పవన్ కల్యాణ్ సక్సెస్ చూస్తే గర్వంగా ఉంది.. శివం భజే ఇంటర్వ్యూలో అర్బాజ్ ఖాన్
గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం శివం భజే. ఈ మూవీలో బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నటుడు అర్బాజ్ ఖాన్ తెలుగు ఫిల్మీబీట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దబంగ్, గబ్బర్ సింగ్ సినిమా గురించి మాట్లాడుతూ..
దంబంగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న తర్వాత ఆ మూవీ రీమేక్ రైట్స్ తీసుకొని పవన్ కల్యాణ్ హీరోగో చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. సాధారణంగా తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో దబంగ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనే ప్రైడ్ ఫీలింగ్ కలిగింది అని అర్బాజ్ ఖాన్ అన్నారు.

దబంగ్ సినిమాలో చుల్‌బిల్ పాండే పాత్రను సల్మాన్ ఖాన్ అద్బుతంగా చేశారు. అదే పాత్రను పవన్ కల్యాణ్ మరో విధంగా తనదైన శైలిలో నటించి నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. అయితే ఒక నటుడి పెర్ఫార్మెన్స్ అంచనా వేయడం..దాని ద్వారా సినిమా రీమేక్ చేయడమనేది కుదరని పని అన్నారు.


Click it and Unblock the Notifications











