అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయం కాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా ఇలా పలు రకాల బాధ్యతలను ఒక్కరే భుజాన వేసుకుని సినిమాలు తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ ఓ యంగ్ కుర్రాడు మాత్రం తానే రైటర్,డైరెక్టర్‌గా మారి హీరోగా చెప్పినా ఎవరూ నమ్మరు అనే చిత్రాన్ని తీశాడు. తాజాగా ఆయన ఫిల్మీ బీట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విశేషాలెన్నో పంచుకున్నాడు.
'చెప్పినా ఎవరూ నమ్మరు' సినిమాకు హీరోగా, దర్శకుడిగా, రచయితగా పని చేసిన ఆర్యన్ కృష్ణా మాట్లాడుతూ.. ఇదే మొదటి చిత్రం కాబట్టి రిస్క్ చేయాలని అనుకోలేదు. సేఫ్ గేమ్ ఆడుదామనే ఈ కథను ఎంచుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కలిసి అలా బయటకు వెళ్లినప్పుడు నాకు వచ్చిన ఐడియానే సినిమాగా ఇప్పుడు మారింది. మా లైఫ్‌లో జరిగిన సంఘటనలు, చూసిన విషయాలను జనాలకు చెప్పాలని అనుకున్నాం. చివరకు ఇలా కుదిరింది అని చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆర్యన్ కృష్ణా మాట్లాడుతూ.. సినిమాలో ఉండే ప్రతీ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది.. మొదటి సినిమా కాబట్టి టైటిల్ కాస్త క్యాచీగా, వెరైటీగా ఉండాలని అలా పెట్టాం. టైటిల్ ఇలా ఉంటే జనాల్లోకి ఈజీగా వెళ్తుందని అనుకున్నాం. అనుకున్నట్టే ఇప్పుడు అందరూ కూడా అదే విషయాన్ని అడుగుతున్నారు.. టైటిల్ ఏంటి ఇలా పెట్టారు అని అందరూ దాని గురించే అడుగుతున్నారు.. అందుకే అలా టైటిల్‌ను పెట్టామని తెలిపాడు. ఈ చిత్రం జనవరి 29న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











