త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే అలా జరిగింది... ఆయన వల్లే ఈ పరిస్థితి.. అరుణ్ పవార్

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో దర్శకుడిగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అరుణ్ పవార్. బేసిక్‌గా అరుణ్ పవార్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు. త్రివిక్రమ్ రూపొందించిన సినిమాలతోపాటు పలు చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేశారు. తాజాగా డైరెక్టర్‌గా ఆయన రూపొందించిన చిత్రం వజ్రకవచధార గోవింద. విభిన్నమైన టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో సప్తగిరి హీరోగా నటించారు. వైభవి జోషి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని నిర్మాత ఈ నరేంద్ర, జీవీఎన్ రెడ్డి నిర్మించారు. బుల్గానియన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు అరుణ్ పవార్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా మారడానికి గల కారణాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జర్నీ

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జర్నీ

స్టార్ కమెడియన్ హీరో సప్తగిరితో నాకు రెండో సినిమా. దర్శకుడిగా మారకముందు నేను విజ్వువల్ ఎఫెక్ట్స్ చేసే వాడిని అతడు సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జర్నీ ప్రారంభమైంది. అత్తారింటికి దారేది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అ ఆ సినిమా వరకు త్రివిక్రమ్‌తో పనిచేశాను. ఆయనతో పనిచేసేటప్పుడు నేను దర్శకత్వ శాఖలో మెలకవలు నేర్చుకొన్నాను. నేను ఓ షార్ట్ ఫిలిం తీస్తే త్రివిక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఆయన ప్రోత్సహించడంతో నేను దర్శకుడిగా మారాను.

 త్రివిక్రమ్ శ్రీనివాస్ టిప్స్‌తోనే

త్రివిక్రమ్ శ్రీనివాస్ టిప్స్‌తోనే

నేను ఎవరి వద్దా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. త్రివిక్రమ్ పనితీరును చూసి నేను దర్శకత్వ విభాగంపై పట్టు సాధించాను. దర్శకుడిగా నా తొలి చిత్రం బెస్ట్ యాక్టర్. నాకు అనుభవం లేని సమయంలో నేను తీసిన సినిమా అది. ఆ సినిమాను నేను పెద్దగా పట్టించుకోను. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమానే నా తొలి సినిమాగా భావిస్తా. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ బాగా పడింది. ఆ తర్వాత మళ్లీ సప్తగిరితోనే సినిమా చేయాలనుకొన్నాను. కానీ కుదర్లేదు. మరో ఎమోషనల్ సబ్జెక్ట్ వజ్రకవచధార గోవింద‌తో సప్తగిరితో జతకట్టాను.

తెలుగు సినిమాలకు స్కోప్ ఉండదు

తెలుగు సినిమాలకు స్కోప్ ఉండదు

తెలుగు సినిమాల్లో విజువల్ కంటెంట్‌కు పెద్దగా స్కోప్ ఉండదు. బాహుబలి లాంటి సినిమాల ద్వారానే దానిని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకులు అవతార్ అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ చూశారు. అలాంటి చిత్రాలను మించి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే తప్ప మన సినిమాలకు గుర్తింపు ఉండదు. బాహుబలి మాత్రమే దానిని అధిగమించింది.

డైరెక్షన్ ఓ ఛాలెంజ్ లాంటింది

డైరెక్షన్ ఓ ఛాలెంజ్ లాంటింది

డైరెక్షన్ చేస్తూనే పలు చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్‌పై వర్క్ చేస్తుంటాను. దాదాపు 10 ఏళ్లకు పైగా నాకు జీవనోపాధిని కల్పించింది. దర్శకుడిగా మారడానికి ఓ బాట వేసింది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ పనిని వదిలిపెట్టను. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఓ డైరెక్టర్ విజన్. డైరెక్షన్ అంటే ఓ వ్యక్తి విజన్‌ను పూర్తిగా తెరపైన ఆవిష్క‌‌తం కావడం. విజువల్ ఎఫెక్ట్స్ కంటే డైరెక్షన్ అత్యంత ఛాలెంజ్ అని భావిస్తాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X