Avengers స్థాయిలో Project K.. చైనా, అమెరికా, ఇంటర్నేషనల్ రేంజ్‌కు ప్రభాస్.. నాగ్ అశ్విన్ గురించి అశ్వినీదత్
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ మీడియా విలేకర్ల సమావేశంలో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతారామం' చిత్ర విశేషాలివి.

దుల్కర్ సల్మాన్‌ను తీసుకోవడంపై
తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ.. దుల్కర్ సల్మాన్ తీసుకోవడం సమిష్టి నిర్ణయం. మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసిన తర్వాత నాకు అతనంటే ఇష్టం కలిగింది. అలాగే మమ్ముట్టికి నేను వీరాభిమానిని. అందుకే ప్రతీ సంవత్సరం దుల్కర్ సల్మాన్‌తో చేద్దామని చెప్పాను. సీతారామం కథ అనుకొన్నప్పుడు ఏ హీరోకు చెప్పవద్దు. దుల్కర్‌కు చెప్పండి. అతడితోనే సినిమా చేద్దామని అన్నాను. దుల్కర్‌తో సినిమా చేస్తే సౌత్‌లో కూడా మార్కెట్ ఉంటుందని అనుకొన్నాం అని అశ్వినీదత్ తెలిపారు. ఇంకా ఈ సినిమా, ప్రాజెక్ట్ K సినిమా గురించి మాట్లాడుతూ..

ప్రభాస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు..
సీతారామం సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశాం. మరో మూడు పాటలు త్వరలో విడుదల చేస్తాం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ఆహ్వానించాం. అతడు విదేశాల్లో ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తాడా? లేదా అనే చెప్పలేం అని అశ్వినీదత్ పేర్కొన్నారు.

సీతారామం టైటిల్ విషయంలో
సీతారామం ప్రాజెక్టులో నాగ్ అశ్విన్ పాత్ర ఏమీలేదు. అప్పుడప్పుడు స్క్రిప్టు పరంగా సలహాలు ఇచ్చారు. అయితే టైటిల్ విషయంలో కొంత తర్జనభర్జన పడ్డాం. అప్పుడే రాధేశ్యామ్ సినిమా విడుదలైంది. ఆ టైటిల్ కాంట్రవర్సీ కావడంతో సీతారామం టైటిల్ పెడుదామంటే.. వద్దని అన్నారు. ఓ దశలో లెఫ్టినెంట్ రామ్ అని అనుకొన్నాం. కానీ ఆ టైటిల్ రాయడంలో ఇబ్బంది ఉంటుందని.. చివరకు ఏదైతే అది అనుకొని సీతారామం టైటిల్ ఫిక్స్ చేశాం. నాగ్ అశ్విన్ రావడం వల్ల మా ప్రాజెక్ట్‌కు పునర్ వైభవం తెచ్చాడు అని అశ్వినీదత్ అన్నారు.

అక్టోబర్ 18వ తేదీన ప్రాజెక్ట్ K
ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ జనవరిలో పూర్తి అవుతుంది. అప్పటి నుంచి ఏడు నెలలు పాటు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ పనులు జరుగుతాయి. అక్టోబర్ 18 తేదీ 2023లో ప్రాజెక్ట్ కే సినిమాను రిలీజ్ చేస్తాం. పలు దేశాల్లో గ్రాఫిక్ పనులు జరుగుతున్నాయి. నందినిరెడ్డి, నాగచైతన్యతో సినిమా చేస్తున్నాం. వరంగల్‌కు చెందిన లాయర్ రాసిన కథతో మరో సినిమా చేస్తున్నాం అని తెలిపారు.

ఇంటర్నేషనల్ స్థాయిలో Project K
Project K సినిమా అద్బుతంగా వస్తున్నది. చైనా, అమెరికా, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాం. అవెంజర్స్ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాం. ప్రభాస్ రేంజ్ వరల్డ్‌వైడ్ వెళ్లిపోతుంది. అతడి పెర్ఫార్మెన్స్ మరో రేంజ్‌లో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ మరో కోణంలో చూస్తాం అని అశ్వినీదత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











