‘ఇష్టంగా’ లెక్కలేనన్ని లిప్‌లాక్స్.. చూడటం ఎంజాయే.. ఆ సీన్లలో నటించడం కష్టం!

Recommended Video

Ishtanga Movie Hero Interview | Ishtanga | Priyadarshi | Arjun mahi

ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వీ రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం ఇష్టంగా. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. మ‌ధుమ‌తి, మ‌ధ‌నంద‌న్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది‌. ఈసంద‌ర్భంగా హీరో అర్జున్ మ‌హి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ....

 రొమాంటిక్ లవ్ స్టోరీగా

రొమాంటిక్ లవ్ స్టోరీగా

ఇష్టంగా చిత్రం నా కెరీర్‌లో మూడోది. అంతకుముందు ఎంజాయ్, నువ్వు నేను ఓసేయ్ ఒరేయ్. నా మూడో చిత్రం ఇష్టంగా డిసెంబర్ 28న రిలీజ్ కాబోతున్నది. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందిన చిత్రంలో నా సరసన తనిష్క్ రాజన్ నటించింది. ప్రియదర్శి ప్రత్యేకమైన పాత్రలో నటించారు. దువ్వాసి మోహన్, గిరి తదితర పాత్రల్లో నటించారు. చాలా కష్టపడి సినిమాను తీసినప్పటికీ ఇప్పుడు చాలా ఇష్టం పెంచుకొన్నాం.

లివింగ్ రిలేషన్‌ కథా నేపథ్యంగా

లివింగ్ రిలేషన్‌ కథా నేపథ్యంగా

ఇష్టంగా ట్రైలర్ చూసి అర్జున్ రెడ్డి, RX 100 సినిమాలతో పోల్చుతున్నారు. అలాంటి సెన్సేషనల్ సినిమాలతో పోల్చడం ఆనందంగా ఉంది. కానీ ఆ సినిమాల కథ వేరు. మా చిత్ర కథ వేరు. మా సినిమా కథ లివింగ్ రిలేషన్‌పై ఉంటుంది. లివింగ్ రిలేషన్ అంటే లవ్, లస్ట్, సెక్స్, ఇంకా ఏదో అనుకొంటారు. కానీ లివింగ్ రిలేషన్‌లో ప్రేమ ఉంటుంది. సాదాసీదా అమ్మాయి ఓ వ్యక్తిపై ప్రేమను పెంచుకొంటే ఆమె ఎంత దూరం వెళ్లాల్సి వచ్చిందనేది కథ.

చాలా లిప్‌లాక్స్ ఉన్నాయి

చాలా లిప్‌లాక్స్ ఉన్నాయి

ఇష్టంగా సినిమాలో లిప్‌లాక్స్ చాలా ఉన్నాయి. ట్రైలర్‌లో అలాంటి సన్నివేశాలతో అంచనాలు పెరిగాయి. లిప్‌లాక్స్ పెడితే సినిమాలు హిట్ కావు. అర్జున్ రెడ్డి, RX 100 హిట్టాయాయంటే అందులో కథ, విజయ్ దేవరకొండ లాంటి హీరోనే కారణం. మా ప్రేమ కథలో చాలా భావోద్వేగం ఉంటుంది. చివరి 30 నిమిషాల్లో కథ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుతుంది.

లివింగ్ రిలేషన్ నేరమా?

లివింగ్ రిలేషన్ నేరమా?

లివింగ్ రిలేషన్ మంచిదా? చెడ్డదా అనే విషయాన్ని మేము చెప్పడం లేదు. ఇష్టంగా కథలో పెళ్లి, ప్రేమ అనే అంశాల గురించి చెబుతూనే, వెస్ట్రన్ కల్చర్ అంశాలను కథలో జొప్పించాం. ప్రేమ, పెళ్లిళ్లు, లివింగ్ రిలేషన్ బ్రేక్ అవుతున్నాయి. కానీ లివింగ్ రిలేషన్‌నే ఓ నేరంగా చూస్తున్నారు.

లిప్‌లాక్‌ కోసం కష్టపడ్డాను

లిప్‌లాక్‌ కోసం కష్టపడ్డాను

లిప్ లాక్ చేయడానికి చాలా కష్టపడ్డాను. చూడటంలో చాలా ఎంజాయ్ ఉంటుంది. కానీ తెర మీద బాగా చూపించాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఈ సినిమాలో లెక్క పెట్టలేనన్ని ముద్దులు ఉన్నాయి. ఒక్క ముద్దులో అసభ్యం, అశ్లీలం ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. అమ్మాయిలు కూడా చూడాలని కోరుకొంటున్నాను.

చిరంజీవి, నాగార్జున నాకు స్ఫూర్తి

చిరంజీవి, నాగార్జున నాకు స్ఫూర్తి

నేను సినీ హీరో కావాలని చిన్నతనం నుంచే కోరుకొన్నాను. నాకు చిరంజీవి, నాగార్జున, నేటితరం హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. నటుడు కావాలన్న నా కోరికకు వారే స్ఫూర్తి. ఇంజ‌నీరింగ్ చ‌దివిన త‌ర్వాత సినిమాల‌పై చిన్న‌ప్ప‌టి నుండి ఉన్న ఆస‌క్తితో హీరో అయ్యాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X