Don't Miss!
- News జగన్‌కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Baba Bhaskar సినిమా నాకు ప్రాణం.. నటనే కాదు.. డైరెక్షన్ కూడా చేస్తా..
కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ నటించగా దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటించిన స్టార్ కోరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ..
కోరియోగ్రాఫర్ , డ్యాన్సర్ , యాక్టర్...ఇలా ఏదైనా సరే నాకు సినిమానే జీవితం, సినిమానే నా డ్రీమ్. ఈ సినిమాలో హీరోకి స్నేహితుడుగా కీలక పాత్రలో నటించాను. అయన తో పని చేయడం చాలా సులువుగా ఉంది. తను అందరితో బాగా కలసి పోతాడు.చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె కు కథ విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ బ్యానర్ లో నటించడం చాలా హ్యాపీ గా ఉంది
ఈ సినిమాలో నటిస్తూనే లాయర్ పాప సాంగ్ కు కోరియోగ్రఫీ చేశాను.ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నాకు కోరియోగ్రఫీ, యాక్టింగ్ అనేవాటిని వేరుగా చూడకుండా .రెండు సేమ్ అని భావిస్తాను.అయితే నాకు ఎవరు ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను. చివరికి చిన్న క్యారెక్టర్ అయినా చెయ్యాలనే కోరిక ఉంది.
నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను. ఆ తరువాత కూడా డైరెక్షన్ చేయాలని చాలా కథలు సెలెక్ట్ చేసుకొంటున్నాను. టైమ్ సెట్ అయితే వెంటనే సినిమా చేస్తాను. కోరియోగ్రాఫర్ గా రాష్ట్ర జాతీయ పురస్కారాలు అందుకోవాలనేది నా కోరిక దానికోసం చాలా కష్టపడ్డాను ఇకపై కూడా కష్టపడతాను.
మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.ఈ సినిమా తర్వాత తెలుగులో నీలకంఠం గారు చేసే సినిమాలో మంచి క్యారెక్టర్ లో చేస్తున్నాను. తమిళ్ లో ఒక సినిమాకు కోరియోగ్రఫీ చేస్తున్నాను.ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.