అందుకే ముద్దు సీన్లకు మాళవిక ఒకే చెప్పింది.. యూకేలో పాపకు అలాంటి కష్టాలు.. అవసరాల శ్రీనివాస్ (ఇంటర్వ్యూ)
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (పాప). టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. నటుడు, రచయిత, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు అంచనాలు పెంచాయి. మార్చి 17న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మీడియాతో మాట్లాడుతూ..

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అంటే
నా జీవితంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రాసుకొన్నాను. ఈ సినిమా చూస్తే మన కథ, మన చుట్టూ ఉన్న కథ అని ఫీల్ అవుతారు. సినిమా అత్యంత సహజంగా ఉంటుంది. అందుకే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అంటే అందరికి కనెక్ట్ అవుతుందని భావించాం.
వర్కింగ్ టైటిల్‌ను నిర్మాతలు నచ్చి వెంటనే కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలోని పాత్రలు వాస్తవ జీవితంలో వ్యక్తులను చూస్తే అలా ఉంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఈ సినిమాపై ఒక అవగాహన వస్తుంది అని శ్రీనివాస్ అవసరాల చెప్పారు.

యూనిట్‌కు వీసాలు ఆపేశారు
సినిమాల విషయంలో నాకు తొందరపాటు ఉండదు. స్టోరి రాయడానికి ఏడాదిన్నర సమయం తీసుకొంటా. ఈ సినిమా కథను 2019లో రాయడం మొదలుపెట్టాను. యూకే, యూఎస్‌లో షూట్ ప్లాన్ చేశాం. షూటింగ్‌కు వెళ్దామని అనుకొంటుండగా.. కోవిడ్ వచ్చింది.
దాంతో మా యూనిట్‌కు వీసాలు ఆపేశారు. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత 2022 సంవత్సరంలో యూకే వెళ్లడానికి 40 మందికి వీసా అప్లై చేస్తే 10 మందికే ఇచ్చారు. అలాంటి కష్టాల మధ్య సినిమా షూట్ కంప్లీట్ చేశాం అని శ్రీనివాస్ అవసరాల అన్నారు.

యూకేలో షూట్ చేసినప్పుడు
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కథ రాసుకొన్నప్పుడు గానీ, నేను సినిమా కథలు రాసినప్పుడు గానీ.. నటులను దృష్టిలో పెట్టుకొని రాయను. కథ పూర్తయిన తర్వాతనే నటీనటులను ఎంపిక చేసుకొంటాను. తెలుగు సినిమా పరిశ్రమలో నాకు ఇష్టమైన నటుల్లో నాగశౌర్య ఒకరు.
యూకేలో షూట్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాం. కానీ నాగశౌర్య ఇచ్చిన సపోర్టు.. ఆయన నటనతో అన్ని కష్టాలను మరిచిపోయేలా చేశాడు.ఈ సినిమాలో నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్ చూస్తే.. అతడు ఎంత బాగా నటించాడో తెలుస్తుంది అని శ్రీనివాస అవసరాల చెప్పారు.

మాళవిక ముద్దు సన్నివేశాల్లో
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కథను మాళవికకు చెప్పినప్పుడే సన్నివేశాలను పక్కాగా వివరించాను. కథ విన్నాక ముద్దు సీన్, ఇతర అంశాల గురించి ఎమోషనల్ అయ్యారు. ప్రతీ సన్నివేశాన్ని ఆమెకు క్లారిటీగా చెప్పాను. కథకు కనెక్ట్ కావడంతో ఆమె ఎలాంటి సీన్లకైనా అభ్యంతరం చెప్పలేదు. కథ డిమాండ్ చేస్తే ముద్దు గానీ.. ఇంకా ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటిస్తారు అని శ్రీనివాస అవసరాల అన్నారు.

కథలో ఏడు చాప్టర్లు అంటూ
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కథలో ఏడు చాప్టర్లు ఉంటాయి ప్రతీ చాప్టర్ 20 నిమిషాల నిడివి ఉంటుంది. పదేళ్ల టైమ్ పిరియడ్‌లో 18 నుంచి 28 ఏళల్ వరకు నాగశౌర్య, మాళవిక లైఫ్ జర్నీ సాగుతుంది. ఈ సినిమా విజయం పట్ల నాగశౌర్య చాలా నమ్మకంగా ఉన్నారు. పాత్రల బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది అని శ్రీనివాస్ అవసరాల అన్నారు.


Click it and Unblock the Notifications











