నా లైఫ్‌లో అతడు లేకపోతే.. బాయ్‌ఫ్రెండ్ గురించి ఎమోషనల్‌గా అవికా గోర్ ఓపెన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్న అవికా గోర్, యువ హీరో శ్రీరామ్ హీరో, హీరోయిన్లుగా SR మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 10th క్లాస్ డైరీస్. అజయ్ మైసూర్ సమర్పించగా, నటుడు, నిర్మాత అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ.. 10th క్లాస్ అంటే నా గుర్తొచ్చేది ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ... మరో వైపు షూటింగ్స్ చేశా. నేను స్కూల్‌కు వెళ్ళింది తక్కువ. లొకేషన్స్‌లో, సెట్స్‌లో ఉన్నది ఎక్కువ అని తెలిపారు. ఇంకా అవికా గోర్ ఏం చెప్పారంటే..

రీ యూనియన్‌లో ఎమోషన్స్
10th క్లాస్ డైరీస్ స్వీట్ మూవీ. మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే... రీ యూనియన్ అయితే... ఎలా ఉంటుందనేది చూపించారు. రీ యూనియన్ ఒక్కటే కాదు. సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది. ఇంకా ఈ చిత్రంలో కొద్దిగా డ్రామా,ఫ్లాష్‌బ్యాక్, కామెడీ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా వినోదాత్మకంగా దర్శకుడు అంజి తెరకెక్కించారు.
నేను ఎంపిక చేసుకునే కథలనుప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ కథను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో చాలా ఉత్సాహంగా ఉన్నాను అని అవికా గోర్ చెప్పారు.

నా పాత్ర చుట్టే కథ నడుస్తుంది..
10th క్లాస్ సినిమాలో నా పాత్ర పేరు చాందిని. నా పాత్ర రకరకాల వేరియేషన్స్‌తో సాగుతుంది. అంతకంటే నేను నా పాత్ర గురించి చెప్పను. సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది. నా క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుంది. అందులో చాలా సస్పెన్స్ ఉంది. ఆమె ఎక్కడ ఉంది? చాందిని ఏం చేస్తుంది? బతికుందా? లేదా? అని తెలుసుకోవాలనిక్లాస్‌మేట్స్ ప్రయత్నిస్తారు. చాలా సస్పెన్స్ అన్నమాట. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి అని అవికా గోర్ చెప్పారు.

నిర్మాతల గురించి అవికా గోర్
నిర్మాతలు అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ సినిమాపై ప్యాషన్ ఉన్న మంచి వ్యక్తులు. వారి నిర్మాణంలో కంఫర్ట్‌బుల్‌గా సినిమా చేశాను. చాలా లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. నేను చిక్ మంగుళూరులో చేశా. అయితే, సినిమాను శ్రీలంక, రాజమండ్రి, ఇంకా చాలా లొకేషన్స్‌లో చేశారు. ఖర్చు విషయంలో ఎక్కడారాజీ పడలేదు. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంత మందితో సినిమా తీయడం ఎంత కష్టమో నిర్మాతగా నాకు తెలుసు అని అవికా గోర్ తెలిపారు.

అంజి క్లారిటీ ఉన్న డైరెక్టర్
శ్రీరామ్‌తో నటించడం హ్యాపీగా ఉంది. మంచి నటుడు. మా మధ్య ఎక్కువ సన్నివేశాలు ఆయనతో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. ఆయనకెరీర్‌లో ఎదురైన అనుభవాలు చెప్పారు.నా తండ్రి పాత్రలో నాజర్ నటించారు. ఆయనతో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. సినిమాపై ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఎంతో నేర్చుకున్నాను. దర్శకుడుఅంజి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో బాగా తెలుసు. సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా బాగా తీశారు అని అవికా గోర్ అన్నారు.

నా బాయ్‌ఫ్రెండ్ లేకపోతే..
నా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. మిళింద్‌తో ప్రేమలో ఉన్నాను. ఆయన పరిచయం తర్వాత నాలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. నాలోని ప్రతిభ, సామర్థ్యం ఏంటనేది నాకు క్లియర్‌గా తెలిసింది. నేను ఏం చేయగలనో తెలిసింది. నేను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలని తెలుసుకునేలా చేశాడు. నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ నా జీవిత ప్రయాణానికి సంబంధించి ప్రతి అడుగులో మిళింద్ ఉన్నాడు. నా ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డాడు. అతడు లేకుండా నేను ఇదంతా చేయలేను అని అవికా గోర్ తెలిపారు.

నా పుట్టిన రోజుకు ముందు
నా కెరీర్ విషయానికి వస్తే.. జూలై 1న 10th క్లాస్ డైరీస్ విడుదలవుతున్నది. వీలైతే ఒక్క రోజు ముందు అంటే.. జూన్ 30న నాపుట్టిన రోజు. ఆ రోజున సినిమా చూడాలనుకుంటున్నా. వచ్చే నెలలో నేను నటించిన 'థాంక్యూ' విడుదల కానుంది. ఇంకా తెలుగులో సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలగురించి మీకు చెప్పాలనుంది. పుట్టినరోజున అప్‌డేట్స్ రావచ్చు. అంత వరకు మీరు ఆగాల్సిందే అని అవికా గోర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











