Bandla Ganesh: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అతడే.. 7వ తేదీ సాయంత్రమే ఎల్బీ స్టేడియంకు వెళ్లిపోతా!
బండ్ల గణేష్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంటారు. ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఎప్పుడూ వార్తల్లో హైలెట్ అవుతుంటారు. అలాంటి ఆయన తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి, కాబోయే కొత్త సీఎం గురింటి మాట్లాడుతూ.. అందరికీ షాకిచ్చారు. అయితే ఆయన ఏం మాట్లాడారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. నేరుగా ఆయన ఇంటికి వెళ్లిన బండ్ల గణేష్.. కాంగ్రెస్ 90 సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. హస్తం పార్టీలో అద్బుతమైన గొప్ప గొప్ప నేతలు ఉన్నారంటూ బండ్ల గణేష్ వివరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి రథసారధిగా వ్యవహరించి గెలుపుకు కారణం అయిన రేవంత్ రెడ్డియే తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.

అలాగే కాబోయే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కోసం డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం నుంచే ఎల్బీ స్టేడియంలో పడుకుంటానని అన్నారు. అందుకోసం దుప్పటి కూడా రెడీ చేసుకున్నట్లు వివరించారు. అంతే కాకుండా ఈనెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో చప్పట్లు కొడుతూ ఉంటానని... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే ఆ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి అధికారం చేపట్టబోతున్నట్లు పునరుద్ధాటించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

బండ్ల గణేష్ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే నవంబర్ 30వ తేదీన ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి కాగా... ఆదివారం అంటే డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కంచి ఆ తర్వాత కౌంటంగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. చూడాలి మరి ఏం జరనగుంది అనేది. రేపటితో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో తెలిసిపోతుంది.



Click it and Unblock the Notifications











