర్

భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య... ఈరోజు థియేటర్లకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాతో ఆయన మరో హిట్ కొట్టేశారు అని అంటున్నారు. భగవంత్ కేసరి సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్ కొట్టారని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి రోజా.. బాలయ్యపై ఫైర్ అయింది. సెటైరికల్ కామెంట్స్ చేసింది. వయసుకు తగ్గ పనులు చేయాలంటూ ఫైర్ అయింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలయ్య ఇటు సినిమాల్లో.. అటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆయన నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన మార్క్ తో బాలయ్యకు తగ్గట్లుగా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా చేయగా... టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. బాలయ్య కూతురి పాత్రలో నటించింది. ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మొదటి సారిగా తెలుగు సినిమాలో విలన్ గా నటించారు.

Ap Minister Roja satirical Comments on Balayya Bhavanth Kesari Movie

భగవంత్ కేసరి సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఇక విడుదల అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య మరోసారి హిట్ కొట్టాడు అని... హ్యాట్రిక్ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఇందులో బాలయ్య, శ్రీలీల ఫెర్మామెన్స్ వేరే లెవెల్ అంటున్నారు. ఇక తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ అని అంటున్నారు. ఇక థియేటర్లలో ఆ బిజీఎం వింటుంటే.. గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Ap Minister Roja satirical Comments on Balayya Bhavanth Kesari Movie

ఇక ఇదిలా ఉండగా... రాజకీయాల్లోనూ బాలయ్య ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య.. ప్రజలకు సేవలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంత్రి రోజా... మరోసారి బాలయ్యపై ఫైర్ అయింది. సెటైరికల్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చెబుతూ.. బాలయ్య గురించి కూడా కామెంట్స్ చేశారు.

రోజా మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తుంటే.. బాలకృష్ణ సినిమా షూటింగులు చేసుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. 'భగవంత్ కేసరి ప్రీరిలీజ్ ఫంక్షన్లో శ్రీలీలతో బాలకృష్ణ వయసుకు తగ్గట్లుగా వ్యవహరించలేదు. ఎన్టీఆర్ కుమారుడిగా ఉంటూ.. మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోతే ఎలా? నేను గతంలో జబర్దస్త్ షూటింగులో పాల్గొన్నా.. ఏరోజూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు' అని ఆమె చెప్పుకువచ్చారు.

Ap Minister Roja satirical Comments on Balayya Bhavanth Kesari Movie

ఇక రోజా మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక రోజా వర్సెస్ బాలకృష్ణ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. వీరు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. కానీ రాజకీయా పరంగా బాలయ్య టీడీపీలో ఉండగా... రోజా.. వైఎస్సార్ పార్టీలో మంత్రిగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X