Video Interview: సల్మాన్, బిగ్‌బాస్ విన్నర్ హత్యకు కుట్ర.. అర్బాజ్ ఖాన్ ఏం చెప్పాడంటే? (వీడియో)
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య ముంబై వాసులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. మహానగరం నడిబొడ్డున ముగ్గురు యువకులు ఆటోలో వచ్చి నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపిన దుర్ఘటనలో బాబా సిద్దిఖీ అక్కడికిక్కడే నేల ఒరిగాడు. కాల్పుల్లో గాయపడి తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను లీలావతి హాస్పిటల్‌కు తరలించే క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆ క్రమంలో సల్మాన్ ఖాన్ భద్రత మరోసారి చర్చ జరుగుతున్నది. కేవలం సల్మాన్ మాత్రమే కాకుండా బిగ్‌బాస్ విన్నర్, కమెడియన్ మునావర్ ఫారుఖీ కూడా టార్గెట్‌గా ఉన్నారనే విషయం మరింత ఆందోళనకరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లో ఓ షూటింగ్ సందర్భంగా తాము పూజించే కృష్ణ జింకలను వేటాడారనే కోపంతో సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం పెంచుకొన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌స్టర్‌గా మారారు. సోషల్ మీడియా ద్వారా పలు నగరాల్లో మాఫియా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. కొద్ది నెలల క్రితం సల్మాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కాల్పులు జరిపారు. దాంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా, బాబా సిద్దిఖీ హత్య తర్వాత మరోసారి సల్మాన్ ఖాన్ భద్రతపై చర్చ జరుగుతున్నది. స్నేహితులు ఆయనను ఎవరూ కూడా కలువ వద్దని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ హత్య తర్వాత మరింత భద్రతను పెంచారు. అయితే సల్మాన్ ఖాన్‌తోపాటు కమెడియన్ మునావర్ ఫారుఖీని చంపేందుకు కుట్ర పన్నారనే విషయం భయాందోళనలకు గురి చేసింది.
ఇటీవల బిగ్‌బాస్ 17 విజేతగా నిలిచిన మునావర్ ఫారూఖీపై కూడా రెక్కీ నిర్వహించారు. ఇటీవల స్గాండప్ షోలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను కూడా చంపివేయాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఈ మేరకు బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను ఢిల్లీలో వేటాడుతుండగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ముంబైకి షిఫ్ట్ అయ్యారు అని తెలిసింది.
అయితే సల్మాన్ ఖాన్ భద్రత, దాడి ఘటన గురించి ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ ఫిల్మీ బీట్ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై మాఫియా దాడి చేసినప్పుడు మా ఫ్యామిలీ చాలా భయపడి పోయింది. చాలా ఆందోళనకు గురయ్యాం. ఆయన భద్రతకు కావాల్సిన చర్యలను, ఏర్పాట్ల గురించి ఎక్కువగా ఆలోచించాం. మా వైపు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని అనుకొన్నాం అని తెలిపాడు.

అయితే సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసి దాడి చేశారనే విషయం తెలిసిన తర్వాత పూర్తిగా కలత చెందాం. మాతో సల్మాన్ మాట్లాడుతూ.. ఎందుకిలా జరుగుతున్నది. మనపై ఎందుకు ఇంత ప్రతీకారమని ఆవేదన చెందారు. అంతకంటే ఇంకా ఏం జరుగుతుంది. భద్రత గురించే మేము, నా సోదరుడు సల్మాన్ కొంత ఆందోళన చెందాం అని అర్బాజ్ ఖాన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











