నాన్న ఒప్పుకోలేదు... అమ్మ, తమ్ముడు కంటతడి పెట్టారు.. శ్రీనివాస్ బెల్లంకొండ

నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శ్రీనుతో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి వాస్తవికతను ప్రతిబింబించే.. అలాగే హీరోయిన్ ఓరియెంట్ మూవీ సీతలో ఓ భావోద్వేగమై పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సీత చిత్రం మే 24న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. శ్రీనివాస్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

తేజ సార్ రెండు కథలు చెబితే

తేజ సార్ రెండు కథలు చెబితే

దర్శకుడు తేజ నాకు రెండు కథలు చెప్పాడు. నేను నాన్న (బెల్లంకొండ సురేష్) కలిసి విన్నాం. నాకు సీత కథ బాగా నచ్చింది. మరో కథ నాన్నకు నచ్చింది. అయితే నేను సీత కథను చేయడానికి సిద్ధమయ్యాను. కానీ నాన్న వద్దన్నా వినలేదు. ఈ కథ అంతగా నచ్చింది. నటుడికి అప్పుడప్పుడు లభించే గొప్ప అవకాశం అని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.

మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా

మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా

సీత చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. పోలీస్ పాత్రలంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. వరుసగా రెండో చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాను. అలాగే రెండోసారి కాజల్ అగర్వాల్‌తో జతకట్టాను. సీత చిత్రంలో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. నా పాత్ర చుట్టే సినిమా తిరుగుతుంది. అమాయకమైన పోలీస్ పాత్రలో కనిపిస్తాను అని శ్రీనివాస్ అన్నారు.

తేజ సార్‌తో పనిచేయడం

తేజ సార్‌తో పనిచేయడం

దర్శకుడు తేజతో పనిచేయడం చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తేజా సార్ మళ్లీ సినిమా ఎప్పుడు మొదలుపెడుదామని అడుగుతున్నాను. తొలి రోజే నాకు చాలా పేజీల డైలాగ్‌లు ఇచ్చి పరీక్ష పెట్టాడు. ఆయన పెట్టిన పరీక్షలో పాస్ కావడంతో నాకు చాలా దగ్గరయ్యాడు. నా నటనాప్రతిభను మెచ్చుకొన్నారు అని శ్రీనివాస్ తెలిపారు.

 అమ్మ, తమ్ముడు ఎమోషనల్‌గా

అమ్మ, తమ్ముడు ఎమోషనల్‌గా

సీత చిత్రాన్ని నా తల్లి, తమ్ముడికి చూపించాను. వాళ్లు చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. అమ్మ, తమ్ముడికి నా క్యారెక్టర్‌ బాగా నచ్చింది. సినిమాలోని నా పాత్రను చూసి కంటతడిపెట్టారు. సినిమా చివరి 30 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని శ్రీనివాస్ పేర్కొన్నారు.

పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్‌తో

పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్‌తో

సీత చిత్రంలో పాయల్ రాజ్‌పుత్‌ది స్పెషల్ అప్పీయరెన్స్. ఓ ప్రత్యేకమైన పాటలో ఆమె ఫెర్ఫార్మ్ చేసింది. సినిమా అంతా ఎమోషనల్‌గా సాగడం వల్ల ప్రేక్షకుడికి రిలీఫ్ ఇవ్వడానికి ఆ పాటను ప్లాన్ చేశారు. పాయల్ రాజ్‌పుత్‌ పాటలో నేను ఉండను. కేవలం ఆమె పైనే చిత్రీకరించారు అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X