twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నిర్మాతల వల్లే థియేటర్లకు ప్రేక్షకుల ముఖం చాటేశారు.. వాళ్లే షూటింగులు ఆపి సమ్మెనా?.. అశ్వినీదత్ సెటైర్స్

    |

    ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ..

    సీతారామం మంచి సినిమా

    సీతారామం మంచి సినిమా


    సీతారామం మంచి తీశాం. హీరో, హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న అద్బుతంగా నటించారు. ఎప్పటి నుంచో లవ్ స్టోరీ తీయాలని అనుకొంటున్నాను. స్వప్న, ప్రియాంక నా ఇలాంటి సినిమా అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. సాధారణంగా హను రాఘవపూడి అంటే భయం ఉంటుంది. ఆయన కథ చెప్పిన తర్వాత ఏడాదిపాటు ట్రావెల్ అయ్యాం. మధ్యలో కరోనావైరస్ పరిస్థితులు వచ్చాయి. ప్రపంచమంతా కరోనావైరస్ ఉండటంతో కొద్ది రోజులు షూటింగ్ ఆపేసి పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించాం అని అశ్వినీదత్ అన్నారు.

     థియేటర్లకు జనం రాకపోవడానికి కారణం

    థియేటర్లకు జనం రాకపోవడానికి కారణం


    ప్రస్తుతం సినిమా పరిశ్రమలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. థియేటర్లకు జనం రావడం లేదు. సీతారామం సినిమా ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ రప్పిస్తుంది. థియేటర్‌కు జనం రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. టికెట్ల రేట్లు పెంచడం వల్ల అంతేసి టికెట్ రేట్ పెట్టి సినిమా చూడటం అవసరమా? అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. టికెట్లు రేట్లు పెంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రాకుండా చేశారు. ఓటీటీ వల్లే థియేటర్‌కు ప్రేక్షకుడు రావడం లేదని నిందించడం సరికాదు. హీరోలకు రెమ్యునరేషన్లు నిర్మాతల స్థోమతను బట్టి ఇస్తున్నారు. ఇలా బడ్జెట్ పెరిగి నిర్మాత భారం కావడం వల్ల టికెట్ రేట్లు పెంచకతప్పని పరిస్థితి అని అశ్వినీదత్ తెలిపారు.

     టికెట్ రేట్లు పెంచడం వల్ల

    టికెట్ రేట్లు పెంచడం వల్ల


    టికెట్ ధరను ఎగ్జిబిటర్స్, డిస్టిబ్యూటర్స్ డిసైడ్ చేయాల్సింది. ప్రొడ్యూసర్ కాదు. స్టార్స్‌కు సినిమా టికెట్ ధరలతో పనిలేదు. ఇలాంటి సమస్యలు గతంలో వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాలేదు. ఫిలిం ఛాంబర్‌ను వీబీ రాజేంద్రప్రసాద్, జగపతి రాజేంద్ర ప్రసాద్, అట్లూరి పూర్ణచందర్ రావు లాంటి ప్రముఖులచే ఏర్పాటు చేయబడింది. ఫిలిం ఛాంబర్ ఇలాంటి సమస్యలను పరిష్కరించింది. అయితే ఆడియెన్స్‌లో సినిమాపై వ్యతిరేకత పెరిగింది. స్టార్లు కోట్లు సంపాదించడానికి 400, 500 టికెట్ రేట్ పెడుతారా? అనే అభిప్రాయం వారిలో కలిగింది. అందుకే సినిమాకు జనం రావడం లేదు.

    అందుకే ప్రేక్షకులు రావడం మానేశారు

    అందుకే ప్రేక్షకులు రావడం మానేశారు


    టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం తిరగబడటంతో దిల్ రాజు టికెట్ రేట్లు తగ్గించానని ఓసారి.. పెంచారని ఓసారి చెప్పడం మీడియాలో కంగాళీగా తయారైంది. దాంతో ఆడియెన్స్ థియేటర్‌కు రావడం మానేశారు. టికెట్ రేట్ల పెంపు వ్యవహారం వల్లే ఆడియెన్స్‌లో సినిమాపై అయిష్టం పెరిగింది. హీరోలకు రెమ్యునరేషన్ పెంచిన వాళ్లే సమ్మె చేయాలని ప్రయత్నిస్తున్నారు. హీరోకు 75 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని.. 50 ఇప్పుడు.. 25 తర్వాత అని చెప్పిన వాళ్లే హీరోల రెమ్యునరేషన్ పెరిగిందంటూ షూటింగులు ఆపేసి సమ్మెకు పిలుపునిస్తున్నారు అని అశ్వినీదత్ సెటైర్ వేశారు.

     రెమ్యునరేషన్లు పెంచి.. వాళ్లే సమ్మె చేస్తారా?

    రెమ్యునరేషన్లు పెంచి.. వాళ్లే సమ్మె చేస్తారా?


    ఆగస్టులో షూటింగులు ఆపేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ఆఫీస్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లే మాట్లాడుకోవడం లేదు. మీరెందుకు సమ్మె గురించి ఆలోచిస్తారెందుకు? మైత్రీ, దిల్ రాజు లాంటి సమ్మెకు పిలుపు నివ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. హీరోల రెమ్యునరేషన్ పెంచడం కోసం టికెట్ రేట్లు పెంచుతున్నారు అని అశ్వినీదత్ అన్నారు.

    English summary
    Ashwini Dutt's latest movie is Sita Ramam. This movie is releasing on August 5th. In this occasion, Star producer speaks to media about Ticket Rates in Telugu film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X