సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి.. ఆయన వల్లే ఇండస్ట్రీకి వచ్చా.. బెక్కెం వేణుగోపాల్ (ఇంటర్వ్యూ)

లక్కీ మీడియా అధినేతగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించిన బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు. టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన గత 16 ఏళ్లలో అద్బుతమైన విజయాలను అందించారు. సినిమా పరిశ్రమకు కొత్త నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను అందించడంలో తన ప్రతిభను చాటుకొన్నారు. ఏప్రిల్ 27 తేదీ బెక్కెం జన్మదినం. ఈ సందర్భంగా నిర్మాతగా తన జీవిత అనుభవాలను వెల్లడిస్తూ మీడియాతో నెమరు వేసుకొన్నారు. ఈ సందర్భంగా బెక్కెం వేణు మాట్లాడుతూ...

కృష్ణ సినిమా షూటింగ్ చూడటానికి వచ్చి : నా స్వస్థలం మహబూబ్ నగర్‌లోని అచ్చంపేట. మా ఫ్యామిలీకి వ్యవసాయం ప్రధాన వృత్తి. మా ఇంట్లో ఎవరూ కూడా చదువుకోలేదు. నేను ఇంటర్మీడియెట్ వరకు చదువుకొన్నాను. మా ఊర్లోనే కాదు.. మా జిల్లాలోనే సినిమాలు గురించి తెలియదు. సినిమాలపై మోజుతో నేను ఇక్కడికి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు, సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి. సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ చూడటానికి జూబ్లీహిల్స్‌కు వచ్చాను. అలా నేను కెమెరా అసిస్టెంట్‌గా జాయిన్ అయి.. సినిమా ఇండస్ట్రీలో పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మేనేజర్ అయ్యాను. అనంతరం నిర్మాతగా మారాను అని బెక్కెం వేణుగోపాల్ చెప్పారు.

Bekkem Venugopal

16 ఏళ్లలో ఏం సంపాదించానంటే?: సినిమా రంగానికి వచ్చినప్పటి నుంచి చూసుకొంటే నా 16వ బర్త్ డే. నేను 2006లో అక్టోబర్ 12న టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా రిలీజైంది. ఆ సినిమా హిట్ కావడంతో అందరం పండుగ చేసుకొన్నాం. వేరే బిజినెస్ ఏమీ చేయలేదు. మొదటి సినిమా నుంచి వరుసగా సినిమాలు చేసుకొంటూ ఇప్పటి వరకు నా బ్యానర్‌లో 12 సినిమాలు, వేరే వారితో కలిసి 4 సినిమాలు చేశాను. ఈ 16 ఏళ్లలో నేను సంపాదించింది కేవలం అనుభవం మాత్రమే అని అని బెక్కెం వేణు గోపాల్ అన్నారు.

కథలను నమ్ముకొని మాత్రమే...: అందరి జీవితంలో కష్టాలు ఉంటాయి. అలాగే నాకు కూడా కష్టాలు ఉన్నాయి. ఎప్పుడూ గొప్ప సినిమాలు చేయాలనే తపన ఉంది. ప్రపంచవ్యాప్తంగా నాకు గుర్తింపు రావాలని తపిస్తున్నాను. కథలను నమ్ముకొనే నిర్మాతగా నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. భారీ ప్రాజెక్టులు చేయలేకపోవడానికి నాకు కొంత అసంతృప్తి ఉంది. నేను తొలి సినిమా పూర్తి చేయగానే.. రెండో సినిమా కథ రెడీగా ఉండేది. అలా ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా ఉండటంతో పెద్ద సినిమాల మీద నేను దృష్టిపెట్టలేకపోయాను. ప్రస్తుతం రెండు భారీ సినిమాలు ప్లాన్ చేశాను. వాటి స్క్రిప్టు వర్క్ జరుగుతున్నది అని బెక్కెం వేణుగోపాల్ తెలిపారు.

Bekkem Venugopal

నిర్మాతగా నా ప్రయాణం ఎలా ఉందంటే? : నేను లోకల్, హుషారు సినిమాలు నాకు గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చాయి. నా వద్దకు వచ్చి కథలు చెప్పారు. నాకు వారు చెప్పిన కథలు నచ్చాయి. అప్పుడు వారెవరో తెలియదు. కొత్త దర్శకులు, తెలియని హీరోలతో సినిమాలు తీసి అద్బుతాలుగా మారాయి. నేను ఎప్పుడూ కథలనే నమ్ముకొన్నాను. నిర్మాతగా నా ప్రయాణం చాలా సంతృప్తికరంగా సాగుతున్నది. నేను మంచి సినిమాలు తీసినప్పుడల్లా ప్రేక్షకులను నన్ను నిరాశకు గురి చేయలేదు. కానీ మంచి సినిమాలు తీయలేని ఒకట్రెండు పరిస్థితుల్లో నేనే వారిని నిరాశకు గురి చేశాననే ఫీలింగ్ కలుగుతుంది అని బెక్కెం వేణు గోపాల్ తెలిపారు.

Bekkem Venugopal

దిల్ రాజుతో నాది గ్రేట్ జర్నీ : ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో నా ప్రయాణం సినిమా చూపిస్తా మామ తో మొదలైంది. అప్పటి నుంచి ఆయనతో నా జర్నీ నమ్మకంగా సాగుతున్నది. నా ప్రాజెక్టుల గురించి ఆయనకు చెబుతాను. ఆ గ్రేట్ జర్నీకి దిష్టి తగలకూడదని అనుకొంటాను. మేము కలిసి సినిమాలు చేస్తాం. ఆయనతో నా జర్నీ కొనసాగిస్తూనే ఉంటా. సినిమా చూపిస్త మామ, ఆ తర్వాత నేను లోకల్ నుంచి మా ఇద్దరి బంధం కొనసాగుతున్నది. మా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. అందుకే మా బంధం బలంగా ఉంది అని నిర్మాత బెక్కెం వేణు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X