Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ దర్శకుడితో నా లైఫ్ మారిపోయింది.. నాకు నాగవంశీ అలాంటి కండిషన్.. అర్జున్ దాస్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా బుట్ట బొమ్మ. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో అర్జున్ దాస్ మీడియా మాట్లాడుతూ..
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమా తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమా వల్ల వచ్చిన గుర్తింపు వల్లే నాకు సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నటించే ఆఫర్ వచ్చింది. అందుకు ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమా ఆఫర్ చేసినప్పుడు.. మలయాళ మాతృక కప్పేలా సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. మళ్లీ రీమేక్ చేయడం ఎందుకని నిర్మాత నాగవంశీని అడిగాను. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. తెలుగు నేటివిటికి తగినట్టుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. బుట్టబొమ్మ కచ్చితంగా అందర్నీ ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ఆర్కే. అంతకంటే నేను ఏమీ చెప్పలేను. సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది అని అర్జున్ దాస్ చెప్పారు.

మాస్టర్ సినిమా తర్వాత నాకు దక్షిణాదిలో మంచి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్‌లో ఓ మాల్‌కు వెళితే నన్ను గుర్తుపట్టి నాతో సెల్ఫీలు దిగారు. వైజాగ్‌లో కూడా నన్ను గుర్తుపట్టి ప్రేమగా మాట్లాడటం మరిచిపోలేని అనుభూతి. నా పేరు తెలియకపోయినా నన్ను గుర్తుపట్టి పలకరించడం, ఘనంగా స్వాగతించడం గొప్ప అనుభూతి అని అన్నారు.
నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను. కానీ ఇంత త్వరగా తెలుగులో అవకాశం వస్తుందని అనుకోలేదు. డబ్బింగ్ సినిమాల్లో నన్ను చూసి అభిమానించడం చాలా సంతోషంగా ఉంది.

విలన్ పాత్రలు మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కొత్తదనం ఉంటే విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధం. నా గొంతు విభిన్నమైనది. నా వాయిస్‌ను చాలా మంది ఇష్టపడుతారు. బుట్టబొమ్మ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమా చేసే ముందు నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు అని అన్నారు.